Brahmamudi, April 3rd episode: రాజ్‌ నోట బాబు తల్లి పేరు.. డిటెక్టివ్‌గా మారిన కావ్య..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాహుల్‌ని రాజ్ ప్లేస్‌లో కూర్చోబెట్టాలని రుద్రాణి అంటే.. నీ కొడుక్కు ఆ అర్హత లేదని ధాన్య లక్ష్మి అంటుంది. ఇక్కడ ఎవరు సక్రమంగా ఉన్నారు. నీ కొడుకు కళ్యాణ్ అప్పూతో తిరగడం లేదా. రాజ్ మాత్రం ఓ ఆడదాన్ని తల్లిని చేసి.. ఏకంగా బిడ్డనే ఇంటికి తీసుకొచ్చాడు. అయినా అందరి ముందూ అప్పూతో తిరుగుతానని నీ కొడుకు కళ్యాణ్ తెగేసి చెప్పేశాడుగా. కాబట్టి రాహుల్‌కి ఎందుకు అర్హత ఉండదో చెప్పండి అని అంటుంది రుద్రాణి. మీరు ఆగండి రుద్రాణి ఆంటీ..

Brahmamudi, April 3rd episode: రాజ్‌ నోట బాబు తల్లి పేరు.. డిటెక్టివ్‌గా మారిన కావ్య..
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Apr 03, 2024 | 12:13 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాహుల్‌ని రాజ్ ప్లేస్‌లో కూర్చోబెట్టాలని రుద్రాణి అంటే.. నీ కొడుక్కు ఆ అర్హత లేదని ధాన్య లక్ష్మి అంటుంది. ఇక్కడ ఎవరు సక్రమంగా ఉన్నారు. నీ కొడుకు కళ్యాణ్ అప్పూతో తిరగడం లేదా. రాజ్ మాత్రం ఓ ఆడదాన్ని తల్లిని చేసి.. ఏకంగా బిడ్డనే ఇంటికి తీసుకొచ్చాడు. అయినా అందరి ముందూ అప్పూతో తిరుగుతానని నీ కొడుకు కళ్యాణ్ తెగేసి చెప్పేశాడుగా. కాబట్టి రాహుల్‌కి ఎందుకు అర్హత ఉండదో చెప్పండి అని అంటుంది రుద్రాణి. మీరు ఆగండి రుద్రాణి ఆంటీ.. రాహుల్ దుగ్గిరాల వారసుడే కాదు. కాబట్టి రాజ్ బావగారి స్థానంలో కూర్చోవడానికి వారసుడే కావాలి. కళ్యాణే ఆ సీట్లో కూర్చోవాలని అనామిక అంటుంది. నువ్వు చాలా తెలివిగా ఇంట్లో విభేదాలు సృష్టిస్తున్నావ్ అనామిక. రాహుల్ ఇప్పుడు వేరు. నేను వచ్చాక కంట్రోల్‌లో పెట్టాను. ఎక్స్ పీరియన్స్ ఉన్న రాహుల్‌ని పక్కకు పెట్టి.. అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని కళ్యాణ్‌ని రాజ్ ప్లేస్‌లో కూర్చోబెట్టమంటారేంటి? అని స్వప్న అడుగుతుంది.

ఎండీ పోస్ట్ కోసం.. స్వప్న – అనామిక రచ్చ.

లీగల్‌గా కళ్యాణే వారసుడు. తాతయ్య గారూ నేను అన్నదాంట్లో నిజం ఉందా లేదా? మీరే చెప్పండి అని అనామిక అంటే.. నిజం ఉంది. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదని కళ్యాణ్ అంటాడు. దీంతో అనామిక ఖంగు తింది. నేను వెళ్లి ఆయన స్థానంలో కూర్చోవడం ఏంటి? అది బాధ్యత కలిగిన స్థానం అని కళ్యాణ్ అంటాడు. ఇంతలో సుభాష్ వస్తాడు. రాజ్ ఇంకా ఆ బాధ్యతల నుంచి తప్పుకోలేదు. అయినా అదేం ఇంద్ర పదవి కాదు. దానికి హక్కు మాత్రమే కాదు. అర్హతలు కూడా ఉండాలి. నాకు తెలిసి రాజ్ స్థానంలో కూర్చోవడానికి సరైన అర్హత ఒక్కరికే ఉంది. ఆ ఒక్కరు ఎవరో కాదు నా కోడలు కావ్య అని అంటాడు సుభాష్. ఆ నిర్ణయం విన్న కావ్యతో పాటు దుష్ట చతుష్టం ఖంగు తింటుంది. మిగిలిన వారందరూ సంతోష పడతారు.

ఎండీ పోస్ట్ వద్దన్న కావ్య..

ఆఫీస్‌లో రాజ్ లేని సమయంలో నువ్వు క్లయింట్స్‌ని డీల్ చేసిన విధానం, ఆ కాంట్రాక్ట్ మనకు దక్కేలా చేసిన నీ సమర్థత నాకు బాగా నచ్చాయి. పైగా నువ్వే డిజైనర్‌వి కాబట్టి.. క్లయింట్స్ కావాల్సిన రిక్వైర్మెంట్ నీకే తెలుస్తాయి. కాబట్టి రాజ్ సరైన నిర్ణయం తీసుకునేంత వరకూ ఆ స్థానంలో నువ్వు ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను అని సుభాష్ అంటాడు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని కళ్యాణ్, స్వప్నలు అంటే.. నాకు నచ్చలేదని కావ్య అంటుంది. దీంతో రాజ్‌తో సహా అందరూ షాక్ అవుతారు. కానీ ఇందిరా దేవి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. మీరందరూ నా పట్ల తీసుకున్న నిర్ణయం నాకు సంతోషంగానే ఉంది. ఆయన్ని బాధ్యతల నుంచి తప్పించి.. నన్ను కూర్చోబెడతాను అంటే నాకు ఎలా సంతోషంగా ఉంటుంది. మీతో కలిసి నేను కూడా నా భర్తను కించపరిచినట్టే అవుతుంది. పైగా ఈ ఇంట్లో నేను కోడాలిగానే ఉంటానో లేక తెలీదు. నా స్థానం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. నన్ను క్షమించండి. ఎలా చూసినా కవి గారు మాత్రమే ఆ స్థానంలో ఉండటానికి అర్హత కలిగిన వారు. కాబట్టి కవిగారికే ఆ బాద్యతను అప్పజెప్పండి అని కావ్య అంటుంది.

ఇవి కూడా చదవండి

బిడ్డ తల్లి పేరు బయట పెట్టించిన కావ్య..

ఆ స్థానంలో కూర్చోవడానికి నేను కూడా ఒప్పుకోను. కానీ ఇది సంక్షోభం. కంపెనీ ప్రాబ్లమ్‌లో ఉంది కాబట్టి.. నేను ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా ఉంటాను అని కళ్యాణ్ అంటాడు. దీంతో రుద్రాణి మనసులో తిట్టుకుంటుంది. ఆ తర్వాత రాజ్‌తో పంచాయితీ మొదలవుతుంది. రాజ్‌కి క్లాస్ పీకుతుంది కావ్య. కావాలనే ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తుంది. ఆ కోపంలో బిడ్డ తల్లి ఎవరు? ఆమె పేరైనా చెప్పండి అని అడుగుతుంది. పేరు తెలుసుకుని ఏం చేస్తావ్ అని రాజ్ అంటాడు. సచ్చినోడికి వచ్చిందే కట్నం అని సరిపెట్టుకుంటా. ఆ ఆవేశంలో రాజ్ బిడ్డ తల్లి పేరు.. వెన్నెల అని చెప్పేస్తాడు. ఆ తర్వాత కోపంతో అక్కడి నుంచి కావ్య వెళ్లి పోతుంది.

కళ్యాణ్‌కు కావ్య క్లాస్..

నెక్ట్స్ కళ్యాణ్ బయట ఫోన్ మాట్లాడుతూ ఉండగా.. కావ్య వస్తుంది. ఏంటి వదినా నన్ను ఇరికించేశారుగా అని అంటాడు కళ్యాణ్. లేదు అన్నీ ఆలోచించి.. మీరు మాత్రమే ఆ పోస్ట్‌కి న్యాయం చేస్తారు. అందుకే మీ పేరు చెప్పాను. చూడండి కవి గారూ.. పేదవాడు డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు. కానీ ఆ డబ్బు ఆనందాన్ని ఇవ్వదు అని చెప్తే అందరూ నవ్వుతారు. సంపాదించడం చేతకాక మాట్లాడుతున్నాడు అంటారు. అదే ఓ కోటి రూపాయలు చెప్పిన వాడు చెప్తే వింటారు. నమ్ముతారు.. ఇప్పటివరకూ మీకు కవితలు అంటే ఇష్టం. రైటర్‌గా ఉండటం మీ కల అంటే అందరూ నవ్వుతున్నారు. వాళ్లందరికీ సమాధానం చెప్పే అవకాశం ఉంది. కాబ్టటి మీ అన్నయ్య వచ్చేంత వరకూ మీరు కంపెనీని సమర్థవంతంగా నడిపించండి. ఆ తర్వాత అందరూ మీకు సపోర్ట్ చేస్తారని కావ్య అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.