AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC driver Shankar Goud: నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి

రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య యత్నం చేయగా.. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన ఆర్టీసీ కార్మికులు జిల్లా వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు..

TGSRTC driver Shankar Goud: నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి
Narasampeta depot RTC driver Shankar Goud
Srilakshmi C
|

Updated on: Apr 24, 2026 | 7:15 AM

Share

వరంగల్, ఏప్రిల్‌ 24: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నర్సంపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ పెట్రోల్‌ పోసుకుని మృతి చెందాడు. నిన్నపెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్‌గౌడ్.. కంచన్‌బాగ్‌ DRDO అపోలోలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. శుక్రవారం రాత్రి 2:30 సమయంలో శంకర్‌గౌడ్‌ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో వైద్యులు పంచనామా నిర్వహించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

ఆర్టీసీ డ్రైవర్ మరణంపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్, రామచంద్రరావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను గాలికొదిలేయడంవల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పక్షాన బండి సంజయ్ కుమార్ శంకర్ గౌడ్‌ అంత్య క్రియలకు హాజరుకానున్నారు. మరోవైపు RTCడ్రైవర్ శంకర్ గౌడ్ మృతి నేపద్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో RTC JAC వరంగల్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. ఎలాంటి అల్లర్లు జరుగకుండా పోలీసులు ముందస్తుగా మోహరించారు. హనుమకొండలో RTC డిపో ముందు RTC కార్మికులు, BRS శ్రేణులు ధర్నా చేపట్టారు.

ఈ రోజు నర్సంపేటకు కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు రానున్నారు. మరికొద్ది సేపట్లో నర్సంపేటకు శంకర్ గౌడ్ మృత దేహం తరలించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని RTC కార్మికులతో పాటు, రాష్ట్ర JAC నాయకులు అంతిమ సంస్కారాలలో పాల్గొనాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య ప్రయత్నాలకు వెళ్లడం బాధాకరం.. ఎమ్మెల్సీ విజయశాంతి

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన ఆందోళనతో ఉద్వేగానికి గురై ఆత్మహత్య ప్రయత్నాలకు వెళ్లడం అత్యంత బాధాకరం. తెలంగాణ అమరులు తమ పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నది తిరిగి సమస్యలకు ఆత్మబలిదారుల కోసం కాదు. కార్మిక సోదరులారా తెలంగాణ బిడ్డ ఆయన మీలో ఏ ఒక్కరు ఈ విధమైన దుఃఖానికి ఎవరైనా తెలంగాణ సమాజం మొత్తం కలలతో ఎంతైనా బాధపడతది. దయచేసి ఏ ఒక్కరూ ఏ విధమైన ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చేతులెత్తి మొక్కి చెబుతున్నాను. ఆత్మహత్యకి పాల్పడ్డాడు నర్సంపేట సోదరుడు శంకర్ గౌడ్ గారు కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వానికి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి పరిస్థితిని చెక్కదిద్దాల్సిన బాధ్యత ఉన్నదని MLC విజయశాంతి ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us