AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : అసలేంటమ్మా నీ బాధ.. ఓటమి ఒప్పుకోలేక తనూజ గొడవ.. ఇచ్చిపడేసిన భరణి..

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 చివరి అంకానికి చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. అయితే మొదటి నుంచి విన్నర్ రేసులో ఉన్న తనూజ మాత్రం ఇప్పుడు తన గ్రాఫ్ తనే తగ్గించుకుంటుంది. అనవసర గొడవలు చేస్తూ నెగిటివిటీని మూటగట్టుకుంటుంది.

Bigg Boss 9 Telugu : అసలేంటమ్మా నీ బాధ.. ఓటమి ఒప్పుకోలేక తనూజ గొడవ.. ఇచ్చిపడేసిన భరణి..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Nov 29, 2025 | 3:19 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9.. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీంతో ఈసారి విన్నర్ ఎవరనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కళ్యాణ్, తనూజ ఇద్దరూ విన్నర్ రేసులో పోటాపోటీగా దూసుకుపోతున్నారు. ఈ శనివారం ఎపిసోడ్ కోసం జనాలు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్ లో జరిగిన రచ్చ మాములుగా లేదు. ముఖ్యంగా రీతూపై సంజన నోరుపారేసుకోవడం.. డీమాన్ కళ్యాణ్ మెడ పట్టుకోవడం.. ఈ విషయాలన్నీంటిపై నాగార్జున వచ్చి వాయించి పారేస్తారని అంతా అనుకున్నారు. కానీ తాజాగా శనివారం ఎపిసోడ్ లో మాత్రం నాగార్జున రావడం గురించి కాదు.. అంతకు ముందే తనూజ చేసిన గొడవను ప్రోమోగా వదిలారు.

ఇవి కూడా చదవండి :  Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్‏తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..

తాజాగా విడుదలైన ప్రోమోలో.. సర్ఫ్ యాక్సిల్ ప్రమోషనల్ టాస్క్ జరిగింది. ఈ టాస్కుకు సంచాలక్ గా దివ్యను పెట్టగా.. అటు భరణి, సుమన్ ఒక టీం.. రీతూ, తనూజ ఒక టీం అయ్యారు. అయితే ఎప్పటిలాగే నేనే గెలవాలి.. నేను గెలిస్తేనే ఆట అవతలి వాళ్లు గెలిస్తే ఏడుపు అన్నట్లుగా ఉండే తనూజ.. ఇప్పుడు కూడా మరోసారి సీరియల్ నటిని బయటకు తీసింది.

టాస్కులో భరణి, సుమన్ టీం గెలిచారు. ఇంకేముంది తనూజ ఏడుపు స్టార్ట్ చేసింది. సీజన్ మొత్తం సంచాలక్ గా ఒక్కరికే ఇచ్చేయండి బిగ్ బాస్ అంటూ దివ్య పై సీరియస్ అయ్యింది. దీంతో భరణి ఇచ్చిపడేశాడు. రూల్స్ నీకొక్కదానికే తెలిసినట్టు మాట్లాడకు.. ఊరికే లొడలొడా మాట్లాడకు అంటూ ఫైర్ అయ్యాడు భరణి. దీంతో అసలు విషయాన్ని పక్కన పెట్టేసి.. వాగొద్దు.. వాగుడు.. పిచ్చి మాటలు అనొద్దు అంటూ రెచ్చిపోయింది. సీజన్ మొత్తం ఒకర్నే పెట్టండి అనే మాటలు ఎందుకు ? దివ్య అడిగింది. బిగ్ బాస్ నెక్ట్స్ నుంచి సంచాలక్ గా వేరే వాళ్లను పెట్టండి. నేను చూడలేకపోతున్నానంటా అంటూ దివ్య కౌంటరిచ్చింది. మొత్తానికి.. తాను గెలిస్తే ఒకే.. అవతలి వాళ్లు గెలిస్తే మాత్రం తనూజ మరోలా రియాక్ట్ అయిపోతుంది.

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. 45 కోట్లు పెట్టి తీస్తే రూ.60 వేల కలెక్షన్స్ రాలేదు.. నిర్మాతలను నిండా ముంచేసింది..