AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ విజేతగా నిఖిల్.. ప్రైజ్ మనీ, పారితోషికంతో పాటు ఏమేం అందుకున్నాడంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ ను నిఖిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం (డిసెంబర్ 15) జరిగిన గ్రాండ్ ఫినాలేలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నాడీ సీరియల్ యాక్టర్.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ విజేతగా నిఖిల్.. ప్రైజ్ మనీ, పారితోషికంతో పాటు ఏమేం అందుకున్నాడంటే?
Bigg Boss 8 Telugu Nikhil
Basha Shek
|

Updated on: Dec 16, 2024 | 6:47 AM

Share

సుమారు 3 నెలల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగిసింది. సెప్టెంబర్ 01న ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ఆదివారం (డిసెంబర్ 15)తో ఎండ్ కార్డ్ పడింది. నిన్న గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యాడు. అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్, టాప్ -5 కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోలాహాలంగా సాగింది. ఇక టాప్ -5లో మొదట అవినాశ్ ఎలిమినేట్ కాగా ఆ తర్వాత ప్రేరణ, నబీల్ బయటకు వచ్చేశారు. దీంతో టాప్ -2లో గౌతమ్, నిఖిల్ నిలిచారు. ఆఖరికి మొదటి నుంచి టైటిల్ ఫేవరేట్ గా ఉన్న నిఖిల్ ను బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా ప్రకటించారు. డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. పేరుకు కన్నడ నటుడే అయినా తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు నిఖిల్. కంటెస్టెంట్స్ సూటి పోటి మాటలు అన్నా ఆటతోనే సమాధానం చెప్పాడు. ఇక ఫిజికల్ టాస్కుల్లో అయితే నిఖిల్ కు తిరుగులేకుండా పోయింది. దీంతో మొదటి నుంచి ఈ సీరియల్ నటుడిని బిగ్ బాస్ టైటిల్ ఫేవరేట్ గా భావించారు. ఇప్పుడు అదే నిజమైపోయింది. ఆదివారం జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీతో పాటు రూ. 55 లక్షల చెక్కు అందుకున్నాడు నిఖిల్. ఇక గెలిచిన తర్వాత తన విజయాన్ని తల్లిదండ్రులకు అంకితం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

కాగా బిగ్ బాస్ విజేతగా నిలిచిన నిఖిల్ అమౌంట్ పరంగా కూడా జాక్ పాట్ కొట్టాడని చెప్పువచ్చు. టైటిల్‌ విజేతగా నిలిచినందుకు ‍ రూ.55 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్న నిఖిల్ మారుతి డిజైర్‌ కారు కూడా దక్కించుకోనున్నాడు. ఇకపోతే బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు నిఖిల్‌ వారానికి ఏకంగా రూ.2.25 లక్షల పారితోషికం తీసుకున్నాడట! ఈ లెక్కన మొత్తం పదిహేనువారాలకుగానూ రూ.33,75,000 సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ. 88 లక్షలు నిఖిల్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

నాగార్జున, రామ్ చరణ్ ల తో బిగ్ బాస్ విజేత నిఖిల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..