Nithya Menen: వారికేమో ముద్దులు, హగ్గులు.. అభిమానితో మాత్రం ఇంత దారుణంగానా? నిత్య మేనన్‌ షాకింగ్ వీడియో

ప్రముఖ నటి నిత్యా మేనన్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె చివరిగా తమిళంలో ధనుష్‌తో కలిసి తిరుచిరంబాలమ్‌ (తెలుగులో తిరు) లో నటించింది. ఇందులో ఆమె నటనకు గానూ ప్రతిష్ఠాత్మక జాతీయ ఉత్తమ నటి పురస్కారం దక్కింది.

Nithya Menen: వారికేమో ముద్దులు, హగ్గులు.. అభిమానితో మాత్రం ఇంత దారుణంగానా? నిత్య మేనన్‌ షాకింగ్ వీడియో
Actress Nithya Menon
Follow us
Basha Shek

|

Updated on: Jan 09, 2025 | 7:24 PM

అలా మొదలైంది సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ తెరపైకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాదు కన్నడ, మలయాళం, తమిళ సినిమాలతో అక్కడి ఆడియెన్స్ ను మెప్పించింది. కాగా నిత్యా మేనన్ నటించే ముందు జర్నలిస్టు కావాలనుకుంది. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. చాలా గ్యాప్ తర్వాత నిత్యా మేనన్ ఒక కొత్త సినిమాతో మన ముందుకు వస్తోంది. జయం రవి కథానాయకుడిగా తెరకెక్కిన ‘కాదలిక్క నేరమిల్లై’ సినిమాతో ఆమె హీరోయిన్ గా నటించింది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాకు నిర్మాత కాగా ఆయన సతీమణి కిరుతిగ ఉదయనిధి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. దర్శకురాలిగా ఆమెకు ఇది మూడో సినిమా. జయం రవి, నిత్యతో పాటు యోగి బాబు, వినయ్, లాల్, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని, గాయకుడు మనో, టీజే బాను, జాన్ కోగన్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.

రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రఘుమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను జనవరి 7న విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది. కాగా తాజాగా ఓ ప్రమోషన్ కార్యక్రమంలో నిత్ ప్రవర్తించిన తీరు అందరినీ షాకింగ్ కు గురిచేస్తోంది. మీడియా పాయింట్ దగ్గరికి నిత్యా మీనన్‌‌ని ఆహ్వానించిన ఓ రిపోర్టర్, ఆమెతో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే నిత్య మాత్రం అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించింది. ‘నా గొంతు సరిగ్గా లేదు. ముందే కోవిడ్ మళ్లీ వస్తుందని అంటున్నారు..’ అంటూ నవ్వుతూ చెప్పింది. దీనికి రిపోర్టర్ కూడా ఏ మాత్రం నొచ్చుకోకుండా మైక్‌ని సరి చేసి పక్కకెళ్లి నిల్చున్నాడు.

ఇవి కూడా చదవండి

అయితే ఇదే ప్రమోషన్ ఈవెంట్ లో నిత్యా మీనన్ దర్శకుడు మిష్కిన్‌ను ముద్దుపెట్టుకుంది. అలాగే హీరో జయం రవిని కౌగిలించుకుంది. ఇందులో తప్పేమీ లేదు. కానీ అభిమానంతో జస్ట్ షేక్ హ్యాండ్ అడిగిన రిపోర్టర్ తో నిత్య ప్రవర్తించిన తీరు ఏ మాత్రం బాగోలేదంటున్నారు అభిమానులు. పైగా దానికి కోవిడ్ అంటూ కుంటు సాకులు చెప్పడం అసలు నచ్చడం లేదంటున్నారు. (source)

వైరల్ వీడియో ఇదే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి