విదుర నీతి: అప్పు తీసుకునే ముందు జాగ్రత్త.. ఇది మీకు శాపం కావచ్చు!

samatha

24 April 2026

instagram

మహాత్మ విదురుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన ఎన్నో నీతి వ్యాఖ్యలను తెలియజేశారు.

మహాత్మ విదురుడు

మహాభారతంలో విదురుడిది కీలక పాత్ర, ఈయన ధృతరాష్ట్రల వారికి సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేవాడు.

మహాభారతం

ఇక మహాభారతంలోని విదుర నీతి ప్రకారం, తప్పుడు వ్యక్తి నుంచి డబ్బు అప్పుగా తీసుకోవడం లేదా ఇవ్వడం చాలా ప్రమాదకరం అంట.

అప్పు తీసుకోవడం

కాగా, మహాత్మ విదురుడి ప్రకారం ఎలాంటి వ్యక్తుల నుంచి అప్పు తీసుకోవడం ప్రమాదకరమూ చూద్దాం.

ఎప్పుడు ప్రమాదకరం

స్వార్థపరులు, దురాశ పరులైన వ్యక్తుల నుంచి డబ్బు తీసుకోవడం అస్సలే మంచిది కాదు అంటున్నాడు విదురుడు.

స్వార్థం ఉన్నవారు

అదే విధంగా విభేదాలు సృష్టించడం లేదా కుటుంబ కలహాలకు కారణమయ్యే వ్యక్తి నుంచి అప్పు తీసుకోకూడదంట.

విభేదాలు సృష్టించేవారు

ఉద్దేశపూర్వకంగా ఇతరులకు బాధ కలిగించే వ్యక్తి నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకూడదంట.

ఇతరులకు బాధ కలిగించే వ్యక్తి

అలాగే ఇతరుల గురించి చాడీలు చెప్పే వారు, నిందలు వేసే వారి నుంచి కూడా అప్పు తీసుకోకూడదు అని చెబుతున్నాడు విదురుడు.

నిందలు వేసే వ్యక్తి