AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Faima: ‘అందుకే మేం దూరమయ్యాం’.. ప్రవీణ్‌తో వీణ్‌తో బ్రేకప్‌కు అసలు కారణం చెప్పేసిన ఫైమా

ప‌టాస్ షోతో బుల్లితెరకు పరిచయమైన ఈ కామెడీ క్వీన్ జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన కామెడీ పంచులు, ప్రాసలు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. ముఖ్యంగా పటాస్ ప్రవీణ్ తో ఫైమా చేసిన స్కిట్లు బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అయితే ఆన్‌స్క్రీన్‌లో జంటగా కనిపించే ఫైమా, ప్రవీణ్ రియల్ లైఫ్‌ లోనూ ప్రేమలో మునిగితేలుతున్నారని ప్రచారం జరిగింది.

Jabardasth Faima: 'అందుకే మేం దూరమయ్యాం'.. ప్రవీణ్‌తో వీణ్‌తో బ్రేకప్‌కు అసలు కారణం చెప్పేసిన ఫైమా
Jabardasth Faima
Basha Shek
|

Updated on: May 06, 2024 | 6:06 PM

Share

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పురుషులదే ఆధిపత్యం ఉంటుంది. అది బుల్లితెర అయినా.. వెండితెర అయినా. ముఖ్యంగా తెలుగు బుల్లితెరపై మేల్ కమెడియన్ల ఆధిపత్యమే ఎక్కువ. అయితే అప్పుడప్పుడు కొందరు లేడీ కమెడియన్స్ కూడా బుల్లితెరపై సత్తా చాటుతున్నారు. తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో ఫైమా ముందుంటుంది. ప‌టాస్ షోతో బుల్లితెరకు పరిచయమైన ఈ కామెడీ క్వీన్ జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన కామెడీ పంచులు, ప్రాసలు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. ముఖ్యంగా పటాస్ ప్రవీణ్ తో ఫైమా చేసిన స్కిట్లు బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అయితే ఆన్‌స్క్రీన్‌లో జంటగా కనిపించే ఫైమా, ప్రవీణ్ రియల్ లైఫ్‌ లోనూ ప్రేమలో మునిగితేలుతున్నారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే వీరిద్దరూ కలిసి ఇన్ స్టాలో రీల్స్ చేయడం, పోస్ట్‌ లు షేర్ చేసుకోవడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడంలో ఫైమా, ప్రవీణ్ ల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని జనాలు భావించారు. అయితే ఇంతలోనే ఒక షాకింగ్ విషయం చెప్పాడు ప్రవీణ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫైమా తన ప్రేమను తిరస్కరించిందని ప్రవీణ్ వెల్లడించాడు. ఇప్పుడు ఇదే విషయంపై ఫైమా కూడా స్పందించంది.

‘టీవీ షోలు, ప్రోగ్రామ్ వేదికలపై క‌నిపించే జోడీలేవీ నిజం కాదు. అవి నిజ‌మ‌ని అసలు న‌మ్మొద్దు. ప్ర‌వీణ్‌, న‌న్ను ఆన్‌స్క్రీన్‌లో జోడీగా చూపించారు. ఆడియెన్స్ మా జంట‌ను ఆద‌రించారు. దాన్ని వాడుకుంటూ మేం కూడా యూట్యూబ్‌లో వీడియోలు, రీల్స్ చేశాం. అయితే ప్ర‌వీణ్‌కు, నాకు మ‌ధ్య కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరి ముందు అవి చెప్పుకోలేం. అందుకే మేం దూరం కావాల్సి వ‌చ్చింది. ఇప్పుడు మేం కనీసం మాట్లాడుకోవ‌ట్లేదు కూడా’. గొడవ జరిగినప్పుడు దానిని పూర్తిగా పక్కన పెట్టేయాలి తప్ప అందరి ముందు చెప్పుకుని సమస్యను పెద్దది చేయకూడదు. కానీ ప్రవీణ్ కు తల్లితండ్రులు లేకపోవడంతో అతను మాట్లాడే మాటలు అతనిపై సింపథీకి దారి తీస్తున్నాయి. ఈ కారణంగా జనాలు నన్ను నెగెటివ్ గా చూస్తున్నారు. దయచేసి మా రిలేషన్ కు ఏ పేరూ పెట్టకండి’ అని అభ్యర్థించింది ఫైమా. ప్రస్తుతం ఈ లేడీ కమెడియన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

ప్రవీణ్ తో ఫైమా.. వీడియో

View this post on Instagram

A post shared by FAIMA (@faima_patas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
పుట్టింటి నుంచి భార్యను తిరిగి తెచ్చుకున్నాడు.. ఇలా ఇంటికి..
పుట్టింటి నుంచి భార్యను తిరిగి తెచ్చుకున్నాడు.. ఇలా ఇంటికి..
గుండెపోటు వచ్చిన వెంటనే ఇలా చేస్తే.. మీ ప్రాణం పదిలమే!
గుండెపోటు వచ్చిన వెంటనే ఇలా చేస్తే.. మీ ప్రాణం పదిలమే!
సంజూ శాంసన్ ఆస్తుల చిట్టా వింటే దిమ్మతిరగాల్సిందే
సంజూ శాంసన్ ఆస్తుల చిట్టా వింటే దిమ్మతిరగాల్సిందే
ఎడారి దేశంలో మళ్లీ దంచికొడుతున్న వర్షాలు.. నీటమునిగిన దుబాయ్‌!
ఎడారి దేశంలో మళ్లీ దంచికొడుతున్న వర్షాలు.. నీటమునిగిన దుబాయ్‌!