AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: స్టార్ సెలబ్రిటీపై లైంగిక ఆరోపణలతో సంచలనం.. ఇప్పుడు బిగ్ బాస్‌లోకి.. ఎవరో తెలుసా?

బుల్లతెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్‌బాస్ మళ్లీ ముస్తాబవుతోంది. ఈసారి మరిన్ని హంగులు, విశేషాలతో ఈ రియాలిటీ షో సందడి చేయనుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 9లోకి ఓ లేడీ కొరియోగ్రాఫర్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టనుందని సమాచారం

Bigg Boss Telugu 9: స్టార్ సెలబ్రిటీపై లైంగిక ఆరోపణలతో సంచలనం.. ఇప్పుడు బిగ్ బాస్‌లోకి.. ఎవరో తెలుసా?
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Aug 26, 2025 | 7:10 PM

Share

బిగ్‌బాస్ కొత్త సీజన్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తొమ్మిదో సీజన్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది. గత సీజన్ల కంటే మరింత భిన్నంగా ఈ షోను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్ తో పాటు ఈసారి కొత్త కొత్త టాస్కులు, గేమ్స్ షోలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇంకో విశేషమేమిటంటే.. ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా భాగం కానున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం బిగ్ బాస్ అగ్నిపరీక్ష పేరుతో కామన్ మ్యాన్ ఎంపిక పోటీలు జరుగుతున్నాయి. నవదీప్-అభిజిత్-బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ షో.. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఇప్పటికే మూడు నాలుగు ఎపిసోడ్స్ అయిపోయాయి. అయితే ఇప్పుడీ షోలోకి ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ రానున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం వరకు ఆమె గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఓ స్టార్ కొరియోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తూ వచ్చిన ఆమె అతనిపైనే లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టింది. ఫలితంగ ఆ టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జైలు పాలయ్యాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తున్నాడు.

ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఆమె మరెవరో కాదు శ్రష్ఠి వర్మ. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తూ వచ్చిన ఈమె అతనిపైనే లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దీంతో జానీ మాస్టర్ రిమాండ్ ఖైదీగా కొద్ది రోజుల పాటు జైలులో కూడా ఉండాల్సి వచ్చింది. ఈ వ్యవహారం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుతం సైలెంట్ అయిపోయంది. బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నాడు. మరోవైపు శ్రష్ఠి కూడా కొరియోగ్రాఫర్‌గా సిఇనమా అవకాశాలు దక్కించుకుంటోంది. అలాంటిది ఇప్పుడు శ్రష్టి వర్మను బిగ్‌బాస్ 9వ సీజన్ కోసం టీమ్ అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. హౌస్ లోకి వచ్చేందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే బిగ్ బాస్ లాంఛింగ్ వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

శ్రష్ఠి వర్మ లేటెస్ట్ ఫొటోస్..

బిగ్ బాస్ తెలుగ సీజన్ 9 సెప్టెంబర్ రెండో వారం లేదా మూడో వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?