AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశి వారికి అంచనాలకు మించి రాబడి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Rashi Phalalu (April 24, 2026): శుక్రవార రాశిఫలాల్లో చాలా రాశులకు అనుకూల గ్రహ సంచారం కనిపిస్తోంది. ఉద్యోగాల్లో పదోన్నతులు, ఆదాయ వృద్ధి, కుటుంబ సమస్యల పరిష్కారం వంటి శుభఫలితాలు కనిపిస్తుండగా, కొన్ని రాశులు ఖర్చులు, బాధ్యతల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద మేషం నుంచి మీనం వరకు చాలా మందికి పురోగతి, సానుకూల మార్పుల సూచనలు కనిపిస్తున్నాయి.

Horoscope Today: ఆ రాశి వారికి అంచనాలకు మించి రాబడి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Rashifal In Telugu 24 April 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 24, 2026 | 5:45 AM

Share

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2026): మేష రాశి వారికి ప్రస్తుతం గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగానే వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ప్రస్తుతం గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలను లాభాల బాటలో నడిపిస్తారు. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి క్రమంగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సోదరులతో, కొందరు బంధువులతో వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. కుటుంబం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆదాయానికి లోటుండదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికి రావు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగానే వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలున్నా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. సోదర వర్గంతో ఆస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం విషయంలో వైద్యుల్ని సంప్రదించాల్సి వస్తుంది. ఓ వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారమవుతుంది. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ప్రతిభను నిరూపించుకుంటారు. వాగ్దానాలకు ఇది సమయం కాదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. ఆదాయ పరంగా ఇతరులకు సహాయపడే స్థితిలో ఉంటారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త లక్ష్యాలు, బాధ్యతల్ని చేపడతారు. కొందరు బంధుమిత్రుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. శుభకార్యాల విషయంలో బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. బంధువుల్లో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అధికారులు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపా రాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు చాలావరకు పరిష్కారం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. పిల్లలు చదువుల మీద బాగా శ్రద్ధ పెంచడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. మొత్తం మీద గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు ఉంటాయి. సతీమణి ఏ రంగంలో ఉన్నప్పటికీ, పురోగతి ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగతంగా చిన్నా చితకా సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. కొందరు బంధువులకు, సన్నిహితు లకు ఆర్థికంగా సహాయపడతారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. తోబుట్టువులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. మీ సలహాలు, సూచనలకు అధికారులు విలువనిస్తారు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి చాలావరకు ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబసమేతంగా దైవకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు సాయపడతారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో, దైవ కార్యాల్లో గడుపుతారు. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
Horoscope Today: ఆ రాశి వారికి అంచనాలకు మించి రాబడి..
Horoscope Today: ఆ రాశి వారికి అంచనాలకు మించి రాబడి..
EAPCET 2026కు దరఖాస్తుల వెళ్లువ.. మొత్తం ఎన్ని లక్షలు వచ్చాయంటే?
EAPCET 2026కు దరఖాస్తుల వెళ్లువ.. మొత్తం ఎన్ని లక్షలు వచ్చాయంటే?
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం