Brahmamudi, November 4th episode: సీతా రామయ్యకు నిజం చెప్పిన కావ్య.. ఇద్దర్నీ ఇంట్లో నుంచి వెళ్లిపోమన్న అపర్ణా దేవి!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్యపై ఫైర్ అవుతుంది అపర్ణా దేవి. కావ్య గురించి తల్లిని కూడా రాజ్ పక్కన పెట్టాడు. విగ్రహాలను ఎత్తుకెళ్లిపోతే ప్రాణాలకు తెగించి మరీ కాపాడాడు. చేజారుకుంటుందన్న ఇల్లు.. ఇప్పించాడు. ఆవిడ గారు కష్ట పడుతుంటే చూడలేక.. నన్ను ఎదిరించి పని మనిషిని పెట్టాడు. ఇంత చేసిన నా కొడుక్కి మిగిలిందేంటి? మోసం.. భార్య చేతిలో మోసపోయాడు. అందరి ముందూ తల దించుకున్నాడు. అంత ప్రేమ చూపించినా సరే.. భార్య మోసం చేసిందంటే..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్యపై ఫైర్ అవుతుంది అపర్ణా దేవి. కావ్య గురించి తల్లిని కూడా రాజ్ పక్కన పెట్టాడు. విగ్రహాలను ఎత్తుకెళ్లిపోతే ప్రాణాలకు తెగించి మరీ కాపాడాడు. చేజారుకుంటుందన్న ఇల్లు.. ఇప్పించాడు. ఆవిడ గారు కష్ట పడుతుంటే చూడలేక.. నన్ను ఎదిరించి పని మనిషిని పెట్టాడు. ఇంత చేసిన నా కొడుక్కి మిగిలిందేంటి? మోసం.. భార్య చేతిలో మోసపోయాడు. అందరి ముందూ తల దించుకున్నాడు. అంత ప్రేమ చూపించినా సరే.. భార్య మోసం చేసిందంటే ఏ భర్త అయినా ఎలా తట్టుకుంటాడు. ఇప్పుడు రాజ్ మనసు ఎంత బాధ పడుతూ ఉంటుందో ఆలోచించారా. అంత ఎందుకు ఈ ఇంట్లో ఏ గొడవ జరిగినా.. మావయ్య గారు సపోర్ట్ చేస్తారు కదా.. మరి మావయ్య గారికి చెప్పిందా.. అందరూ కలిసి కావ్యని ఇంట్లో నుంచి తరిమేస్తే.. అందర్నీ ఎదిరించి మరీ మీరు ఇంట్లోకి తీసుకొచ్చారు కదా.. మీకు చెప్పిందా.. మిమ్మల్నే కాదు తను ఈ ఇంట్లో అందర్నీ మోసం చేసింది. స్వప్నకి సీమంతం అలా చేయాలి.. ఇలా చేయాలి అంటే మౌనంగా నిల్చుంది కానీ.. ఇంట్లో అందరి ప్రేమకైనా సిగ్గు పడాలి కదా.. నిజం చెప్పాలి కదా.. ఎందుకు చెప్పలేదని అపర్ణ ఒక రేంజ్ ఏసుకుంటుంది. అపర్ణ మాటలకు సుభాష్ ఆలోచనలో పడతాడు.
స్వప్నకు భయపడిన రాహుల్.. రుద్రాణి ప్లాన్ సక్సెస్ అవుతుందా:
ఇక ఆ తర్వాత రుద్రాణి, రాహుల్ లు స్వప్న మాటలను గుర్తుకు తెచ్చుకుంటారు. స్వప్న ఎదిరించిన మాటలను గుర్తుకు తెచ్చుకుని.. తల తిరిగి పోయింది మామ్.. ఇన్నాళ్లూ డమ్మీ అనుకున్న స్వప్న.. అంతలా రెచ్చి పోయిందేంటి? తప్పు చేసింది కదా.. ఈజీగా బయటకు గెంటేయవచ్చు అనుకున్నాం. కానీ ఇంతలా మార్చేస్తుంది అనుకోలేదు. ఇన్నాళ్లూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతంటే తింగరిది అనుకున్నాను కానీ.. అలా నటిస్తూ మనల్ని తింగరోళ్లని చేస్తుందని అస్సలు ఊహించలేదు మమ్మీ అని రాహుల్ అంటాడు. అది ఎంత తెలివైంది అయినా కావచ్చు. తప్పు చేసి దొరికిపోయింది. ఏం చేసి అయినా సరే దాన్ని ఇంట్లో నుంచి గెంటేయాలని రుద్రాణి అంటుంది. ఏది ఏమైనా అది ఇంట్లో నుంచి వెళ్లదు మామ్. ఇన్నాళ్లూ మనం కావ్య తెలివైంది. అత్తకు కంచులా తయారైంది అనుకున్నాం. మనకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కావ్య నుంచే వస్తుంది అనుకున్నాం. కానీ ఈ రోజు కావ్య సైలెంట్ అయిపోయింది. స్వప్న రెచ్చిపోయిందని రాహుల్ అంటాడు. అదే ఇప్పుడు మనకు ప్లస్ పాయింట్ అయింది. అది అలా రెచ్చిపోయి ఇంట్లో అందరి ముందూ చెడ్డది అయింది. ఇప్పుడు మనం అదే వాడుకోవాలి. ఇప్పుడు మన మాటకి వదిన కోపం తోడైంది కాబట్టి.. స్వప్నని, కావ్యని ఇద్దర్నీ కలిసి ఇంట్లో నుంచి గెంటేయవచ్చని రుద్రాణి అంటుంది.
ఆ ఆడ పిల్లల జీవితాల్ని నాశనం చేపిస్తారేమోనని బాధలో సీతా రామయ్య:
ఆ తర్వాత ఇంట్లో జరిగిన దానికి సీతా రామయ్య, ఇందిరా దేవి కూడా బాగాలోచిస్తారు. ఈ పాలు తాగు అని ఇందిరా దేవి అంటే.. వద్దు అని సీతా రామయ్య అంటాడు. ఇంత చిన్న విషయానికే వద్దు అని ఖచ్చితంగా చెప్పావు కదా బావా. మరి ఇందాక ఇంట్లో అంత గొడవ జరిగితే ఎందుకు ఏం మాట్లాడకుండా వెళ్లిపోయావు. మీరు అక్కడే ఉండి గొడవ ఆపాల్సిందని ఇందిరా దేవి అంటే.. వింటానికి అక్కడ ఎవరు సిద్ధంగా ఉన్నారు చెప్పు. తప్పులు చేశావని ఒకరు, నిందలు వేశారని మరొకరు ఎవరు ఎవరి మాట వింటారు చెప్పు అని సీతా రామయ్య అంటాడు. అలా అని వదిలేస్తే మన పెద్దరికానికి విలువ ఏం ఉంది చెప్పు బావా అని ఇందిరా దేవి అడుగుతుంది. ఇప్పుడు అందరూ స్పప్న తప్పులు వెతుకుతున్నారు కానీ.. దానికి మూలం ఎవరు అని మాత్రం ఆలోచించడం లేదు. స్వప్న కావ్య మీద నింద వేయగానే.. అందరూ కలిసి కావ్య మీద పడితే ఏం ప్రయోజనం ఉంది చెప్పు అని సీతా రామయ్య అంటాడు.
అన్ని విషయాలూ మనతో చెప్పే కావ్య.. ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పలేదు అని ఇందిరా దేవి అంటుంది. అలా ఎందుకు అనుకుంటన్నావ్.. కావ్య గురించి నాకు బాగా తెలుసు. తప్పు చేసి ఉండదని నా మనసుకు చెబుతుంది. అంటే స్వప్న అబద్ధం చెప్తుందా అని ఇందిరా దేవి అడుగుతుంది. అవ్వొచ్చు.. కాక పోవచ్చు. అయినా కావ్య చేసింది తప్పు ఎందుకు అవుతుంది? తన అక్క జీవితం కోసం అలా చేసిందనుకోవచ్చని సీతా రామయ్య అంటాడు. అపర్ణను చూస్తున్నావ్ కదా.. కావ్య మీద ఎప్పుడూ చుర్రుబుర్రు లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద తప్పు జరిగాక ఊరుకుంటుందా. ఇక రుద్రాణి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొదటి సారి నాకు ఎందుకో భయంగా ఉంది చిట్టీ. పెద్దరికాన్ని అంటగట్టి నాకు ఆ ఆడ పిల్లల జీవితాల్ని నాశనం చేపిస్తారేమో అనిపిస్తుంది అని బాధ పడతాడు సీతా రామయ్య.
జీవితాంతం ఏడ్చేలా చేసి పంపిస్తా.. కావ్యకు అపర్ణ వార్నింగ్.. చేతులు ఎత్తేసిన సుభాష్:
ఉదయం అవుతుంది.. కావ్య అత్త గారికి కాఫీ తీసుకొస్తుంది. కానీ అపర్ణ దాన్ని తీసుకోకుండా.. నేలకేసి కొడుతుంది. ఇంత జరిగిన తర్వాత కూడా మొహానికి వేసుకున్న ముసుగు తీయవా.. నువ్వేంటో నిన్న అందరి ముందూ స్వప్న బయట పెట్టేసింది కదా.. ఇంకెందుకు నటిస్తున్నావ్ అని అపర్ణ అంటుంది. అత్తయ్య గారూ నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారని కావ్య అంటే.. నిన్ను ఎప్పుడో నేను అర్థం చేసుకున్నాను అని అపర్ణ అంటుంది. మా అందర్నీ మోసం చేసినందుకు.. జీవితాంతం ఏడ్చేలా చేసి పంపిస్తా అని అపర్ణ అంటుంది. ఆ తర్వాత కావ్య చెప్తున్నా.. పెద్ద వాళ్లుగా మా అత్తా, మామలకు విలువ ఇస్తున్నా. వాళ్లు చెప్పేదాకా అందుకే ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నా కొడుకు కూడా ఈ ఇంట్లో నుంచి వెళ్లి పోవాలని కోరుకుంటున్నాడు అని అపర్ణ అంటుంది. ఆ తర్వాత నేను కూడా నేనేం చేయలేనమ్మా.. నీకు నిజం తెలిసినప్పుడు నాకన్నా చెప్పి ఉంటే ఈ రోజు ఇంత వరకూ రానిచ్చే వాడ్ని కాదని సుభాష్ అంటాడు.
సీతా రామయ్యకు నిజం చెప్పిన కావ్య:
ఈ సీన్ కట్ చేస్తే.. సీతా రామయ్య దగ్గరకు వచ్చిన కావ్య.. ఈ ఇంట్లో ఎవరు ఏం అనుకున్నా.. మీరు మాత్రం నన్ను అర్థం చేసుకుంటూ వచ్చారు. అండగా నిలబడ్డారు. కానీ నిన్న జరిగిన సంఘటనలతో మీకు కూడా నా మీద కోపం వచ్చి ఉంటుంది. నాకు తెలుసు.. మీరు నాతో మాట్లాడటానికి కూడా ఇష్ట పడటం లేదు. కానీ మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీకో విషయం చెప్పాలని వచ్చాను. అందరూ అనుకున్నట్టు నేను మోసం చేయలేదు తాతయ్యా. మా అక్క స్వప్న అబద్ధం చెప్పింది. ఇప్పుడు ఆ విషయం ఎవరికి చెప్పినా కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు.. చెప్పే అవకాశం కూడా ఇవ్వడం లేదు. అక్కకి కడుపు లేదన్న విషయం.. రాహుల్ అక్కకి తాళి కట్టే సమయంలోనే నాకు తెలిసింది. ఆ తర్వాత అక్కకి ఎన్ని సార్లు చెప్పినా.. అది పట్టించుకోలేదు. నిజం చెప్తే చనిపోవడం తప్ప మరో దారి లేదని నన్ను బెదరించింది. అందుకే నేను చెప్పలేకపోయాను. నేను నిజం దాచాను.. అబద్ధం చెప్పలేదు. ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికే కట్టుబడి ఉంటాను అని కావ్య చెప్పి వెళ్లిపోతుంది.
రాహుల్ కి అదరిపోయేలా వార్నింగ్ ఇచ్చిన స్వప్న.. వెనక్కి తగ్గేసాడుగా:
ఇక స్వప్న దగ్గరికి వచ్చిన రాహుల్.. ఏంటి ఈ ఇంట్లో ఏం చేస్తే పర్మినెంట్ గా సెట్లయిపోవచ్చు అని ఆలోచిస్తున్నావా? నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా.. నువ్వేం చేయలేవ్ అని రాహుల్ అంటాడు. తప్పా నేను చేశానా.. ఈ మాట ఇంట్లో ఎవరైనా అనొచ్చు కానీ.. నువ్వు అనకూడదు రాహుల్.. తప్పు అనే పదానికి మీనింగే నువ్వు అని స్వప్న అంటుంది. హో మరి నువ్వు చేసింది ఏంటి? రాజ్ ని కాదని నాతో వచ్చేయలేదా అని రాహుల్ అంటే.. అలా చేసింది నువ్వే కదా అని స్వప్న అంటుంది. అలా ఎవరు చేసినా వెళ్లిపోతావు అనే కదా అర్థం అని రాహుల్ అంటే.. షటప్ అని స్వప్న కోపంగా అరుస్తుంది. ఈ స్వప్న అంటే ఏం అనుకున్నావ్? మరీ అంత చీప్ క్యారెక్టర్ అనుకున్నావా.. లేకపోతే నీలా కనిపించే వాళ్ల వెంట పడే రకం అనుకున్నావా.. నేను రాజ్ ని ఎప్పుడూ ప్రేమించలేదు. డబ్బు ఉంది పెళ్లి చేసుకుంటే లైఫ్ బావుంటుంది అనుకున్నా అంతే. కానీ నువ్వు పరిచయం అయ్యాక.. నీతో ప్రేమలో పడ్డాను. నువ్వు నటించినా అది నిజం అనుకుని నా మనసు నీకు ఇచ్చాను. నువ్వేం చేశావ్.. నాకు డబ్బు లేదనగానే.. మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావ్. ఇప్పుడు చెప్తున్నా విను.. ఇన్నాళ్లూ మీరు చూసిన స్వప్న వేరు.. కానీ ఇకపై నా రెండో మొహాన్ని చూస్తారు. నేను ఏదైనా సాధించేంత వరకూ వదిలి పెట్టను. ఈ ఇంట్లో నుంచి వెళ్లడం అనేది ఎప్పటీ జరగదు.. ఆ దమ్మూ, ధైర్యం ఎవ్వరికీ లేదు. ఈ జీవితానికి నేనే నీ పెళ్లాం అని ఫిక్స్ అయిపో. కాదూ కూడదూ అని మీ అమ్మ కొంగు పట్టుకుని తిరిగితే నీకు కూడా నేనేంటో చూపించాల్సి ఉంటుందని స్వప్న అంటుంది.
కృష్ణుడికి మొర పెట్టుకున్న కావ్య:
ఇక కృష్ణుడు దగ్గరికి వచ్చి బాధ పడుతుంది కావ్య. ఇప్పుడిప్పుడే మా ఆయన మారుతున్నాడని సంతోష పడ్డాను. నా కష్టం.. తన కష్టం ఒక్కటే అని చెప్పాడు. చిన్న కోరిక కోరితేనే అర్థ రాత్రి నన్ను బయటకు తీసుకెళ్లాడు. నేను ఆయన కళ్లల్లో నా మీద ప్రేమను చూశాను. కానీ నువ్వు అదంతా చెరిపేశావ్ అని కావ్య కృష్ణుడికి మొర పెట్టుకుంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.







