Bigg Boss 7 Telugu: యావర్ నిర్ణయం సూపర్.. రూ.15 లక్షల సూట్‌కేస్‌తో ఎలిమినేట్ !..
నివారం గ్రాండ్ ఫినాలేలో అందరికంటే ముందే అర్జున్ ఎలిమినేట్ అయ్యారు. తర్వాత పొట్టి పిల్ల.. కానీ గట్టి పిల్ల అనిపించుకున్న ప్రియాంక జైన్ ఐదవ స్థానంలో ఎలిమినేట్ అయ్యింది. ఫిజికల్ టాస్కులలో అదరగొట్టిన ప్రియాంక.. టాప్ 6లో ఏకైక లేడీ కంటెస్టెంట్. గ్రాండ్ ఫినాలేకు సంబంధించి ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. కానీ ఎలిమినేట్ అవుతూనే ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇచ్చాడు యావర్.
ఉల్టా పుల్టాగానే సాగుతుంది బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే. శనివారం ఉదయం నుంచే గ్రాండ్ ఫినాలే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మొత్తం ఆరుగురు ఫైనలిస్ట్స్ మిగిలారు. అయితే ఇందులో ఆరవ స్థానంలో అర్జున్ అంబటి ఎలిమినేట్ అయ్యారు. ఫినాలే అస్త్ర సాధించి నేరుగా ఫైనలిస్ట్ అయిన సంగతి తెలిసిందే. కానీ గెలవాలంటే బలం కాదు..బలగం కూడా ముఖ్యమే అని తెలుసుకున్నాడు. దీంతో అత్యల్ప ఓట్లతో ఆరు స్థానంలో ఉండగా.. శనివారం గ్రాండ్ ఫినాలేలో అందరికంటే ముందే అర్జున్ ఎలిమినేట్ అయ్యారు. తర్వాత పొట్టి పిల్ల.. కానీ గట్టి పిల్ల అనిపించుకున్న ప్రియాంక జైన్ ఐదవ స్థానంలో ఎలిమినేట్ అయ్యింది. ఫిజికల్ టాస్కులలో అదరగొట్టిన ప్రియాంక.. టాప్ 6లో ఏకైక లేడీ కంటెస్టెంట్. గ్రాండ్ ఫినాలేకు సంబంధించి ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. కానీ ఎలిమినేట్ అవుతూనే ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇచ్చాడు యావర్.
ఎలాగు టైటిల్ రేసులో తాను లేనని ముందే అర్థమైందో.. ఏమో గానీ.. గ్రాండ్ ఫినాలేలో యావర్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ముందు ఎలిమినేట్ అయిన ప్రియాంక, అర్జున్ ఇద్దరికీ పది లక్షల సూట్ కేస్ ఆఫర్ చేయగా.. వారిద్దరూ దానిని తిరస్కరించారు. కానీ యావర్ మాత్రం అలా చేయలేదట. మొత్తం నలుగురు కంటెస్టెంట్స్ మిగలగా.. వారి ముందు రూ.15 లక్షల సూట్ కేసు ఆఫర్ చేశారట. దీంతో యావర్ ఆ సూట్ కేసు తీసుకుని నాలుగో స్థానంలో హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ యావర్ ఆ రూ.15 లక్షలు తీసుకోకపోయినా ఎలిమినేట్ అయ్యేవాడు. టైటిల్ రేసులో అమర్ దీప్, శివాజీ, ప్రశాంత్ ముగ్గురి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. ఇక ఆ తర్వాతి స్థానంలో యావర్ ఉన్నాడు. ఒకవేళ రూ.15 లక్షల ఆఫర్ కాదనుకుంటే మాత్రం యావర్ ఖాళీ చేతులతో బయటకు వెళ్లేవాడు.
ప్రిన్స్ యావర్.. బిగ్‌బాస్ సీజన్ 7కు ముంది అసలు జనాలకు పరిచయం లేని ముఖం. ఎలాంటి ఫేమ్ లేకుండానే సీజన్ 7లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. మొదటి రెండు వారాలు సైలెంట్‌గానే ఉన్నాడు. కానీ ఫిజికల్ టాస్కులలో మాత్రం అదరగొట్టేశాడు. ఇక తర్వాత గౌతమ్‌తో జరిగిన గొడవతో ఒక్కసారిగా హైలెట్ అయ్యాడు. తెలుగు సరిగ్గా రాకపోవడంతో సీరియల్ బ్యాచ్ అతడిని టార్గెట్ చేసింది. దీంతో యావర్ కు మరింత పాపులారిటి వచ్చేసింది. శివాజీ.. ప్రశాంత్.. యావర్ ఒక బ్యాచ్‌గా మారిపోయారు. ఆ తర్వాత ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేస్తూ వ్యక్తిత్వమే ముఖ్యమని చెప్పడంతో యావర్ కు ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. నిజానికి యావర్ రూ.15 లక్షల సూట్ కేస్ తీసుకోవడం మంచి నిర్ణయం. ఎందుకంటే.. తనకు చాలా లోన్స్ ఉన్నాయని.. పైనాన్సియల్ గా వీక్ అని చాలాసార్లు చెప్పాడు. ఇటు యావర్ అన్నయ్యలు సైతం తమ తమ్ముడు సూట్ కేసు తీసుకుంటే బెటర్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు అనుకున్నట్లు యావర్ రూ.15 లక్షలతో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. విన్నర్ అమౌంట్ నుంచి ఈ 15 లక్షలు కట్ చేస్తే మిగిలిన 35 లక్షలు మాత్రం విన్నర్ కు రాబోతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.