Bigg Boss 7 Telugu: శివాజీ ఎలిమినేట్.. అమర్ వర్సెస్ ప్రశాంత్.. ఆ కంటెస్టెంట్‌ను టైటిల్ వరించేనా ?..
ఇప్పటికే అర్జున్ అంబటి, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఆరుగురు ఫైనలిస్టులు ఉండగా.. ఆరో స్థానంలో అంబటి అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ఐదో స్థానంలో ప్రియాంక ఎలిమినేట్ అయ్యింది. వీరిద్దరికి రూ.10 లక్షల సూట్ కేస్ ఆఫర్ చేశాడు బిగ్‌బాస్. కానీ ఇద్దరూ ఆ ఆఫర్ తిరస్కరించి ఖాళీ చేతులతో బయటకు వచ్చేశాడు. తర్వాత నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఎలిమినేషన్ కు ముందు యావర్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు.
బిగ్‌బాస్ సీజన్ 7 ముగింపుకు ఇంకా కొన్ని గంటలే ఉంది. రేపు ఆదివారం సాయంత్రం ఈసీజన్ విన్నర్ ఎవరనేది తెలియబోతుంది. ఉల్టా పుల్టా అంటూ ట్విస్టులతో కొనసాగిన ఈ సీజన్ చివరి నిమిషంలోనూ ఊత్కంఠ నెలకొంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ గ్రాండ్ ఫినాలే అప్డేట్స్ మాత్రం సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి. ఇప్పటికే అర్జున్ అంబటి, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఆరుగురు ఫైనలిస్టులు ఉండగా.. ఆరో స్థానంలో అంబటి అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ఐదో స్థానంలో ప్రియాంక ఎలిమినేట్ అయ్యింది. వీరిద్దరికి రూ.10 లక్షల సూట్ కేస్ ఆఫర్ చేశాడు బిగ్‌బాస్. కానీ ఇద్దరూ ఆ ఆఫర్ తిరస్కరించి ఖాళీ చేతులతో బయటకు వచ్చేశాడు. తర్వాత నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఎలిమినేషన్ కు ముందు యావర్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు.
మిగిలిన టాప్ 4 పైనలిస్ట్స్ అమర్, శివాజీ, ప్రశాంత్, యావర్ ముందు రూ.15 లక్షల సూట్ కేసు ఆఫర్ ఇవ్వగా.. ఆ సూట్ కేసు తీసుకుని ఎలిమినేట్ అయ్యాడు యావర్. ఒకవేళ యావర్ ఆ నిర్ణయం తీసుకోకపోతే.. నిజంగానే ఖాళీ చేతులతో ఎలిమినేట్ అయ్యేవాడు. ఇక ఆ తర్వాత మిగిలింది శివాజీ, అమర్, ప్రశాంత్. వీరి ముగ్గురి మధ్య హోరా హోరీ పోటీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో మూడో స్థానంలో ఉన్నాడు శివాజీ. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు శివాజీ సైతం ఎలిమినేట్ అయ్యారట. మిగిలింది అమర్, పల్లవి ప్రశాంత్. వీరిద్దరిలో ఎవరో ఒకరు విజేత కాబోతున్నారు. మరొకరు రన్నర్ కాబోతున్నారు. అయితే ఇప్పటికే ఎలిమినేషన్స్ అన్ని సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. కానీ విన్నర్, రన్నర్ అనే విషయం మాత్రం లీక్ కాలేదు.
View this post on Instagram
గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ఎపిసోడ్ శివాజీని ఎలిమినేట్ కావడంతోనే ముగిసిందని.. రేపు సాయంత్రం విన్నర్, రన్నర్ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్ ప్రకారం ప్రశాంత్ మొదటి స్తానంలో ఉండగా.. రెండో స్థానంలో అమర్ ఉన్నాడు. దీంతో ప్రశాంత్ విన్నర్ కావడం ఖాయమైనట్లే తెలుస్తోంది. ఈ క్రమంలోనే రైతు బిడ్డ ఫ్యాన్స్ నెట్టింట సంబరాలు స్టార్ట్ చేశారు. రైతు బిడ్డ విన్నర్.. సీజన్ 7 విజేత ప్రశాంత్ అంటూ నెట్టింట కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. కానీ ఇంకా అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. ఓటింగ్ పరంగా.. టాస్కుల పరంగా చూసుకుంటే ప్రశాంత్ విన్నర్ కావడం అని తెలుస్తోంది. కానీ ఈ సీజన్ ఉల్టా పుల్టా.. చివర్లో ఏదైనా ట్విస్ట్ ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఎలాంటి ట్విస్ట్ ఇవ్వకుండా ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం ఈసీజన్ విన్నర్ ప్రశాంత్ అని దాదాపు ఖాయమైనట్టే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.