AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Faima: ‘ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నాం’.. లవర్‌ను పరిచయం చేసిన ఫైమా.. ఫొటోస్ ఇవిగో

ప్రవీణతో కలిసి ఫైమా చేసిన స్కిట్స్ కామెడీ ప్రియులను కడుపుబ్బా నవ్వించాయి. అయితే ఆన్ స్క్రీన్‌లో జంటగా కనిపించే ఫైమా, ప్రవీణ్ రియల్ లైఫ్‌ లోనూ లవ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇద్దరూ కలిసి ఇన్ స్టాలో రీల్స్ చేయడం, పోస్ట్ లు షేర్ చేసుకోవడం, గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకోవడం ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే ఉన్నట్లుండి ఈ జోడీ బ్రేకప్ చెప్పుకుంది.

Jabardasth Faima: 'ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నాం'.. లవర్‌ను పరిచయం చేసిన ఫైమా.. ఫొటోస్ ఇవిగో
Jabardasth Faima
Basha Shek
|

Updated on: May 19, 2024 | 6:31 PM

Share

బుల్లితెర అయినా.. వెండితెర అయినా సినిమా ఇండస్ట్రీలో మగ వారిదే ఆధిపత్యం. ఇక కమెడియన్లలో అయితే వారిదే ఏక చక్రాధిపత్యం. అయితే అప్పుడప్పుడు కొందరు లేడీ కమెడియన్స్ కూడా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో బుల్లితెర కమెడియన్ జబర్దస్త్ ఫేమ్ ఫైమా ఒకరు. ప‌టాస్ షోతో బుల్లితెరకు పరిచయమైన ఈ కామెడీ క్వీన్ జబర్దస్త్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన కామెడీ పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. ముఖ్యంగా ప్రవీణతో కలిసి ఫైమా చేసిన స్కిట్స్ కామెడీ ప్రియులను కడుపుబ్బా నవ్వించాయి. అయితే ఆన్ స్క్రీన్‌లో జంటగా కనిపించే ఫైమా, ప్రవీణ్ రియల్ లైఫ్‌ లోనూ లవ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇద్దరూ కలిసి ఇన్ స్టాలో రీల్స్ చేయడం, పోస్ట్ లు షేర్ చేసుకోవడం, గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకోవడం ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే ఉన్నట్లుండి ఈ జోడీ బ్రేకప్ చెప్పుకుంది. ఫైమా తన ప్రేమను తిరస్కరించిందని ప్రవీణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఫైమా కూడా దీనిపై స్పందిస్తూ ప్రవీణ్‌తో విడిపోయానంటూ క్లారిటీ ఇచ్చింది. ఇంతలోనే తన ఫ్యాన్స్‌ కు పెద్ద షాకింగ్‌ న్యూస్ చెప్పింది ఫైమా. సోషల్ మీడియా వేదికగా తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

తాజాగా ఫైమా తన బాయ్‌ఫ్రెండ్‌తో బర్త్ డేను సెలబ్రేట్‌ చేసుకుంది. ఇదే సందర్భంగా తన లవర్ ప్రవీణ్‌ నాయక్‌ అని ఇంట్రడ్యూస్ చేసింది. ఫైమాతో కలిసున్న ఫొటోలను ప్రవీన్‌ నాయక్‌ కూడా సోషల్ మీడియా షేర్‌ చేశాడు. . ‘నా ప్రియిమైన లవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా ప్రేమ మొదలయ్యి 5 సంవత్సరాలైంది. ఇన్నిరోజులు ఎలా గడిచిపోయాయో అసలు తెలీదు. నా జీవితం మొత్తం నీతోనే గడపాలని ఉంది. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తునే ఉంటాను’ అని ఫైమాపై ప్రేమను ఒలక బోశాడు ప్రవీణ్. దీనికి ఫైమా కూడా స్పందించి ఆ ఫొటోలను షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

లవర్ తో లేడీ కమెడియన్ ఫైమా.. ఫొటోస్ ఇదిగో..

ప్రస్తుతం ఫైమా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ‘అప్పుడే ప్రవీణ్ ను మర్చిపోయావా ఫైమా? ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నప్పుడు ప్రవీణ్‌తో ఎందుకు ప్రేమలో ఉన్నావ్‌’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!