AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi, May 20th episode: ట్విస్టులే ట్విస్టులు.. షాక్ ఇచ్చిన కావ్య.. టెన్షన్‌లో సుభాష్, రాజ్‌లు

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కిడ్నాపర్ల దగ్గర నుంచి కావ్యని కాపాడి ఇంటికి తీసుకొస్తాడు రాజ్. కావ్య మంచం మీద కూర్చుని ఉండగా.. అసలు నీకు బుద్ధి ఉందా? నీ గురించి నువ్వు ఏం అనుకుంటున్నావ్? ఏదో పెద్ద డిటెక్టీవ్‌లా అన్నింటికీ తయారై వెళ్తావ్? నీకైమన్నా అయి ఉంటే.. నేను రావడం కాస్త ఆలస్యం అయి ఉంటే.. ఏం జరిగి ఉండేదో తెలుసా? మాట్లాడవేంటే.. నోరు తెరు.. తింగరి ముఖం దానా..

Brahmamudi, May 20th episode: ట్విస్టులే ట్విస్టులు.. షాక్ ఇచ్చిన కావ్య.. టెన్షన్‌లో సుభాష్, రాజ్‌లు
Brahmamudi
Chinni Enni
|

Updated on: May 20, 2024 | 12:37 PM

Share

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కిడ్నాపర్ల దగ్గర నుంచి కావ్యని కాపాడి ఇంటికి తీసుకొస్తాడు రాజ్. కావ్య మంచం మీద కూర్చుని ఉండగా.. అసలు నీకు బుద్ధి ఉందా? నీ గురించి నువ్వు ఏం అనుకుంటున్నావ్? ఏదో పెద్ద డిటెక్టీవ్‌లా అన్నింటికీ తయారై వెళ్తావ్? నీకైమన్నా అయి ఉంటే.. నేను రావడం కాస్త ఆలస్యం అయి ఉంటే.. ఏం జరిగి ఉండేదో తెలుసా? మాట్లాడవేంటే.. నోరు తెరు.. తింగరి ముఖం దానా.. బిత్తిరి ముఖం దానా అని రాజ్ తిడుతూ ఉంటే.. కావ్య నవ్వుతూ ఉంటుంది. నవ్వుతూ ఉంటున్నావేంటే.. నేను తిడుతుంటే అని రాజ్ అంటే.. మీ తిట్లు చాలా తియ్యగా ఉన్నాయి. మీ కోపం తాపంగా ఉందని కావ్య అంటుంది. నేను ఏం మాట్లాడుతున్నాను? నువ్వేం మాట్లాడుతున్నావ్? చూడు.. నీకు బాబు వెనుక ఉన్న కథ తెలిసిపోయిందని నాకు తెలిసిపోయిందని రాజ్ అంటాడు. దీంతో కావ్ షాక్ అవుతుంది.

నిజం బటయ పడితే.. మా అమ్మ తట్టుకోలేదు..

ఏంటి నువ్వు మాట్లాడేది? ఈ నిజం నువ్వు బయట పెడితే అమ్మ తట్టు కుంటుందా? ఇన్ని అవమానాలు ఎదురైనా నేను ఎందుకు నిజం బయట పెట్టలేదో తెలుసా? నిజం చెప్పు ఆ మాయను ఇంటికి తీసుకురావడానికే కదా నువ్వు వెళ్లిందని రాజ్ అంటే.. అలా ఎందుకు అనుకుంటున్నారు. నేను మయను తీసుకురావడానికి వెళ్లలేదు. నిజాలు బయటకు తీసుకు రావడానికి వెళ్లాను. మాయ ఏదో మాయ చేస్తుంది. ప్రతి నెలా పది లక్షలు తీసుకుంటూ ఎక్కడో అజ్ఞాతంగా ఉంటే నాకు డౌట్ వచ్చింది. మీకేం డైట్ రావడం లేదా అని కావ్య అంటుంది. ఇదంతా నీకు అనవసరం. వీటి సంగతి వదిలేయ్. నీ పని నువ్వు చూసుకో అని రాజ్ అంటే.. క్షమించండి.. మీరు నన్ను ఆపలేరు అని కావ్య వెళ్లిపోతుంది.

కళ్యాణ్, అనామికను విడగొట్టేందుకు.. రుద్రాణి సలహా..

ఈ తర్వాత అనామిక ఇంట్లో మేడపై ఒంటరిగా నిలబడి ఉంటుంది. అనామికను చూసిన రుద్రాణి.. అమ్మో మొన్న మొగుడు మాట్లాడలేనందుకే.. ఇంతకు ముందు ఐడియా ఫెయిల్ అయినందుకే నన్ను నోటికి వచ్చినట్టు తిట్టింది. ఇప్పుడు మనం ఇచ్చిన ఐడియాకు ఏకంగా కళ్యాణ్ విడాకులే ఇచ్చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు నన్ను చంపేస్తుందేమో అని వెళ్లిపోతూ ఉండగా.. అనామిక ఆంటీ అని పిలుస్తుంది. కళ్యాణ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని నేను అస్సలు అనుకోలేదు. హమ్మయ్యా ఏంటి అది నన్ను తిడుతుంది అనుకుంటే.. మొగుడి గురించి బాధ పడుతుందా అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు ఆంటీ అని అనామిక అంటే.. నువ్వు కళ్యాణ్‌తో ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటే.. ఎలా కుదురుతుంది. చూశావుగా టైమ్‌కి ఆ అప్పూ ఎలా వచ్చిందో.. పక్కాగా ప్లాన్ వేసి ఇదంతా చేశారని రుద్రాణి అంటే.. మా మమ్మీ డాడీ వస్తున్నారని కళ్యాణ్‌కి తెలీదని చెబుతుంది అనామిక. నీకు విడాకులు ఇవ్వాలని ఫిక్స్ అయినప్పుడు.. వాళ్ల గురించి ఎందుకు ఆలోచిస్తారు చెప్పు. నువ్వు కళ్యాణ్‌ని ఒంటరి వాడిని చేయ్. ముందు దాని గురించి ఆలోచించు అని రుద్రాణి సలహా ఇస్తుంది. సరే ఆంటీ అని అనామిక వెళ్తుంది.

ఇవి కూడా చదవండి

నీ అన్వేషణ ఇక్కడితో ఆపేయ్.. వినిపించుకోని కావ్య..

కట్ చేస్తే.. తెల్లవారుతుంది. కావ్య టీ తీసుకువచ్చి ఇస్తుంది. కానీ రాజ్ పట్టించుకోనట్టు ఉంటుంది. దీంతో టీ కావ్యనే తాగుతుంది. ఆ తర్వాత రాజ్‌కి టవల్ తీసుకువచ్చి ఇస్తుంది కావ్య. కానీ రాజ్ తీసుకోడు. సరే.. ఈ టవల్‌ని వీడి ముడ్డి కింద వేస్తాను. మెత్తగా ఉంటుందని అంటుంది. నాతో మాట్లాడరా? అని కావ్య అంటే.. ఇక నుంచి నాతో మాట్లాడొద్దు. వాడి తల్లిని తీసుకొచ్చే పని మానవా. కత్తికి లేని దురద కందకు ఎందుకే అని రాజ్ అంటే.. మానుకోను.. నేను ఇప్పుడు ఆ మాయని వెతికితే నేను ప్రమాదంలో పడతాననా.. లేక మీరు అత్తయ్య, మావయ్య ప్రమాదంలో పడతారనా? చెప్పండి అని కావ్య అంటే.. సరే అలాగే అనుకో.. నీ అన్వేషణ ఇక్కడితో ఆపేయ్ అని రాజ్ చెప్తాడు. ఇక రాజ్ ఎంత చెప్పినా.. కావ్య అస్సలు ఒప్పుకోదు. నా అన్వేషణ ఆపను. ఈలోపు మా మరిది గారెని చూసుకోండి. నేను వెళ్లి ఉగ్గు తీసుకొస్తానని అంటుంది.

తప్పు చేశానని కమిలిపోతున్న సుభాష్..

ఈ సీన్ కట్ చేస్తే.. అందరూ హాలులో కూర్చుని ఉంటారు. అప్పుడే పంతులు గారు వస్తారు. అప్పుడే రుద్రాణి కావాలనే పుల్ల విరుపు మాటలు మాట్లాడితే.. స్వప్న కౌంటర్ ఇస్తుంది. భద్రాచలం నుంచి సీతారాముల కళ్యాణం అక్షింతలు వచ్చాయి. అవి తీసుకొచ్చాను. ఈ అక్షింతలను.. భార్య తలపై వేస్తే.. చాలా మంచిదని పంతులు గారు చెప్తారు. ఇక వరుసగా అందరూ నిల్చుంటారు. పంతులు గారు అక్షింతలు ఇస్తారు. ఒకరి తర్వాత ఒకరు అందరూ అక్షింతలు తీసుకుంటారు. కేవలం రుద్రాణి, అనామిక మాత్రం ఒంటరిగా నిల్చుంటారు. ఇప్పుడు పెద్దాయన.. పెద్దావిడను ఆశీర్వదిస్తారు. నెక్ట్స్ అపర్ణను ఆశీర్వదించడానికి మాత్రం సుభాష్ సంకోచిస్తూ ఉంటాడు. నేను తప్పు చేశాను అపర్ణా అని సుభాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అపర్ణ ఆశీర్వదించమని అడిగిన కాసేపటికి అక్షింతలు వేస్తాడు. ఆ తర్వాత రాజ్, రాహుల్‌లు కావ్య, స్వప్నలను ఆశీర్వదిస్తారు. ఇక ఇవాళ్టితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..
పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. డిసెంబర్ 18 వరకే ఛాన్స్!
పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. డిసెంబర్ 18 వరకే ఛాన్స్!
15 మందితో టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్.. ఆ ఇద్దరిని ఛీకొట్టిన గంభీర్?
15 మందితో టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్.. ఆ ఇద్దరిని ఛీకొట్టిన గంభీర్?
చైనా, జపాన్‌తో పోటీ.. గ్లోబల్ సమ్మిట్‌లో రేవంత్ కామెంట్స్
చైనా, జపాన్‌తో పోటీ.. గ్లోబల్ సమ్మిట్‌లో రేవంత్ కామెంట్స్
కోకాపేట ప్లాట్లకు అందుకే ఆ రేంజ్‌ ధరలు
కోకాపేట ప్లాట్లకు అందుకే ఆ రేంజ్‌ ధరలు
నిరుద్యోగులకు భలే న్యూస్.. రాత పరీక్షలేకుండా సింగరేణిలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు భలే న్యూస్.. రాత పరీక్షలేకుండా సింగరేణిలో ఉద్యోగాలు
అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది: సీఎం రేవంత్ రెడ్డి
అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది: సీఎం రేవంత్ రెడ్డి
నటి వేధింపుల కేసులో A8 దిలీప్‌పై కేసు కొట్టివేత
నటి వేధింపుల కేసులో A8 దిలీప్‌పై కేసు కొట్టివేత