AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరో.. బంపరాఫర్ ఇచ్చిన నాగార్జున

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి రెండో వైల్డ్ కార్డ్ గా టాలీవుడ్ యంగ్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన ఇతను ఆ తర్వాత హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. నటన పరంగా ప్రశంసల వచ్చినా ఒక గట్టి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడీ యంగ్ హీరో.

Bigg Boss Telugu 9: రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరో.. బంపరాఫర్ ఇచ్చిన నాగార్జున
Sreenivasa Sayee
Basha Shek
|

Updated on: Oct 12, 2025 | 10:16 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో రెండో వైల్డ్ కార్డ్ గా టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస సాయి ఎంట్రీ ఇచ్చాడు. గోల్కొండ హైస్కూల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీనివాస్.  ఆతర్వాత కూడా పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు. ఆపై హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. శుభలేఖలు, వినరా సోదర వీర కుమార వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. ఈ  రెండు సినిమాల్లోనూ శ్రీనివాస్ నటనకు చాలా మంచి పేరొచ్చింది. అయితే సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇప్పుడు బిగ్ బాస్ లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకునేందుకు రెడీ అయ్యాడీ యంగ్ హీరో.  ‘  బిగ్ బాస్ హౌస్ లో ఏం చేయగలుగుతానో అది 100 శాతం చేయడానికి ప్రయత్నిస్తాను’ అని నాగార్జునతో చెప్పుకొచ్చాడు శ్రీనివాస్.

ఈ సందర్భంగా శ్రీనివాస్ కు  ఒక ఆఫర్ ఇచ్చాడు నాగార్జున. అదే డార్క్ బ్లూ స్టోన్.. అంటే పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ. నామినేషన్ల సమయంలో ఈ స్టోన్ ఉపయోగించొచ్చు. కానీ ఎప్పుడు ఉపయోగించాలి అనేది బిగ్ బాస్ చెప్తాడు అని నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

రెండో కంటెస్టెంట్ గా గోల్కొండ హైస్కూల్ నటుడు

మొదటి కంటెస్టెంట్ గా రమ్య మోక్ష..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us