Brahmamudi, May 7th episode: ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్.. ఆ బాబు సుభాష్ బిడ్డే.. నిస్సహాయ స్థితిలో కావ్య!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కోడలికి సుభాష్ సపోర్ట్‌గా ఉంటాడు. అపర్ణ పట్టుదలకు.. రాజ్ భోజనం చేయకుండా అక్కడి నుంచి లేస్తాడు. కానీ కనికరించని అపర్ణ.. ఆ బిడ్డను వదిలేసి రా.. సంతోషంగా ఉందామని చెప్తుంది. అయినా రాజ్ పట్టుదల వీడడు. ఆకలి చచ్చి పోయిందని వెళ్తాడు. ఆ తర్వాత అపర్ణ కూడా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఈ సీన్ కట్ చేస్తే.. అప్పూ పంపించే వీడియో కోసం ఎంతో టెన్షన్‌గా ఎదురు చూస్తూ ఉంటుంది కావ్య. అప్పుడే అప్పూ కాల్ చేసి..

Brahmamudi, May 7th episode: ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్.. ఆ బాబు సుభాష్ బిడ్డే.. నిస్సహాయ స్థితిలో కావ్య!
Brahmamudi
Follow us

|

Updated on: May 07, 2024 | 12:30 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కోడలికి సుభాష్ సపోర్ట్‌గా ఉంటాడు. అపర్ణ పట్టుదలకు.. రాజ్ భోజనం చేయకుండా అక్కడి నుంచి లేస్తాడు. కానీ కనికరించని అపర్ణ.. ఆ బిడ్డను వదిలేసి రా.. సంతోషంగా ఉందామని చెప్తుంది. అయినా రాజ్ పట్టుదల వీడడు. ఆకలి చచ్చి పోయిందని వెళ్తాడు. ఆ తర్వాత అపర్ణ కూడా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఈ సీన్ కట్ చేస్తే.. అప్పూ పంపించే వీడియో కోసం ఎంతో టెన్షన్‌గా ఎదురు చూస్తూ ఉంటుంది కావ్య. అప్పుడే అప్పూ కాల్ చేసి.. వీడియో పంపించా అని చెప్తుంది. ఆ వీడియో ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని కంగారు పడుతుంది. మరోవైపు రాజ్ బయట బాధ పడుతూ ఉంటాడు. అక్కడికి సుభాష్ వచ్చి.. నా కోసం నువ్వు బయటకు వెళ్లడం కరెక్ట్ కాదు.. నా వల్లే ఇదంతా అని బాధ పడతాడు.

ఉరికి సిద్ధమైన సుభాష్..

మరోవైపు నిజం అంతా చెప్తూ ఉంటాడు సుభాష్. నువ్వు ఇంటికి తిరిగి వెళ్తూ.. నన్ను చూడకుండా ఉండాల్సింది. నువ్వు నేరుగా ఇంటికి వెళ్లి పోయి ఉంటే.. ఈ రోజు అందరూ సంతోషంగా ఉండేవాళ్లు అని సుభాష్ అంటే.. కానీ నువ్వు ప్రాణాలతో ఉండేవాడివి కాదు కదా డాడ్ అని రాజ్ అంటాడు. ఇక్కడే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతూ ఉంటుంది. ఈ లోపు వీడియో చూసి షాక్ అవుతుంది కావ్య. అప్పుడు నా ఒక్కడితోనే పోయేది కదా రాజ్.. కానీ ఈ రోజు ఇంట్లో అందరూ బాధ పడుతున్నారు. ప్రతీ క్షణం చావును అనుభవిస్తున్నాను. ఆ రోజు నన్ను వదిలేయాల్సిందని సుభాష్ అంటాడు.

మాయతో సుభాష్ ఎఫైర్..

ఆ నెక్ట్స్ ఫిబ్రవరి 18వ తేదీ రోజు జరిగిన స్టోరీ అంతా చూపిస్తారు. సుభాష్ ఉరి వేసుకుంటూ ఉండగా.. రాజ్ వచ్చి ఆపుతాడు. ఏంటి డాడ్ ఏమైంది? ఏం జరిగిందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? అసలు ఏమైంది మీకు? అని అడుగుతాడు. మీ ప్రాణం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. నన్ను నమ్మండి.. జరిగింది ఏంటో చెప్పండి అని రాజ్ అడుగుతాడు. ఏం చెప్పాలిరా.. నేను అసలు ఇంత పెద్ద తప్పు చేస్తాను అని అనుకోలేదు. మీ అమ్మకు అన్యాయం జరిగింది. మన వంశ గౌరవానికి భంగం కలిగింది. నాకు అసలు తలెత్తుకుని బతికే హక్కే లేదు. ఒకసారి నేను వైజాగ్ బ్రాంచ్‌కి వెళ్లినప్పుడు.. అక్కడ సెక్రటరీ మాయతో పరిచయం అయింది. ఆ రోజు రాత్రి అన్నీ మర్చిపోయి.. తప్పు చేశాను. కానీ ఆ తప్పు ఆ రోజుతోనే ముగిసిపోయింది. అంతా మర్చిపొమ్మని చెప్పి మాయ వెళ్లిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ ఫోన్ చేసి నా వల్ల బాబు పుట్టాడు అని చెప్పింది. ఇప్పుడు ఆ బిడ్డను ఇంటికి తీసుకొచ్చి.. వారసుడిగా పెంచాలి అని.. లేదంటే మీడియా ముందుకు వెళ్తానని బెదిరిస్తుంది.

ఇవి కూడా చదవండి

నా బిడ్డగా ఇంటికి తీసుకొస్తాను..

ఎన్ని రకాలుగా చెప్పినా వినడం లేదు. ఇప్పుడు నేరుగా ఇంటికి వస్తానని అంటుంది. ఈ నిజం బయట పడితే.. అందరికీ అన్యాయం చేసిన వాడిని అవుతాను. అందుకే నేను చచ్చిపోదాం అనుకున్నా అని సుభాష్ అంటాడు. అది విన్న రాజ్.. ప్రశాంతంగా ఇంటికి వెళ్లండి. అంతా నేను చూసుకుంటాను. నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆ బిడ్డను నా బిడ్డగా ఇంటికి తీసుకొస్తాను. మీ బిడ్డగా ఇంటికి తీసుకొస్తే.. అమ్మ గుండె పగిలి పోతుంది. నానమ్మ, తాతయ్య ఎంతో బాధ పడతారు. మన కుటుంబం అల్లరి పాలు అవ్వడం కంటే.. అదేదో నేనే మోస్తాను అని రాజ్ అంటాడు. కానీ సుభాష్ ఒప్పుకోడు. కానీ రాజ్ బలవంతంగా సుభాష్‌ని ఒప్పిస్తాడు. ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా.. ఎలాంటి అవమానాలు ఎదురైనా.. నిజాన్ని బయట పెట్టకండి.. నా మీద ఒట్టు అని చెప్తాడు రాజ్.

సుభాష్ బిడ్డని తెలిసి షాక్ అయిన కావ్య..

అదంతా చూసి.. ఆ బిడ్డకు తండ్రి మావయ్య గారా? అత్తయ్య గారికి ఈ విషయం తెలీకూడదనా? అని కావ్య అనుకుంటుంది. చాలు రాజ్ ఇక నేను సహించలేను. వెళ్లి నిజం చెప్పేస్తాను. నువ్వు ఇంట్లోంచి వెళ్తుంటే చూస్తూ ఊరుకోలేనని సుభాష్ అంటే.. రాజ్ నచ్చజెప్పాలని ట్రై చేస్తాడు. తప్పు నేను చేశాను రా నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? అని సుభాష్ అంటాడు. అమ్మ కోసం.. నేను తప్పు చేస్తే అరిచి ఊరుకుంది. మీరు తప్పు చేశారని తెలిస్తే.. తన గుండె ఆగిపోతుంది. అమ్మ కోసం ఇది తప్పదు డాడ్ అంటాడు రాజ్. ఆ తర్వాత కృష్ణుడి దగ్గరకు వెళ్లి.. తన బాధను చెప్పుకుంటుంది కావ్య. ఈ గొడవలు అన్నింటికి కారణం తెలుసుకుని.. ఆయన్ని ఇంట్లోనే ఉండేలా చూద్దాం అనుకుంటే.. ఆ తప్పు ఈ ఇంటి మనిషే చేసేలా చేశావ్. ఇప్పుడు నేనేం చేయాలి? అని బాధ పడుతూ ఉంటుంది కావ్య. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..