Brahmamudi, May 10th episode: రాజ్‌కు మరో పెళ్లి చేస్తానన్న అపర్ణ.. రాజ్ కన్నీళ్లు తుడిచిన కావ్య!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ వల్ల కావ్య ఏం సుఖ పడుతుంది? ఆమె జీవితంలో ఏం సుఖం పొందింది. భర్త దూరం పెట్టాడు. మరో అమ్మాయితో బిడ్డను కని ఇంటికి తీసుకొచ్చాడు. అలాంటి వాడితో ఏ ఆడది అయినా ఎలా కలిసి ఉంటుంది? నేనేమీ కావ్యకు అన్యాయం చేయడం లేదు. ఆమెకు భగవంతుడే అన్యాయం చేశారు. నేను న్యాయం చేస్తాను. కావ్యను రాజ్‌జీవితం నుంచి పంపించేసి..

Brahmamudi, May 10th episode: రాజ్‌కు మరో పెళ్లి చేస్తానన్న అపర్ణ.. రాజ్ కన్నీళ్లు తుడిచిన కావ్య!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: May 10, 2024 | 12:37 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ వల్ల కావ్య ఏం సుఖ పడుతుంది? ఆమె జీవితంలో ఏం సుఖం పొందింది. భర్త దూరం పెట్టాడు. మరో అమ్మాయితో బిడ్డను కని ఇంటికి తీసుకొచ్చాడు. అలాంటి వాడితో ఏ ఆడది అయినా ఎలా కలిసి ఉంటుంది? నేనేమీ కావ్యకు అన్యాయం చేయడం లేదు. ఆమెకు భగవంతుడే అన్యాయం చేశారు. నేను న్యాయం చేస్తాను. కావ్యను రాజ్‌జీవితం నుంచి పంపించేసి.. రాజ్ కోరుకున్న అమ్మాయితో న్యాయం చేస్తాను. అప్పుడు వాడికీ న్యాయం జరుగుతుంది. ఆ బిడ్డకు కూడా న్యాయం జరుగుతుంది. ఇక కావ్యకు కావాల్సినంత ఆస్తి రాసిచ్చేస్తాను. అందుకే రాజ్ ని ఒత్తిడి చేస్తున్నా. కానీ వాడు నోరు విప్పడం లేదు. అందుకే నేనే వెళ్లి పోతాను. నేను ఇలా స్వార్థంగా ఆలోచిస్తున్నాను అని మీరు ఆశ్చర్యపోతున్నారా? నాకు తెలుసు. కానీ తప్పడం లేదు. వాడు నిజం చెప్తే.. జరిగేది ఇదే. చెప్పకపోతే.. నేను గడప దాటి వెళ్లిపోవడం ఖాయమని సుభాష్‌కి చెబుతుంది అపర్ణ. నీ గురించి నా కొడుకు ఇంత ఆలోచిస్తుంటే.. నువ్వు వాడి కాపురాన్నే కూల్చాలి అనుకుంటున్నావా? ఏం చేయాలి? అని సుభాష్ ఆలోచిస్తూ ఉంటాడు.

రాజ్‌ని వెళ్లగొట్టేందుకు రుద్రాణి, రాహుల్‌ల ప్లాన్..

ఈ సీన్ కట్ చేస్తే.. రుద్రాణి, రాహుల్‌లు కలిసి ఏం చేసి అయినా సరే కావ్య, రాజ్‌లను ఇంట్లో నుంచి తరిమేస్తాను అని అన్నావ్. కానీ ఇప్పుడు అత్త ఇలా మాట మార్చేసింది. ఇప్పుడు ఆవిడ ఇంట్లోంచి వెళ్లిపోయిన తర్వాత ఎలాగోలా బ్రతిమలాడి తీసుకొస్తారు. మళ్లీ అంతా మొదటికి వస్తుందని రాహుల్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. అది మాత్రం అస్సలు జరగను. రాజ్‌ని తప్పుబట్టి.. వదినను వెళ్లడానికి వీలు లేదని.. రాజ్‌ని హర్ట్ చేస్తాను. ఎలాగోలా రాజ్‌ని వెళ్లిపోయాల చేస్తానని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. మరి ఎవరి ప్లాన్ సక్సెస్ అవుతుందో చూడాలి.

కావ్య భుజంపై వాలి బాధ పడ్డ రాజ్..

ఆ తర్వాత కావ్య గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాజ్ వస్తాడు. ఈ సమయంలోనే ఓ సాడ్ సాంగ్ ప్లే అవుతుంది. కావ్య పక్కన కూర్చొని బాధ పడుతూ ఉంటాడు రాజ్. ఏంటండి అని కావ్య అడిగితే.. కావ్య భఉజంపై రాజ్ వాలతాడు. మీరు ఇలా మారిపోయారేంటి? అని కావ్య అడిగితే.. మా అమ్మ నా మీద ఇంత ద్వేషంగా మారిపోవడం చుస్తుంటే చాలా బాధగా ఉంది కళావతి. అమ్మ ఇల్లు విడిచి వెళ్లిపోతానని అంటుందని రాజ్ అంటే.. అది ద్వేషం కాదు.. వేషం మాత్రమే. ఆపే శక్తి మనసుకు ఉంటుందని కావ్య నచ్చచెప్తుంది. మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోతే ఇల్లు ముక్కలైపోతుంది. ఇన్నాళ్లూ మా అమ్మ ఈ ఇంటిని ముక్కలు కాకుండా చూసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు నావల్ల ఇదంతా చూస్తుంటే భయంగా ఉందని రాజ్ అంటే.. ఆవిడ వెళ్లకుండా నేను చూస్తాను అని కావ్య చెప్తుంది.

ఇవి కూడా చదవండి

అనామిక మరో ప్లాన్.. కరిగిన ధాన్యం..

ఈలోపు అనామిక మరో ప్లాన్ చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే.. ఎవరు ఇంట్లోంచి వెళ్లిపోతారో అర్థం కావడం లేదు. ఎలాగైనా మా అత్తగార్ని మంచి చేసి నా దారిలోకి తెచ్చుకోవాలి. లేదంటే నేను ఒక్కదాన్నే అయిపోతానని అత్త గారి దగ్గరకు వెళ్తుంది అనామిక. కానీ ధాన్యలక్ష్మి ఏమీ పట్టించుకోకుండా వెళ్తుంది. ఇంకా ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటారు? అంటే మన మధ్య ఇంకేం బంధం లేదా? తప్పు చేశాను.. క్షమించండని అనామిక అంటే.. నువ్వు చేసింది చిన్న తప్పా.. నా కొడుకుని జైలు దాకా తీసుకెళ్లావ్. నీకు శిక్ష వేయడానికి నేను ఎవరు? అని ధాన్యం అంటుంది. ఇక తన స్టైల్‌లో ఎమోషనల్ అయి.. అత్తని కరిగిస్తుంది అనామిక.

కోటి రూపాయలు కట్టేందుకు రుద్రాణి ప్లాన్..

మరోవైపు స్వప్న గదిలో ఉండే కోటి రూపాయలు కొట్టేయాలని ప్లాన్ చేస్తారు రుద్రాణి, రాహుల్‌లు. అనుకున్నట్టుగానే గదిలోకి వెళ్తారు. మెల్లగా తాళం తీసి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ వేస్తారు. తాళం తీసుకుని.. కబోర్డ్ ఓపెన్ చేయగానే.. తన స్టైల్‌లో అదిరే షాక్ ఇస్తుంది స్పప్న. ఒక్కసారిగా దెయ్యంలాగా కనిపించి బెదరగొడుతుంది. దీంతో హడలి చస్తారు రుద్రాణి, రాహుల్‌లు. ఆ తర్వాత రుద్రాణిని కుమ్మేస్తుంది. దెబ్బకు అక్కడి నుంచి పారిపోతారు. ఏం చేయాలా అని.. బటయ నుంచొని సుభాష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్‌ ముగుస్తుంది.