Bigg Boss 8 Telugu: ‘వైల్డ్’ ఫైర్‌లా విజృంభించినా.. ప్చ్.. బిగ్ బాస్ రన్నరప్ గౌతమ్ ఏమేం గెల్చుకున్నాడంటే?
'ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి' అన్న మాటను అక్షరాలా నిజం చేసి చూపించాడు బిగ్ బాస్ రన్నరప్ గౌతమ్ కృష్ణ. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌తో పూర్తిగా నెగెటివిటీని మూటగట్టుకున్న ఈ డాక్టర్ బాబు తాజా సీజన్ లో రన్నరప్‌గా నిలిచి విమర్శకుల నోళ్లు మూయించాడు.
బిగ్ బాస్ గత సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన గౌతమ్ కృష్ణ ఈసారి మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. మాట్లాడే తీరు, ప్రవర్తన తీరు విషయంలో గౌతమ్ చాలామందికి నచ్చడు. ఇవే లాస్ట్ సీజన్ లో గౌతమ్ కు పూర్తి నెగెటివిటీని తెచ్చి పెట్టింది. ఫలితంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయాడు. అయితే ఎక్కడ పోగోగట్టుకున్న దానిని అక్కడే వెతుక్కోవాలి అన్న మాటను నిజం చేస్తూ తాజా సీజన్ లో రన్నరప్ గా నిలిచాడీ డాక్టర్ బాబు. వైల్డ్ కార్డ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన డాక్టర్ బాబు గతంలో లాగానే పూర్తి అగ్రెసివ్ తో గేమ్ ఆడాడు. అయితే కాస్త పరిణితితో వ్యవహరించాడు. ఇదే అతనికి బోలెడంత మంది ఫ్యాన్స్‌ని సంపాదించి పెట్టింది. తనదైన ఆట, మాట తీరుతో ఎప్పటికప్పుడు తన ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటూ ఫైనల్ దాకా వచ్చాడు. అప్పటికే మెయిన్ కంటెస్టెంట్ గా హౌస్ లో ఉన్న నిఖిల్ కు గట్టి పోటీ ఇచ్చాడు. కానీ ఆఖరుకు రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఆఖరిలోనూ గౌతమ్ కు గోల్డెన్ సూట్ కేస్ ఆఫర్ వచ్చింది. సూట్ కేసులో ఎంత మొత్తం ఉందో తెలీదు కానీ గౌతమ్ సూట్ కేసు ఆఫర్ ను రిజెక్ట్ చేశాడు. దీంతో రన్నరప్ గా నిలిచిన డాక్టర్ బాబుకు కేవలం రెమ్యునరేషన్ మాత్రమే దక్కింది . అయితేనేం ఎంతో మంది అభిమానులను గెల్చుకుని బయటకు వచ్చాడీ తెలుగబ్బాయి.
కాగా బిగ్ బాస్ లో ఉన్నందుకు వారానికి రూ.1.75 లక్షల చొప్పున గౌతమ్ కృష్ణ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 10 వారాలకు గానూ సుమారు రూ.17.5 లక్షల రెమ్యునరేషన్ గౌతమ్ అందుకున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ వేదికపై రామ్ చరణ్ తో గౌతమ్ ..
View this post on Instagram
కాగా తల్లిదండ్రుల కోరిక మేరకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన గౌతమ్ కృష్ణ 2019లో ఆకాశవీధుల్లో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా కథ, డైరెక్షన్ బాధ్యతలను కూడా తనే నిర్వర్తించాడు. అలాగే హిందీలో సిద్దూ ది రాక్‌స్టార్ సినిమా తోనూ మెప్పించాడు. మరి ఇప్పుడు బిగ్ బాస్ రన్నరప్ గా నిలవడంతో గౌతమ్ కు మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి.
సపోర్టు చేసిన వారందరికీ థ్యాంక్స్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.