AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adi Reddy: రెండోసారి తండ్రైన బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి.. బ్యూటిఫుల్ వీడియో షేర్ చేసి..

బిగ్ బాస్ ఫేమ్ ఆది రెడ్డి శుభవార్త చెప్పాడు. తాను రెండోసారి తండ్రయ్యానంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా ఒక బ్యూటిఫుల్ వీడియోను కూడా షేర్ చేశాడు. దీంతో బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆది రెడ్డి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Adi Reddy: రెండోసారి తండ్రైన బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి.. బ్యూటిఫుల్ వీడియో షేర్ చేసి..
Adi Reddy Family
Basha Shek
|

Updated on: Aug 05, 2025 | 7:01 PM

Share

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఆదిరెడ్డి రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని సతీమణి మంగళవారం (ఆగస్టు 05) పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు ఆదిరెడ్డి. ఇప్పటికే ఈ దంపతులకు అద్విత అనే కూతురు ఉంది. ఇప్పుడు మరోసారి మహాలక్ష్మినే పుట్టిందంటూ ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశాడు ఆదిరెడ్డి. ‘మళ్లీ ఆడపిల్ల పుట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా తల్లి చనిపోయిన మరుసటి రోజే నా కూతురు పుట్టింది. బహుశా దేవుడు అలా ప్లాన్ చేశాడేమో. నా తల్లి వేరే రూపంలో నా దగ్గరకు తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుంది’ అని కాస్త ఎమోషనల్ అయ్యాడీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. పలువురు బుల్లితెర ప్రముఖులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, సినీ అభిమానులు, నెటిజన్లు ఆది రెడ్డి దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా 2020లో కవిత అనే అమ్మాయితో కలిసి పెళ్లిపీటలెక్కాడు ఆది రెడ్డి. ఇప్పటికే ఈ దంపతులకు అద్విత అనే అమ్మాయి ఉంది. కొన్ని నెలల క్రితం కవిత మరోసారి గర్భం దాల్చింది. ఇటీవలే ఆమెకు గ్రాండ్ గా సీమంతం కూడా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఆది రెడ్డి షేర్ చేసిన వీడియో..

కామన్ మ్యాన్ గా అడుగు పెట్టి టాప్-5లో..

బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, యూట్యూబర్ గా, రివ్యూయర్ గా..ఇలా తెలుగు రాష్ట్రాల్లో బాగానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది రెడ్డి. బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో కామన్ మ్యాన్ కోటాలో ఎంట్రీ ఇచ్చిన అతను తన ఆట, మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. టైటిల్ గెలవకపోయినా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తున్నాడు ఆది రెడ్డి. అందులో బిగ్ బాస్ తో పాటు అప్పుడప్పుడు సినిమాలపైనా రివ్యూలు ఇస్తున్నాడు. అలాగే కొన్ని టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు. ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు రూపొందిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.

భార్య సీమంతం వేడుకలో ఆది రెడ్డి.. వీడియో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .