Tollywood: బుల్లితెర నటికి లైంగిక వేధింపులు.. అడిషన్‏కు పిలిచి అసభ్యకర సందేశాలు..

ఇప్పుడు మరో బుల్లితెర నటి క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అంటూ తనను తాను పరిచయం చేసుకుని అడిషన్ అని పిలిచి అసభ్యకరమైన సందేశాలు పంపించారని.. వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కన్నడ, తెలుగు సీరియల్ నటి అమూల్య గౌడ బెంగుళూరు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై ఆర్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

Tollywood: బుల్లితెర నటికి లైంగిక వేధింపులు.. అడిషన్‏కు పిలిచి అసభ్యకర సందేశాలు..
Amulya Gowda
Follow us

|

Updated on: May 07, 2024 | 8:45 PM

సినీ పరిశ్రమలో నటీమణులు ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ వేధింపులను ఎదుర్కొంటారు. ఏదోక సందర్భంలో హీరోయిన్స్ ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. చాలా దశాబ్దాలుగా ఈ పదం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. సినిమా నటీనటులకే కాకుండా.. సీరియల్ నటీమణులు కూడా ఈ వేధింపులను ఎదుర్కొంటున్నారు. దర్శకనిర్మాతలు, రచయితలు, తోటీ నటుల నుంచి ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ఇప్పటికే చాలా మంది నటీమణులు ఆరోపించారు. గతంలో ఈ క్యాస్టింగ్ కౌచ్ పేరు ఎక్కువగా వినిపించింది. అప్పట్లో కొందరు తారలు తమకు ఎదురైన పరిస్థితి గురించి బహిరంగంగానే మాట్లాడారు. మరికొందరు ఈ వేధింపులకు బలయ్యారు. ఇప్పుడు మరో బుల్లితెర నటి క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అంటూ తనను తాను పరిచయం చేసుకుని అడిషన్ అని పిలిచి అసభ్యకరమైన సందేశాలు పంపించారని.. వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కన్నడ, తెలుగు సీరియల్ నటి అమూల్య గౌడ బెంగుళూరు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై ఆర్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

కాస్టింగ్ డైరెక్టర్ అంటూ పరిచయం చేసుకున్న సూర్య అనే వ్యక్తి తనకు ఓ సినిమాలో అవకాశం ఇప్పి్స్తానంటూ నమ్మబలికాడు. ఆ తర్వాత వాట్సాప్ లో తన స్టేటస్ ‏కు రిప్లై ఇస్తూ అసభ్యకరమైన సందేశాలు పంపించాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే వెళ్లి ఏ పోలీసులకు చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరించాడని.. రాత్రాంతా వాట్సాప్ లో అసభ్యకర మెసేజ్ లు పంపుతూ.. కాల్స్ చేస్తూ వేధించాడను. అతడి ప్రవర్తనతో విసికిపోయిన అమూల్య బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అతడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి హెచ్చరించాలని ఫిర్యాదులో పేర్కొంది అమూల్య. అయితే మొదట్లో ఈ కేసును పోలీసులు అంతగా పట్టించుకోలేదు. కానీ సూర్య అనే వ్యక్తి వేధింపులు మరింత తీవ్రం కావడంతో మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది అమూల్య. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అమూల్య గౌడ తెలుగులో పలు హిట్ సీరియల్స్ లో నటిస్తుంది. అలాగే అటు కన్నడ సీరియల్స్ కూడా చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
ఈ 5 లక్షణాలు.. కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు..
ఈ 5 లక్షణాలు.. కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు..