Brahmamudi, January 12th episode: అప్పూ కోసం పూజ మధ్యలో వదిలేసిన కళ్యాణ్.. ధాన్యలక్ష్మి తిట్లదండకం!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య బయటకు వెళ్లాలి అనుకుంటే.. ఇక్కడ అందరికీ చెప్పి వెళ్లొచ్చు కదా అని అనామిక.. రాజ్‌ని నిలదీస్తుంది. భర్తకు చెబితే అందరికీ చెప్పినట్లే. నీకు ఏదైనా ఉంటే నీ భర్తతో మాట్లాడుకో. రాజ్ నీకు బావగారు అవుతారు. తనను నిలదీసే అర్హత, హక్కు నీకు లేవని ఇందిరా దేవి అంటుంది. ఇలా అందరి నోళ్లూ మూయించబట్టే అత్తయ్య.. ఆ కావ్యకు కళ్లు నెత్తి మీదకు వెళ్తున్నాయని ధాన్య లక్ష్మి అంటుంది. అసలు కావ్య ఏ కారణం వల్ల బయటకు వెళ్లిందిరా.. అని ఇందిరా దేవి, సుభాష్ అడిగుతారు. కళావతి చెప్పొద్దు అని చెప్తింది నాన్నా అని రాజ్ అంటే..

Brahmamudi, January 12th episode:  అప్పూ కోసం పూజ మధ్యలో వదిలేసిన కళ్యాణ్.. ధాన్యలక్ష్మి తిట్లదండకం!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Jan 12, 2024 | 9:21 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య బయటకు వెళ్లాలి అనుకుంటే.. ఇక్కడ అందరికీ చెప్పి వెళ్లొచ్చు కదా అని అనామిక.. రాజ్‌ని నిలదీస్తుంది. భర్తకు చెబితే అందరికీ చెప్పినట్లే. నీకు ఏదైనా ఉంటే నీ భర్తతో మాట్లాడుకో. రాజ్ నీకు బావగారు అవుతారు. తనను నిలదీసే అర్హత, హక్కు నీకు లేవని ఇందిరా దేవి అంటుంది. ఇలా అందరి నోళ్లూ మూయించబట్టే అత్తయ్య.. ఆ కావ్యకు కళ్లు నెత్తి మీదకు వెళ్తున్నాయని ధాన్య లక్ష్మి అంటుంది. అసలు కావ్య ఏ కారణం వల్ల బయటకు వెళ్లిందిరా.. అని ఇందిరా దేవి, సుభాష్ అడిగుతారు. కళావతి చెప్పొద్దు అని చెప్తింది నాన్నా అని రాజ్ అంటే.. అందరూ తనని అవమానించేలా మాట్లాడుతున్నారు కదారా.. ఇప్పటికైనా చెప్పు అని సుభాష్ అంటాడు.

అప్పూకి యాక్సిడెంట్ అయిందని చెప్పిన రాజ్.. కంగారులో కళ్యాణ్..

అప్పూకి యాక్సిడెంట్ అయింది. అది చెప్తే ఈ వ్రతం ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పకుండా.. ఈ పూజ చేయించమని చెప్పి మరీ వెళ్లింది అని రాజ్ చెప్తాడు. రాజ్ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. వెంటనే కళ్యాణ్.. అదేంటి అన్నయ్యా.. ఈ విషయం నాకు చెప్పాలి కదా. నేను వెంటనే వెళ్తాను అని బయలు దేరతాడు కళ్యాణ్. వద్దు అని రాజ్ చెప్తున్నా వినిపించుకోడు. దీంతో ఇంట్లోని వాళ్లందరూ నచ్చ జెప్పి కూర్చోమంటే పూజలో కూర్చుంటాడు కళ్యాణ్. కానీ మనసాంతా అప్పూకి ఏమైందా అని ఆలోచిస్తూనే ఉంటాడు.

వ్రతం మధ్యలోనే వదిలేసి అప్పూ కోసం వెళ్లిన కళ్యాణ్.. పాపం అనామిక..

ఈ సీన్ కట్ చేస్తే.. డాక్టర్ బయటకు వచ్చి వెంటనే బ్లడ్ కావాలని చెప్తుంది. లేదంటే అప్పూ కోమాలోకి వెళ్తుందని చెప్పగానే కనకం, కృష్ణ మూర్తులు కంగారు పడుతూ ఉంటారు. అల్లుడిగారికి ఒకసారి ఫోన్ చేయమ్మా.. ఆయన ఏదో ఒకటి చేస్తారు అని కనకం చెప్తే.. సరే అని కావ్య కాల్ చేస్తుంది. ఇటు రాజ్ ఫోన్ రింగ్ కాగానే.. కళ్యాణ్ లాక్కుని.. కావ్య చెప్పింది వింటాడు. అంత సీరియస్‌గా ఉన్నప్పుడు చెప్పాలి కదా వదినా వెంటనే నేను వస్తున్నా అని అంటాడు. కావ్య వద్దని చెబుతున్నా వినిపించుకోడు. అన్నయ్యా వెంటనే నేను వెళ్తున్నా అని చెప్తాడు. కళ్యాణ్ మాటలకు ధాన్య లక్ష్మి, రాజ్, అనామికలు వద్దని చెబుతున్నా.. ఎవరు ఏం అనుకున్నా అప్పూ నా ఫ్రెండ్ తనకు బాగోలేదంటే నేను ఎలా ఇక్కడ ఉంటాను. కుదరదు వెళ్తాను.. సారీ అనామిక అని బయలు దేరతాడు కళ్యాణ్. ఈలోపు కావ్యపై కారాలు మిరియాలు నూరతారు ఇంట్లోని వాళ్లు.

ఇవి కూడా చదవండి

కావ్యపై అపర్ణ, ధాన్య లక్ష్మి తిట్ల దండకం..

ఆస్పత్రికి వెళ్లిన కళ్యాణ్.. బ్లడ్ ఇస్తాడు. కళ్యాణ్‌ చేసిన సహాయానికి.. మీరు అప్పూ ప్రాణాలు కాపాడినందుకు సంతోషపడాలో.. అనామికను బాధ పెడుతున్నందుకు బాధ పడాలో తెలియడం లేదని కావ్య అంటుంది. పూజ తర్వాత అయినా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అప్పూ పరిస్థితి వేరు అని కళ్యాణ్ అంటాడు. ఈలోపు రుద్రాణి కావాలనే పుల్లలు పెడుతుంది. ధాన్య లక్ష్మిని, అనామికను రెచ్చ గొడుతుంది. దీంతో ధాన్య లక్ష్మి, అపర్ణలు మరోసారి రెచ్చిపోతారు. దీనికి రాజ్ రియాక్ట్ అవుతూ.. మీరందరూ ఎందుకు కళావతిని తిడుతున్నారు. తను నాకే కదా కాల్ చేసింది.. కళ్యాణ్ లాక్కోవడం.. బ్లడ్ ఇస్తానని వెళ్లడం అంతా స్పష్టంగా ఉంది కదా అని రాజ్ అంటాడు.

ధాన్య లక్ష్మి, అపర్ణలపై సుభాష్ ఫైర్..

ఈ ఆడ మేళం అంతా అంతేరా. వీళ్ల బుద్ధి మారదు. కుక్క తోక వంకరలాంటిది. ఎంత సరి చేసినా వంకరగానే ఉంటుంది. వీళ్లకు కుక్క తోక సరి చేయాలని తలో ఒక కుక్కని కొని ఇవ్వాలి. అప్పుడు 24 గంటలు ఆ పని మీదే ఉంటారు. ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడరు అని సుభాష్ అంటాడు. కరెక్ట్‌గా చెప్పావురా.. కళ్యాణ్ వెళ్లింది ప్రాణాలు నిలబెట్టడానికి.. కళ్యాణ్‌ని దేవుడు హర్షిస్తాడు.. దీవిస్తాడు.. మరింత ఆయుశ్శు పోస్తాడు. అది మీకు అర్థం కావడం లేదని పెద్దావిడ అంటుంది. ఈలోపు పంతులు గారు కూడా వెళ్లి పోతారు. ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.