Brahmamudi, May 8th episode: నిజం తెలిసినా చెప్పలేని కళావతి.. పాపం రుద్రాణి ఇరుక్కుపోయిందిగా..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఇన్నాళ్లు ఈ నిజం కోసమే పోరాడాను. ఇప్పుడు ఆ నిజం బయట పడినా.. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? నిజం చెప్తే ఆవిడ అసలు తట్టుకోగలదా.. అసలు తన భర్త తనని మోసం చేశాడని తెలిస్తే.. తను బ్రతుకుతుందా? ఇప్పుడు ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా.. ఇప్పుడు కూడా నువ్వే నాకు దారి చూపించు అని కృష్ణుడిని ప్రార్థిస్తుంది కావ్య. ఆ తర్వాత ప్రకాష్ కంగారుగా గదిలో..

Brahmamudi, May 8th episode: నిజం తెలిసినా చెప్పలేని కళావతి.. పాపం రుద్రాణి ఇరుక్కుపోయిందిగా..
Brahmamudi
Follow us

|

Updated on: May 08, 2024 | 12:27 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఇన్నాళ్లు ఈ నిజం కోసమే పోరాడాను. ఇప్పుడు ఆ నిజం బయట పడినా.. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? నిజం చెప్తే ఆవిడ అసలు తట్టుకోగలదా.. అసలు తన భర్త తనని మోసం చేశాడని తెలిస్తే.. తను బ్రతుకుతుందా? ఇప్పుడు ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా.. ఇప్పుడు కూడా నువ్వే నాకు దారి చూపించు అని కృష్ణుడిని ప్రార్థిస్తుంది కావ్య. ఆ తర్వాత ప్రకాష్ కంగారుగా గదిలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడే ధాన్య లక్ష్మి వచ్చి ఏంటి ఇంకా ఆఫీసుకు వెళ్లలేదా? అని అడుగుతుంది. ఇంట్లో ఇంత జరుగుతుంటే ఆఫీసుకు ఎలా వెళ్లమంటావ్? రాజ్‌కి వదిన ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుంది. ఒకవేళ రాజ్ నిజం చెప్పకపోతే.. ఇంట్లో నుంచి వెళ్లి పోవాల్సి ఉంటుందని ప్రకాశం అంటాడు. వెళ్లిపోనివ్వండి.. నిజం బయట పెట్టమని రాజ్‌కి చెప్పి.. తన మీద అరవండి. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే కదా అని రాజే కదా ఎప్పుడూ చెప్తూ ఉంటాడని ధాన్య లక్ష్మి అంటుంది. దీంతో ధాన్య లక్ష్మిపై సీరియస్ అవుతాడు.

నిజం చెప్పమన్న అప్పూ.. చెప్పలేనన్న కావ్య..

ఆ నెక్ట్స్.. అప్పూని కలుస్తుంది కావ్య. ఆ బిడ్డకు తండ్రి బావ కాదని.. మీ మావయ్య గారని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావ్? వెళ్లు నిజం చెప్పు. అంతా కలిసి ఆయన్ని అవమానించినా.. ఏమీ అనకుండా అంతా భరించాడని అప్పూ అంటుంది. అలా చెప్తే.. మీ బావ గారే చెప్పేవారు కదా అని కావ్య అంటుంది. ఆయన చెప్పలేదనే నువ్వు వెళ్లి చెప్పు అని అప్పూ అంటుంది. ఆ నిజం తెలిస్తే మా అత్తగారు తట్టుకోలేదు. తనకు ఇంత ద్రోహం చేశారని తెలిస్తే బ్రతుకుతుందా? నిజం తెలిసిన తర్వాత కూడా ఆయన ఎందుకు మౌనంగా ఉండిపోయారో నాకు ఇప్పుడు అర్థం అయిందని కావ్య అంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పకపోయినా.. ఆ బిడ్డ తల్లి ఎప్పుడో బయటకు వచ్చి నిజం చెప్పేస్తుందని అప్పూ అంటుంది. అందుకనే నేను ఓ నిర్ణయం తీసుకున్నా. ఆ తర్వాత పెన్ డ్రైవ్‌ని రాయితో కొట్టేస్తుంది కావ్య.

రుద్రాణితో గేమ్ స్టార్ట్ చేసిన స్వప్న.. అత్తకు ఇత్తడే..

ఈ సీన్ కట్ చేస్తే.. అపర్ణ హాలులో కూర్చొంటుంది. అపర్ణను చూసిన రుద్రాణి, రాహుల్‌లు ఎలాగైనా రాజ్‌ని ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఖాయం అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక వేళ వదిన ఇంట్లో ఉండమన్నా.. మిగతా వారిని రెచ్చగొట్టి.. రాజ్ వెళ్లిపోయేలా చేస్తానని అంటుంది రుద్రాణి. ఇక అప్పుడే రుద్రాణికి వడ్డీ వ్యాపారి కాల్ చేస్తాడు. నా డబ్బు ఎప్పుడు తిరిగి ఇస్తారు? అని సేటు అడుగుతాడు. ఉంటే తిరిగి ఇచ్చేవాళ్లం కదా.. అవి పోయాయి అందుకే చూసి మేమే ఇస్తామని రుద్రాణి చెప్తుంది. అయినా వినిపించుకోని వడ్డీ వ్యాపారి.. బెదిరిస్తాడు. అప్పుడే వచ్చిన స్వప్న.. కావాలనే డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఏంటి అత్తయ్యా కోటి రూపాయాలు కనిపించడం లేదా.. అయితే పదండి ఇంట్లో అందరికీ చెప్పి వెతుకుదామని అంటుంది. రుద్రాణి కక్కలేక మింగలేక వద్దులే స్వప్న.. నేను చూసుకుంటాను అని అంటుంది.

ఇవి కూడా చదవండి

రాజ్‌ని చూసి పొంగిపోతున్న కావ్య..

ఆ తర్వాత కావ్య ఇంట్లోకి వస్తూ.. రాజ్ భరించిన అవమానాల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్.. ఏంటి అలా చూస్తున్నావ్ అని అంటుంది. బాబుకు మీ నాన్న పోలికలు వచ్చాయని కావాలనే అంటుంది. రేపటితో మీ అమ్మగారు ఇచ్చిన గడువు ముగుస్తుంది. అది తెలిసినా.. మీరు నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉన్నారు. అది గమనిస్తుంటే వింతగా ఉందని కావ్య అంటే.. నాకు కూడా నిన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. స్వప్న కానీ, అనామిక కానీ ఈ పరిస్థితిలో ఉంటే.. ఈ పాటికి అందర్నీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ‌లో కూర్చేబెట్టేవారు. మరి నువ్వెందుకు ఇలా నిశ్చలంగా ఉన్నావో తెలీడం లేదని రాజ్ అంటాడు. నేను మనస్సాక్షి నమ్మిందే.. నా ఆత్మ సాక్షిగా చేస్తున్నా అని కావ్య అంటుంది. సరే కాసేపు బాబును చూసుకుంటావా.. గార్డెన్‌లో ఉంటాను అని రాజ్ అంటాడు.

రాజ్‌కు అపర్ణ ప్రశ్నలు..

రాజ్‌ కిందకు దిగగానే.. అపర్ణ వస్తుంది. రేపటి గురించి ఏం ఆలోచించావ్? రేపటితో నేను పెట్టిన గడువు ముగుస్తుంది. ఇప్పుడే వెళ్తాడా? లేక రేపటి వరకూ ఆగుతాడా? అని అపర్ణ అంటే.. నేను ఎప్పుడూ నీ మాటకు ఎదురు చెప్పలేదు మమ్మీ అని రాజ్ అంటాడు. అంటే నీ నిర్ణయం మారదా? అని అపర్ణ అడుగుతుంది. అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నా.. నీ నిర్ణయం కూడా మారదా అని ఇందిరా దేవి అడుగుతుంది. మారదు అత్తయ్యా.. వెళ్లిపోవాలని తెలిసినా.. ఇప్పుడు కూడా చెప్పడం లేదు. ఏ భయం నిన్ను పట్టి పీడిస్తుంది. నాతో చెప్పు.. మా అందరి ముందూ చెప్పు.. నీ సమస్యని తీరుస్తామని అపర్ణ అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..