Pallavi Prashanth: ‘అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక’.. తల్లికి పల్లవి ప్రశాంత్ గిఫ్ట్‌

బిగ్ బాస్ విన్నర్ ను ప్రకటించే సమయంలో తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఒక ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ రైతు బిడ్డకు రూ. 15 లక్షల విలువైన బంగారం కూడా బహుమతిగ ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇప్పుడిదే బంగారు నగను ప్రశాంత్ కు అందజేసింది ఆభరణాల సంస్థ

Pallavi Prashanth: 'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'.. తల్లికి పల్లవి ప్రశాంత్ గిఫ్ట్‌
Pallavi Prashanth
Follow us
Basha Shek

|

Updated on: May 10, 2024 | 4:16 PM

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉన్నాడు. తాను విజేతగా నిలిచినప్పుడు ఓ ప్రముఖ జ్యూవెలరీ కంపెనీ ప్రకటించిన కాస్ట్లీ గోల్డ్ చైణ్ ఇప్పుడు చేతికి వచ్చింది. బిగ్ బాస్ విన్నర్ ను ప్రకటించే సమయంలో తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఒక ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ రైతు బిడ్డకు రూ. 15 లక్షల విలువైన బంగారం కూడా బహుమతిగ ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇప్పుడిదే బంగారు నగను ప్రశాంత్ కు అందజేసింది ఆభరణాల సంస్థ. కాగా ఈ బంగారాన్ని అమ్మకు బహుమతిగా ఇస్తానని గతంలోనే వెల్లడించాడు రైతు బిడ్డ. ఎట్టకేలకు ఇప్పుడు గోల్డ్ చైన్ చేతికి రావడంతో రైతు బిడ్డ తెగ మురిసిపోతున్నాడు. అందుకే తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతోనూ పంచుకున్నాడు. బంగారు ఆభరణాలను అందుకుంటోన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పల్లవి ప్రశాంత్.. ‘అమ్మకు తొలి కానుక.. బిగ్ బాస్ ఏడో సీజన్ కు చాలా థ్యాంక్స్.. లవ్యూ నాగ్ సార్’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు.

బిగ్ బాస్ ముగిసిన 5 నెలలకు..

పల్లవి ప్రశాంత్ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. కాగా బిగ్ బాస్ షో ముగిసిన ఐదు నెలల తర్వాత గోల్డ్ ఛైన్ ను పల్లవి ప్రశాంత్ కు అందించడం గమనార్హం. బిగ్ బాస్ సీజన్ ముగిసిన తర్వాత బుల్లితెరపై బాగానే సందడి చేస్తున్నాడు పల్లవి ప్రశాంత్. స్టార్ మా నిర్వహించే పండగ స్పెషల్ ఈవెంట్లలో కనిపిస్తున్నాడు. అలాగే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకుంటున్నాడు. హీరో శివాజీ చేతుల మీదుగా కొన్ని రోజుల క్రితం ఓ పేద రైతు కుటుంబానికి రూ. లక్ష అందజేశాడు ప్రశాంత్. అలాగే ఒక ఏడాదికి సరిపడా బియ్యం కూడా అందజేశాడు.

ఇవి కూడా చదవండి

జ్యూయెలరీ అందుకుంటున్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్..

పేద కుటుంబానికి సాయం చేస్తోన్న పల్లవి ప్రశాంత్, వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.