Akarsh Byramudi: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరో తెలుసా.. ?
ఆకర్ష్ పెళ్లి ఫోటోలను యూట్యూబర్ నిఖిల్ పోస్ట్ చేస్తూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో అటు కొత్త జంటకు పలువురు సీరియల్ యాక్టర్స్, నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ఆకర్ష్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఫోటో మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. అలాగే ఆకర్ష్ పెళ్లి చేసుకున్న అమ్మాయికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
తెలుగు సీరియల్ హీరో ఆకర్ష్ బైరమూడి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆకర్ష్ పెళ్లి ఫోటోలను యూట్యూబర్ నిఖిల్ పోస్ట్ చేస్తూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో అటు కొత్త జంటకు పలువురు సీరియల్ యాక్టర్స్, నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ఆకర్ష్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఫోటో మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. అలాగే ఆకర్ష్ పెళ్లి చేసుకున్న అమ్మాయికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
ఆకర్ష్ బైవరముడి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో అనేక సీరియల్లలో హీరోగా కనిపించాడు. పున్నాగ, అత్తారింట్లో అక్క చెల్లెళ్లు, అగ్ని పరీక్ష, రాజేశ్వరి విలాస్ కాఫీ వంటి సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం మామగారు సీరియల్లో నటిస్తున్నాడు. తెలుగులోనే కాకుండా అటు కన్నడ సీరియల్స్ లోనూ ఆకర్ష్ ప్రధాన పాత్రలు పోషించాడు. ఆకర్ష్ స్వస్థలం కర్ణాటకలోని సక్లేష్ పుర.
అటు సీరియల్స్ లోనే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు రియాల్టీ షోలలో పాల్గొని సందడి చేశాడు ఆకర్ష్. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇటీవల కొన్ని రోజులుగా బ్యాచిలర్ పార్టీ, హల్దీ, ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ అంటూ నెట్టింట తెగ సందడి చేశారు. అయితే ఆకర్ష్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ప్రచారం నడిచింది. కానీ అమ్మాయి ఎవరనేది మాత్రం బయటపెట్టలేదు. తాజాగా ఆకర్ష్ పెళ్లి వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చశాడు యూట్యూబర్ నిఖిల్.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.