Brahmamudi, January 13th episode: కావ్యకు తప్పని నిందలు.. అనామిక కన్నింగ్ ప్లాన్స్! అత్తకు స్వప్న వార్నింగ్!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూకి బ్లడ్ ఇచ్చి కాపాడతాడు కళ్యాణ్. దీంతో కనకం, కృష్ణమూర్తిలు కళ్యాణ్‌కు దండం పెడుతూ మీరు నిజంగానే దేవుడు. అప్పూని బతికించారు అని అంటారు. అదేంటి నేనేమీ చేయలేదు. అప్పూ ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు. ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఫోన్ చేయండి అని అంటాడు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. వెళ్దాం రండి అని కళ్యాణ్, కావ్యలు బయలు దేరతారు. కళ్యాణ్, కావ్యలు కలిసి ఇంటికి వస్తారు. కావ్య రాగానే వచ్చింది ఈ ఇంటి మహాలక్ష్మి అని రుద్రాణి అంటుంది. వాళ్లను చూసిన పెద్దావిడ..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూకి బ్లడ్ ఇచ్చి కాపాడతాడు కళ్యాణ్. దీంతో కనకం, కృష్ణమూర్తిలు కళ్యాణ్‌కు దండం పెడుతూ మీరు నిజంగానే దేవుడు. అప్పూని బతికించారు అని అంటారు. అదేంటి నేనేమీ చేయలేదు. అప్పూ ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు. ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఫోన్ చేయండి అని అంటాడు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. వెళ్దాం రండి అని కళ్యాణ్, కావ్యలు బయలు దేరతారు. కళ్యాణ్, కావ్యలు కలిసి ఇంటికి వస్తారు. కావ్య రాగానే వచ్చింది ఈ ఇంటి మహాలక్ష్మి అని రుద్రాణి అంటుంది. వాళ్లను చూసిన పెద్దావిడ.. అప్పూకి ఎలా ఉందని అడుగుతుంది. అందరూ నన్ను క్షమించండి. మా చెల్లికి యాక్సిడెంట్ అయింది అనగానే.. కాళ్లూ, చేతులూ ఆడలేదు. అందరికీ చెప్పి బాధ పెట్టడం ఎందుకని నేనే వెళ్లాను. కళ్యాణ్ గారు వచ్చి బ్లడ్ ఇవ్వడంతో అప్పూ కోలుకుంది అని అంటుంది.
అన్నీ చెడగొట్టడం నీ జన్మ హక్కు కదా.. కావ్యపై ధాన్య లక్ష్మి సీరియస్..
ఆ తర్వాత అనామిక దగ్గరకు వెళ్లి సారీ అనామిక అని అంటుంది. పూజ కాకుండానే వచ్చేసారని తెలిసి చాలా బాధ పడ్డాను. అందేంటి.. నువ్వు క్షమించడం అనడం ఏంటి? ఈ ఇంట్లో ఏదైనా తల పెడితే.. అందులో నువ్వు తలపెడతావ్ కదా.. ఆ పని ఇంకెలా జరుగుతుంది. అన్నీ చెడగొట్టడం నీ జన్మ హక్కు కదా అని ధాన్య లక్ష్మి అంటుంది. చిన్న అత్తయ్యా.. అదేంటి అంతా తెలిసిన మీరే ఇలా మాట్లాడుతున్నారా.. నా చెల్లెలు ప్రాణాపాయంలో ఉంటే వెళ్లకుండా ఎలా ఉంటాను? అని కావ్య అంటుంది. అసలు నువ్వు మాట్లాడకు.. పూజ మొదలు కాకుండానే దీపం కుంది పడేసి ఆటంకం కలిగించావ్.. అప్పుడే అనుకున్న పూజ ఆగిపోతుందని ధాన్య లక్ష్మి కావ్యను నిందిస్తుంది.
అనామికకు కళ్యాణ్ సారీ.. అత్తకు స్వప్న వార్నింగ్..
అమ్మా వదిన వాంటెడ్‌గా ఏమీ చేయలేదు. ఇంకా అప్పూ కోలుకోకముందే వదిన ఇక్కడికి తీసుకొచ్చేసిందని కళ్యాణ్ అంటాడు. అసలు అని రుద్రాణి మొదలు పెట్టగానే.. నువ్వు ఆపు.. ఇప్పటికే చాలా మాట్లాడావ్.. ఇంకొక్క మాట మాట్లాడితే అత్తవని కూడా చూడను. అసలు ఈ ఇంట్లో నీకే విలువ లేదు. నీ మాటకు కూడా విలువ ఉందా.. అని స్వప్న అంటే.. ఏయ్ అని రుద్రాణి గట్టిగా అరుస్తుంది. రుద్రాణి.. ఇక్కడితో వదిలేసేయండి. ఎవరి మర్యాద వాళ్లకు ఉంటుంది. అక్కడ కళ్యాణ్ అవసరం ఉందని వెళ్లాడు. పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ప్రాణం మళ్లీ తిరిగి వస్తుందా.. మానవత్వం మచ్చుకైనా ఉండాలి అని పెద్దావిడ అంటుంది. అప్పుడే కళ్యాణ్.. అనామిక దగ్గరకు వెళ్లి.. సారి అనామిక అని అంటాడు. ఛీఛీ అదేం లేదు కళ్యాణ్.. నువ్వు ఒక ప్రాణాన్ని నిలబెట్టావ్ అని అంటుంది. ఆ పిల్లలకు ఉన్నంత జ్ఞానం కూడా లేదు. ఇవాళ వాళ్లకు మొదటి రాత్రి అని గుర్తు పెట్టుకోండి. వెళ్లండి వెళ్లి ఆ పనులు చూడండి.
కనకానికి.. కావ్య గురించి చెప్పిన స్పప్న..
ఈ సీన్ కట్ చేస్తే.. స్వప్న కనకానికి కాల్ చేసి అప్పూకి ఎలా ఉందని అడుగుతుంది. బాగానే ఉందని కనకం అంటే.. ఈ మాత్రం దానికి కావ్యకి కాల్ చేసి ఇబ్బంది పెట్టడం అవసరమా.. నేను కనికరం చూపించినా.. ఇక్కడ అందరూ కావ్యపై పడుతున్నారు. ఏమైందని కనకం కంగారుగా అడుగుతుంది. ఇక్కడ అందరి చేత పూజ చేయించాలని అనుకున్నారు. కానీ కావ్య వల్ల కళ్యాణ్ అక్కడి రావడంతో పూజ ఆగి పోయింది. దాంతో అందరూ కలిసి కావ్యని తప్పు బడుతున్నారు. కావాలనే ఇదంతా చేసిందని అంటున్నారు. మరీ తప్పదంటేనే కావ్యకు చెప్పు. లేదంటే ఇలానే జరుగుతుంది. ఉంటాను.. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని స్పప్న అంటుంది.
కళ్యాణ్ దగ్గర నుంచి మాట తీసుకున్న అనామిక..
స్వప్న మాటలకు కనకం, కృష్ణ మూర్తిలు బాధ పడతారు. అప్పుడే డాక్టర్ పిలుస్తుంది. ఆమె దగ్గరకు వెళ్లగా.. రండి మీ అమ్మాయికి బాగానే ఉంది. ఇవాలే డిశ్చార్జ్ చేసేస్తున్నాం. బిల్ కట్టి తీసుకెళ్లండి అని అంటుంది. ఇంకోవైపు గదిలోకి వచ్చిన అనామిక.. బాధ పడుతూ ఉంటుంది. కళ్యాణ్ సారి చెప్పినా పట్టించుకోదు. బాధ పడకుండా ఎలా ఉంటాను. పెళ్లైన తర్వాత వాళ్ల జీవితం మంచిగా సాగాలని చేసే వ్రతం ఇది. అవన్నీ పక్కకు పెట్టేసి వెళ్లిపోయావ్. మన అనుకునే వాళ్లు మనకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నది ముఖ్యం. ఇలా కళ్యాణ్‌తో గొడవ పడే ప్రయత్నంలో వాళ్ల అమ్మానాన్నలు చెప్పింది అనామికకు గుర్తొస్తుంది. దీంతో సైలెంట్ అయిపోయి.. నువ్వు ఎప్పుడూ నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెబుతుంది. అలా అని కళ్యాణ్ దగ్గర నుంచి ప్రామిస్ తీసుకుంటుంది అనామిక.
ఫ్రస్టేషన్‌లో కళావతి.. కన్ఫ్యూజన్‌లో రాజ్..
గదిలోకి కావ్య వస్తుంది. కావ్యను చూసిన రాజ్ ఫోన్ పెట్టేస్తాడు. దీంతో కావ్యకు తిక్క రేగి రాజ్‌పై విరుచుకు పడుతుంది. ఎందుకు ఫోన్ పెట్టేస్తున్నారు? పొమ్మంటే పోతాం కదా.. మా ముందు ేమీ మాట్లాడుకోకూడదు. నేను పెళ్లాన్ని అయితేనే కదా.. పక్క దేశపు గూడాచారిని కదా.. రహస్యాలన్నీ వినేసి మీ రుద్రాణి అత్తలా చిచ్చు పెట్టేస్తాను కదా అని కావ్య అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అని రాజ్ అంటే.. తెలుగులోనే మాట్లాడుతున్నా.. ఫారిన్ భాషలో ఏమీ మాట్లాడటం లేదు. నేను వస్తే చాలు.. ఫోన్ బంద్.. మాటలు బంద్.. అన్నీ బంద్. నాకు అన్నీ తెలుసిపోతున్నాయి. ఇక్కడ కూయాల్సిన కోయిల.. ఇంకో చోట కూస్తుందని కావ్య అంటుంది. ఇలా రాజ్‌పై దండెత్తుతుంది కావ్య.
బిల్ గురించి టెన్షన్ పడుతున్న కనకం.. కోలుకున్న అప్పూ..
ఈ సీన్ కట్ చేస్తే.. దీంతో కనకం, కృష్ణ మూర్తిలు సంతోష పడతారు. బిల్ ఎంత అయిందని అడగ్గా.. లక్ష పైనే అని చెబుతున్నారు. దీంతో వాళ్లిందరూ టెన్షన్ పడతారు. అప్పుడే అప్పూ కోలుకుందని నర్స్ వచ్చి చెప్తుంది. దీంతో కనకం, కృష్ణమూర్తిలు వెళ్తారు. కళ్యాణ్ ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని అప్పూ అడుగుతుంది. మనం చచ్చినా కూడా కళ్యాణ్‌ని ఇకపై పిలవద్దు. అటు కావ్య అక్కకి కూడా మన వల్ల ఇబ్బందులు పడుతుందని అంటుంది. ఈలోపు నర్స్ వచ్చి మీరు ఇంకా వెళ్లదేంటి? అని అడుగుతుంది. బిల్ కట్టలేదని కనకం అంటే.. అదేంటి? రాజ్ మీ అల్లుడే కదా.. మేనేజర్‌ని పంపించి బిల్ మొత్తం కట్టేశారు. ఇక మీరు వెళ్లొచ్చు అని అంటుంది. దీంతో కనకం ఫ్యామిలీ సంతోషంగా పడతారు.