Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్.. రన్నరప్‌తో సరిపెట్టుకున్న గౌతమ్

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కు ఎండ్ కార్డ్ పడింది. సుమారు 105 రోజుల పాటు సాగిన ఈ రియాల్టీషోలో చివరకు నిఖిల్ విజేతగా నిలిచాడు. తెలుగబ్బాయి గౌతమ్ రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు.

 Bigg Boss 8 Telugu:  బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్.. రన్నరప్‌తో సరిపెట్టుకున్న గౌతమ్
Bigg Boss 8 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Dec 15, 2024 | 11:05 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగిసింది. 106 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ రియాలిటీ షోలో చివరకు సీరియల్ నటుడు నిఖిల్ విజేతగా నిలిచాడు. తెలుగబ్బాయి గౌతమ్ కృష్ణ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అంతకు ముందు టాప్ -5 లో నిలిచిన  అవినాశ్, ప్రేరణ, నబీల్ ఎలిమినేట్ అయ్యారు. చివరకు  గౌతమ్, నిఖిల్ టాప్ -2 లో నిలిచారు. ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు నాగార్జున  ఇచ్చిన ఆఫర్ ను ఇద్దరూ తిరస్కరించారు. దీంతో చివరకు నిఖిల్ ను విజేతగా ప్రకటించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విజేతకు బిగ్ బాస్ ట్రోఫీ బహూకరించారు. అలాగే రూ.55 లక్షల చెక్కును తీసుకున్నాడు. వీటితో పాటు మారుతి డిజైర్‌ కారు అదనపు బహుమతిగా లభించనుంది. కాగా ఈ విజయాన్ని తన తల్లికి అంకితం ఇచ్చాడు నిఖిల్. తెలుగు ఆడియన్స్ మరోసారి తనని తమ ఇంటి బిడ్డగా ప్రూవ్ చేశారని ఎమోషనల్ అయ్యాడు.

నిఖిల్ సొంతూరు కర్ణాటకలోని మైసూర్. అతని  తండ్రి ఓ జర్నలిస్ట్ కావడం విశేషం. ఇక గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు నిఖిల్. ఆ  తర్వాత ‘కలిసివుంటే కలదు సుఖం’ సీరియల్‌లో కూడా ఓ మంచి పాత్ర చేశాడు. ‘స్రవంతి’, ‘ఊర్వశివో రాక్షసివో’ సీరియల్స్ కూడా నిఖిల్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. సీరియల్స్‌‍తో పలు టీవీ షోలు, గేమ్ షోలు, ఫెస్టివల్ ఈవెంట్స్‌లో నిఖిల్ సందడి చేశాడు. బిగ్‌బాస్ సీజన్-8కి వచ్చే ముందు ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్’ షోలో కూడా నిఖిల్ పాల్గొన్నాడు.  ఇక బిగ్ బాస్ షోలో పాల్గొన్నందుకు నిఖిల్‌ వారానికి రూ.2.25 లక్షల పారితోషికం తీసుకున్నాడట! ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ రూ.33,75,000 సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే ప్రైజ్ మనీతో కలిపి మొత్తంగా రూ. 88 లక్షలు నిఖిల్ సంపాదించాడని సమాచారం.

ఇవి కూడా చదవండి

నాగార్జున, రామ్ చరణ్ ల తో బిగ్ బాస్ విజేత నిఖిల్..

రన్నరప్ గా డాక్టరబ్బాయి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్