Brahmamudi, April 4th episode: కవిలో దాగివున్న మాస్ యాంగిల్.. బోల్తా పడ్డ కావ్య!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కవిని సహాయం అడుగుతుంది కావ్య. ఏంటి వదినా చెప్పండి అని కళ్యాణ్ అంటే.. వెన్నెల అని మీకు ఎవరైనా అమ్మాయి తెలిసిన వాళ్లు ఉన్నారా? ఆ బాబు తల్లి పేరు వెన్నెల అని చెప్పారు. ఆమె గురించి ఎలా అయినా తెలుసుకోవాలి. వెన్నెల గురించి తెలిస్తేనే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బాగా ఆలోచించమని కళ్యాణ్‌ని కావ్య అడుగుతుంది. బాగా ఆలోచించిన కళ్యాణ్.. అన్నయ్య టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు వెన్నెల అనే అమ్మాయి..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కవిని సహాయం అడుగుతుంది కావ్య. ఏంటి వదినా చెప్పండి అని కళ్యాణ్ అంటే.. వెన్నెల అని మీకు ఎవరైనా అమ్మాయి తెలిసిన వాళ్లు ఉన్నారా? ఆ బాబు తల్లి పేరు వెన్నెల అని చెప్పారు. ఆమె గురించి ఎలా అయినా తెలుసుకోవాలి. వెన్నెల గురించి తెలిస్తేనే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బాగా ఆలోచించమని కళ్యాణ్‌ని కావ్య అడుగుతుంది. బాగా ఆలోచించిన కళ్యాణ్.. అన్నయ్య టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు వెన్నెల అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి అన్నయ్యను ఇష్ట పడుతున్నట్టు చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదని చెప్తాడు. మరి తను ఎక్కడ ఉంటుందో తెలుసా? అని కావ్య అంటే.. ఆ అమ్మాయినే ఎప్పుడూ చూడలేదని కళ్యాణ్ అంటాడు. సరే మీరు ఎక్కడ చదివారు అని కావ్య అడుగుతుంది. దీంతో స్కూల్ పేరు చెప్తాడు కళ్యాణ్. సరే అని కావ్య వెళ్తుంది.
కళ్యాణ్ భుజంపై వాలిన అప్పూ..
మరోవైపు అప్పూ ఏమో బ్రోకర్ అన్నమాట్లను తలుచుకుని ఏడుస్తుంది. కనకం పిలిచినా.. అప్పూ పట్టించుకోదు. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. ఆంటీ అప్పూ ఎక్కడ? అని అడుగుతాడు. అప్పూ కోసం మీరు వస్తే.. ఏం జరుగుతుందో తెలుసు కదా అని కనకం అంటుంది. అది వదిలేయండి.. నేను చూసుకుంటా. అప్పూ ఏది అని అడుగుతాడు కళ్యాణ్. గదిలో ఉంది ఎంత పిలిచినా రావడం లేదని కనకం చెప్తుంది. దీంతో వెళ్లి అప్పూని పిలుస్తాడు కళ్యాణ్. దీంతో అప్పూ లోపలి నుంచి వచ్చి ఏడుస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ భుజంపై వాలి.. జరిగినదంతా చెప్తుంది. అప్పూ చెప్పడంతో కళ్యాణ్, కనకం, కృష్ణమూర్తిలు షాక్ అవుతారు. అది విన్న కళ్యాణ్.. వాడి సంగతి తేలుద్దాం పదా అని అప్పూ చేయి పట్టుకుని తీసుకెళ్తాడు.
రాజ్ అంతరాత్మ గోల..
ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్ చెప్పిన స్కూల్‌కి వస్తుంది కావ్య. వెన్నెల గురించి ఎంక్వైరీ చేస్తుంది. వెన్నెల అడ్రెస్ దొరుకుతుంది. మరోవైపు బాబు ఏడుపును ఆపేందుకు కష్ట పడుతూ ఉంటాడు రాజ్. అప్పుడే రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి.. పిల్లాడిని చక్కగా ఆడిస్తున్నావ్ అని అంటాడు. నేనేం చేశాను అని రాజ్ అడుగుతాడు. అసలు నీ అంతరాత్మ అయిన నాకే తెలియకుండా.. ఎప్పుడు కాలు జారావు? ఎప్పుడు బిడ్డను కన్నావ్ అని అడుగుతాడు. నీకు చెప్పాల్సిన అవసరం లేదని రాజ్ అంటాడు. సరే నాకు చెప్పకపోయినా.. మన పెళ్లాం మాత్రం ఎలాగైనా ఆ వెన్నలను పట్టుకుంటుందని అంటాడు.
బోల్తా పడ్డ కావ్య..
ఆ తర్వాత వెన్నెల అడ్రెస్ వెతుక్కుంటూ ఇంటికి వెళ్తుంది కావ్య. ఇలా దాక్కుని ఎంత కాలం ఉంటారు? చూడండీ నాకు అంతా తెలుసు. నేరుగా మా ఇంటికి వచ్చి జరిగింది అంతా చెప్పండి. మీరు ఎందుకు ఇలా చేశారు? పెళ్లైన మగాడితో బాబును కన్నారు అని అడుగుతుంది కావ్య. అది విన్న ఆ అమ్మాయి షాక్ అవుతుంది. నేను రాజ్ భార్యను అని చెప్తుంది. అది విన్న అమ్మాయి.. మీరు ఏం చెప్తున్నారో నాకు ఇంకా అర్థం కావడం లేదు.. ఏవండీ ఇలా రండి అని పిలుస్తుంది. భర్త ఉండగానే మా ఆయనతో సంబంధం పెట్టుకుంటావా అని కావ్య అంటే.. అమ్మా తల్లీ నా కాపురంలో నిప్పులు పోయకు. నీ మొగుడు ఎవరితో తిరుగుతున్నాడో సరిగ్గా తెలుసుకో అని అంటుంది. బాగా కనుక్కుని వచ్చాను వెన్నెల అని అంటుంది కావ్య. నా పేరు వెన్నెలో.. స్ట్రాబెర్రీనో కాదు సావిత్రి అని అంటుంది. నేను వెన్నెల అనే అమ్మాయి కోసం వెతుక్కుంటూ వచ్చాను. స్కూల్లో అడిగితే ఇదే అడ్రెస్ ఇచ్చారు అని అంటుంది. దీంతో సావిత్రి ఫైర్ అవుతుంది. మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? అని అడుగుతుంది. పదేళ్లు అయ్యింది.. మా ఫాదర్ కొన్నారు ఈ ఇల్లు అని చెప్తారు.
మాస్ రాజ్‌లా మారిన కళ్యాణ్.. సూపర్ యాంగిల్ గురూ..
ఈ సీన్ కట్ చేయగా.. అప్పూని తీసుకెళ్లి.. పోలీస్ సెలెక్షన్ ఆఫీస్‌కి వెళ్తాడు కళ్యాణ్. ఎవరో చూపించమంటాడు. వీడేనా? అని అడుగుతాడు కవి. అప్పూతో వాడు అప్పూని చూసి ఎవరు ఇతను నీకు ఆల్రెడీ చెప్పాను కదా? నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. బయట పోలీసులు, మీడియా ఉంది కదా అని అంటాడు. బ్రోని పక్కకు తోసి.. ఏంట్రా అని కాలర్ పట్టుకుని.. లాగి పెట్టి ఒక్కటి కొడతాడు. ఏంట్రా నన్నే కొడతావా అంటాడు కోపంగా. నీలాంటి బ్రోకర్ గాడిని కొట్టడం కాదురా.. చంపేయాలి. బయట పోలీసులు, మీడియా ఉంది కదా పదా తీసుకెళ్తాను అని బయటకు లాక్కెళ్తాడు కళ్యాణ్. వాళ్లను చూసిన పోలీసులు.. ఏంటి సర్ ఆగండి అని సముదాయిస్తారు. అసలు ఏం జరిగిందో చెప్పండి? అని పోలీసులు చెప్పగానే.. ఇంతలో మీడియా వచ్చి ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఇక జరిగింది అంతా చెప్తాడు కళ్యాణ్. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.