నలుపు లేదా ఎరుపు.. ఏ క్యారెట్ తింటే ఎక్కువ లాభాలు?
TV9 Telugu
10 January
202
5
మార్కెట్లో అనేక రకాల క్యారెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, వీటిలో రెడ్ క్యారెట్ అత్యంత ప్రాచుర్యం పొందాయి.
రెండు క్యారెట్‌లకు పోలిక లేదని డైటీషియన్లు అంటున్నారు. క్యారెట్‌లు ఎరుపు లేదా నలుపు రంగులో ఉన్నా, రెండింటికీ వాటి సొంత ప్రయోజనాలు ఉన్నాయి.
బ్లాక్ అండ్ రెడ్ రెండు క్యారెట్‌లలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు డైటీషియన్లు. వీటితో అనేక లాభాలు.
బ్లాక్ క్యారెట్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి మెండుగా ఉంటాయి.
యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా బ్లాక్ క్యారెట్‌లో ఎక్కవగా ఉంటాయి. ఫైబర్, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి.
డిప్రెషన్, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులతో పోరాడటానికి బ్లాక్ క్యారెట్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు.
ఎరుపు క్యారెట్.. అది బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉన్నందున కళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు డైటీషియన్లు.
రెడ్ క్యారెట్‌లో ఉండే ఫైబర్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. రెడ్ క్యారెట్ తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది.
రెడ్ క్యారెట్‌లో విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. లైకోపీన్ అనే సమ్మేళనం కారణంగా క్యారెట్ రంగు ఎరుపుగా ఉంటుంది.
రెడ్ క్యారెట్‌లో ఉండే పోషకాలు జీర్ణక్రియను సక్రమంగా నిర్వహించడంలో బరువు తగ్గించడంలో సహాయపడతాయంటున్నారు వైద్యులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ టిప్స్‌తో అనవసరమైన ఖర్చులను తగ్గించండి..
వీసా రిజెక్ట్ అయిందా.? నో వర్రీ.. ఈ యాప్స్ మీ కోసమే..
ఈ క్లీనింగ్ టిప్స్.. మీ శాండ్విచ్ మెషిన్‌కి కొత్తలాంటి మెరుపు..