ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసిన ముంబై ఎయిర్‌పోర్టు

TV9 Telugu

10 January 2025

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నుండి లెవల్ 5 గుర్తింపు పొందింది.

ముంబై విమానాశ్రయం ఈ టైటిల్‌ను సాధించిన భారతదేశంలో మొదటి విమానాశ్రయం. లెవెల్ 5 అక్రిడిటేషన్‌ను పొందిన ప్రపంచంలో ఇది మూడవ విమానాశ్రయం.

ముంబై విమానాశ్రయం మెరుగైన కస్టమర్ అనుభవం కోసం లెవల్ 5 గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల కంటే మెరుగైన ఎయిర్‌పోర్టుగా చరిత్ర సృష్టించింది.

ముంబై విమానాశ్రయాన్ని గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ (AAHL) నిర్వహిస్తోంది. అదానీ ఈ విజయాన్ని సోషల్ మీడియాలో తెలియజేశారు.

వినియోగదారులకు సేవలందించడంలోనే కంపెనీ నిజమైన విజయం దాగి ఉందని, ఇందుకోసం అదానీ ఎయిర్‌పోర్ట్స్ బృందం తీవ్రంగా కృషి చేస్తుందన్నారు గౌతమ్ అదానీ.

దేశంలోని CSMIA నవంబర్ 2024లో ప్రయాణీకుల, కార్గో కార్యకలాపాలలో 47.7 లక్షలకు భారీ పెరుగుదలను నమోదు చేసింది.

దేశీయంగా 34 లక్షల మంది, అంతర్జాతీయంగా 13.7 లక్షల మంది ప్రయాణికులు ముంబై ఎయిర్‌ఫోర్టు నుంచి రాకపోకలు సాగించారు.

నవంబర్‌లో 9,696 దేశీయ, 7,504 అంతర్జాతీయ ATMలతో సహా 27,200 ఎయిర్ ట్రాఫిక్ కదలికలను (ATMలు) CSMIA నమోదు చేసింది.