Bigg Boss: పవిత్ర స్థలంలో ఇలాంటి పనులేంటమ్మా? బిగ్ బాస్ బ్యూటీ చేసిన పనికి ఆరు రోజుల పాటు ఆలయ శుద్ధి పూజలు
సోషల్ మీడియాలో ఫేమ్ కోసం కొందరు చేసే పనులు తీవ్ర వివాదాలకు దారి తీస్తున్నాయి. రీల్స్, షార్ట్స్ మోజులో పడి సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా తప్పులు చేస్తున్నారు. తాజాగా కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ దేవస్థానం వద్ద ఓ బిగ్‌బాస్ కంటెస్టెంట్ తన ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం చేసిన పని తీవ్ర వివాదానికి దారి తీసింది.

కేరళలోని ప్రముఖ ఆలయమైన గురువాయూర్ ఆలయంలో బిగ్ బాస్ మలయాళం మాజీ కంటెస్టెంట్ జాస్మిన్ జాఫర్ చేసిన ఒక పని తీవ్ర విమర్శకుల దారి తీసింది. సంప్రదాయ చీర ధరించి ఆలయంలోకి వెళ్లిన ఆమె అక్కడ పవిత్ర కొనేరులో తన కాళ్లను కడుక్కుంటూ వీడియో తీసుకుంది. అనంతరం దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే.. ఒక్కసారిగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో కేరళలోని హిందూ మత పెద్దలు, నెటిజన్లు జాస్మిన్ జాఫర్ పై మండిపడుతున్నారు. ఆలయ నిబంధనలను ఆమె తుంగలో తొక్కిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ ఆలయ సాంప్రదాయం ప్రకారం.. విగ్రహామూర్తులకు ఈ పవిత్ర కొలనులో స్నానం చేయిస్తుంటారు. ఈ కొలనులోకి వెళ్లడానికి భక్తులకు అనుమతి లేదు. అయితే ఆ విషయం తెలియక జాస్మిన్ జాఫర్ ఆ కొలనులో తన కాళ్లు కడుక్కుంది. జాస్మిన్ జాఫర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేయడంతో ఆలయ నిర్వహణ, హిందూ నాయకులు భగ్గుమంటున్నారు. జాస్మిన్ జాఫర్ మలయాళం సీజన్ 6 లో పాల్గొన్న తర్వాత ఆమె ప్రజాదరణ పెరిగింది. ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ ఛానెల్ లో ఆసక్తికరమైన వీడియోలు చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. జాస్మిన్ జాఫర్ యూట్యూబ్ ఛానెల్ లో 1.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఆమెకు చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు.
కాగా ఆలయ నిబంధనల ప్రకారం గురువాయూర్ ఆలయం కోనేరులో పాదాలను కడుక్కోకూడదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఇప్పుడు, జాస్మిన్ జాఫర్ ఈ ఆదేశాన్ని ఉల్లంఘించారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. కాగా తన వీడియోపై తీవ్ర విమర్శలు రావడంతో జాస్మిన్ స్పందించింది. వెంటనే తన ఖాతా నుంచి కాంట్రవర్సీ వీడియోను డిలీట్ చేసింది. అలాగే తన వీడియో పట్ల అందరికీ క్షమాపణలు చెప్పింది. తనకు ఈ ఆంక్షల గురించి తెలియదని, ఎవరినీ బాధపెట్టాలని లేదా వివాదం సృష్టించాలన్న ఉద్దేశం లేదని జాస్మిన్ పేర్కొంది. ‘నన్ను అభిమానించే వారికి నేను చేసిన వీడియో బాధ కలిగించిందని నేను అర్థం చేసుకున్నాను. అజ్ఞానం వల్ల జరిగిన తప్పుకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను’ అని జాస్మిన్ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది.
భక్తుల ఆగ్రహం..
కాగా జాస్మిన్ జాఫర్ చేసిన పని వల్ల ఆలయ పవిత్రతకు భంగం కలిగిందని భావించి, మంగళవారం నుంచి ఆరు రోజుల పాటు శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఈ రోజుల్లో ఆలయంలో భక్తుల దర్శనాలపై కూడా ఆంక్షలు విధించారు. ఆలయ నిబంధనలను ఉల్లంఘించినందుకు జాస్మిన్ జాఫర్‌పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు
कभी मस्जिद में जाकर Reels क्यूं नहीं बनाती??#JasminJafar केरल के गुरुवायुर श्री कृष्ण मंदिर में शुद्धिकरण अनुष्ठान आयोजित किए गए, क्योंकि एक गैर-हिंदू व्लॉगर ने मंदिर के पवित्र तालाब में अपने पैर धोए।
जैस्मिन जाफर, जो कि पूर्व बिग बॉस प्रतियोगी भी रह चुकी हैं, ने इसका वीडियो… pic.twitter.com/wIHSH7uI5o
— Priya Mishra (@Priyaaa_B) August 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








