AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : రీతూ క్యారెక్టర్ పై సంజన కామెంట్స్.. నాగార్జున సంచలన నిర్ణయం.. అస్సలు ఊహించలేదుగా..

నిజానికి వారం మొత్తం కాకపోయినా.. శనివారం ఎపిసోడ్ ప్రోమో కోసం అడియన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. నాగార్జున ఎప్పుడెప్పుడు వస్తారా.. ? ఎవరికి ఎలాంటి క్లాస్ తీసుకుంటారో అనే విషయం తెలుసుకోవడానికి శనివారం ఉదయం నుంచి ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు. తాజాగా ఈవారం ప్రోమో కాస్త ఆలస్యంగానే రిలీజ్ చేశారు.

Bigg Boss 9 Telugu : రీతూ క్యారెక్టర్ పై సంజన కామెంట్స్.. నాగార్జున సంచలన నిర్ణయం.. అస్సలు ఊహించలేదుగా..
Bigg Boss 9 Telugu
Rajitha Chanti
|

Updated on: Nov 29, 2025 | 6:09 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9.. 12వ వారంలో మాత్రం నామినేషన్స్ జరిగిన తీరు ఈ సీజన్ లోనే పెద్ద గొడవలు అని చెప్పొచ్చు. రణరంగం అని ముందు నుంచి చెప్తున్న నాగార్జున మాట కరెక్టే అన్నట్లుగా కొట్టుకునేదాక వెళ్లారు కంటెస్టెంట్స్. ముఖ్యంగా ఈ వారం నామినేషన్లలో రీతూ, డీమాన్ పవన్ లపై పర్సనల్ అటాక్ చేసింది సంజన. రాత్రంతా డీమాన్ పక్కన కూర్చుంటావ్ అంటూ రీతూపై సంచలన కామెంట్స్ చేసింది. దీంతో ఇమ్మూ సైతం సంజన మాట తీరుపై ఫైర్ అయ్యాడు. అలాగే కళ్యాణ్ మెడ పట్టుకున్నాడు డీమాన్. అందుకే.. ఈ శనివారం నాగార్జున.. ఎవరెవరికి ఎలా క్లాస్ తీసుకోబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉండిపోయింది. తాజాగా ఈరోజు సెకండ్ ప్రోమో రిలీజ్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : Amala Paul : ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. అప్పుడు నాకు 17 సంవత్సరాలే.. హీరోయిన్ అమలా పాల్..

నాగార్జున రాక కోసం ఉదయం నుంచి వెయిట్ చేసిన జనాల ముందుకు ప్రోమోను తీసుకువచ్చారు. పసుపు రంగు చొక్కాలో సీరియస్ గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఫ్యామిలీ వీక్ తర్వాత అంతా సరదాగా ఉంటారని అనుకున్నాను. కానీ నేను హ్యాపీగా లేను అంటూ అసలు విషయం స్టార్ట్ చేశారు. ముందుగా ఇమ్మూతో మాట్లాడుతూ.. నిన్ను బాగా డిస్ట్రబ్ చేసిన గొడవ ఏంటని అడగ్గా.. సంజనా, రీతూ గొడవే సార్.. హౌస్ మొత్తం డిస్ట్రబ్ అయ్యారని అన్నాడు. ఒక అమ్మాయి క్యారెక్టర్ బ్లేమ్ చేయడమే కదా సార్ అని సుమన్ అన్నాడు.

ఇవి కూడా చదవండి : Serial Actress : సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది.. కట్ చేస్తే.. సీరియల్స్‏లో విలన్ అయ్యింది.. గ్లామర్ క్వీన్ రా బాబూ..

నేను షాకయ్యాను సార్.. ఇలా మాట్లాడుతుందని కలలో కూడా అనుకోలేదు అని డీమాన్ అన్నాడు. నాకు కనిపించింది.. నాకు అన్ కంఫర్ట్ గా ఉంది అని చెప్పడం తప్పేముంది సార్.. నాకు వాళ్లు అలా బిహేవ్ చేయడం నచ్చలేదు అని గట్టిగానే చెప్పింది సంజన. నువ్వు ఫీల్ అయ్యావా.. ? హౌస్ మొత్తం ఫీల్ అయ్యేలా చేశావా ? తనూజతో నువ్వు కూర్చుని మాట్లాడింది ఏంటీ.. వాళ్ల రిలేషన్ ఏంటనేది ఎంక్వైరీలు ఏంటీ.. అది నీ పనా అని అడిగారు. ఆ తర్వాత రీతూ, పవన్ రిలేషన్ గురించి హౌస్ మొత్తాన్ని అడగ్గా.. తమకు అన్ కంఫర్ట్ అనిపించలేదని చెప్పారు.

ఇవి కూడా చదవండి : Amala Paul : ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. అప్పుడు నాకు 17 సంవత్సరాలే.. హీరోయిన్ అమలా పాల్..

వాళ్లందరికీ అనిపించనిది నీకే ఎందుకు అనిపించింది. నామినేషన్లలో పర్సనల్ ఎజెండాలో పర్సనల్ అటాక్ చేశావ్ .. వాళ్ల రిలేషన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. నీకు కంఫర్ట్ గా లేకపోతే గేట్లు ఓపెన్ చేస్తా వెళ్లిపో.. బిగ్ బాస్ హౌస్ వాతావరణాన్ని స్పాయిల్ చేశావ్ కాబట్టి అంటూ సీరియస్ అయ్యారు నాగార్జున.

ఇవి కూడా చదవండి : Actress : ఇండస్ట్రీలో సంచలనం.. 20 ఏళ్లలో 3 పెళ్లిళ్లు.. 3 విడాకులు.. నెట్టింట హాట్ టాపిక్ ఈ హీరోయిన్..

బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా? ఈ పొరపాటు చేస్తే 50 శాతం నష్టమే!
బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా? ఈ పొరపాటు చేస్తే 50 శాతం నష్టమే!
14 ఏళ్లకే వ్యాపారం..19 ఏళ్లకే కోటీశ్వరుడు
14 ఏళ్లకే వ్యాపారం..19 ఏళ్లకే కోటీశ్వరుడు
గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్
గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్
మీరు వంటల్లో వాడే నూనె కల్తీదో.. కాదో..! ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా.
మీరు వంటల్లో వాడే నూనె కల్తీదో.. కాదో..! ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా.
నడుము, ఒంపులు తిప్పుతూ.. డాన్స్‌తో ఇరగదీసిన ఆంటీ..!
నడుము, ఒంపులు తిప్పుతూ.. డాన్స్‌తో ఇరగదీసిన ఆంటీ..!
అంబానీ ఇల్లుకు నెలకు విద్యుత్‌ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే షాకే!
అంబానీ ఇల్లుకు నెలకు విద్యుత్‌ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే షాకే!
ఎవరు జీవించాలో.. ఎవరు మరణించాలో నిర్ణయించడానికి మనం ఎవరం..?
ఎవరు జీవించాలో.. ఎవరు మరణించాలో నిర్ణయించడానికి మనం ఎవరం..?
ఆ హీరోయిన్‌తో ధనుష్ ప్రేమాయణం..పెళ్లి డేట్ కూడా
ఆ హీరోయిన్‌తో ధనుష్ ప్రేమాయణం..పెళ్లి డేట్ కూడా
ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే..
ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే..
సభ్య సమాజం సిగ్గుపడే ఘటన.. తల్లిని బస్టాండ్‌లో వదిలేసిన కూతురు!
సభ్య సమాజం సిగ్గుపడే ఘటన.. తల్లిని బస్టాండ్‌లో వదిలేసిన కూతురు!