Bigg Boss 7 Telugu: ప్రియాంక ఎలిమినేట్.. బయటకు తీసుకువచ్చిన రవితేజ ?..
ప్రస్తుతం టైటిల్ రేసులో అమర్, శివాజీ, పల్లవి ప్రశాంత్ ఉండగా.. యావర్, అర్జున్, ప్రియాంక చివరి మూడు స్థానాల్లో నిలిచిపోయారు. శనివారం ఉదయం నుంచి గ్రాండ్ ఫినాలే షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే ఆరవ స్థానంలో ఉన్న అర్జున్ అంబటి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. అయితే అతడిని స్టేజ్ పైకి ఏ సెలబ్రెటీ తీసుకురాలేదని సమాచారం. గెస్టులు ఎవరు లేకుండానే అర్జున్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఐదో స్థానంలో ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది.
బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం విన్నర్ ఎవరనేది తెలియనుంది. గత సీజన్స్ అన్నింటికంటే… సీజన్ 7 సూపర్ హిట్ అయ్యింది. ఉల్టా పుల్టా అంటూ మొదలెట్టిన ఈ సీజన్.. కంటెస్టెంట్స్.. టాస్కులు.. బిగ్‌బాస్ ట్విస్టులతో ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ అందించాయి. ప్రస్తుతం టైటిల్ రేసులో అమర్, శివాజీ, పల్లవి ప్రశాంత్ ఉండగా.. యావర్, అర్జున్, ప్రియాంక చివరి మూడు స్థానాల్లో నిలిచిపోయారు. శనివారం ఉదయం నుంచి గ్రాండ్ ఫినాలే షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే ఆరవ స్థానంలో ఉన్న అర్జున్ అంబటి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. అయితే అతడిని స్టేజ్ పైకి ఏ సెలబ్రెటీ తీసుకురాలేదని సమాచారం. గెస్టులు ఎవరు లేకుండానే అర్జున్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఐదో స్థానంలో ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది.
ఈగల్ ప్రమోషన్స్ కోసం హౌస్ లోకి అడుగుపెట్టిన మాస్ మాహారాజా రవితేజ.. ప్రియాంక జైన్‌ను ఎలిమినేట్ చేశారు. హౌస్ నుంచి ఆమెను స్టేజ్ మీదకు తీసుకుని వచ్చారట. అయితే అంతకు ముందు ఆమెకు రూ. 10 లక్షల బ్రీఫ్ కేస్ ఆఫర్ చేసినట్లు సమాచారం. కానీ ఆమె ఆఫర్ తిరస్కరించిందని తెలుస్తోంది. దీంతో ఆమెను ఎలిమినేట్ చేసి స్టేజ్ పైకి తీసుకువచ్చారు రవితేజ. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో టాప్ 6 ఫైనలిస్ట్ లలో నిలిచిన ఒకే ఒక అమ్మాయి ప్రియాంక. స్ట్రాంగ్, మెచ్యూర్డ్ అమ్మాయిగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ప్రియాంక. అటు అబ్బాయిలతో ధీటుగా ఫిజికల్ టాస్కులు ఆడింది. అయితే సీరియల్ బ్యా్చ్ కావడం.. అమర్, శోభాతో కలిసి ఫుడ్ దొంగిలించడం.. కిచెన్ లో గొడవలు పడడం ఆమెకు మైనస్ అయ్యాయనే చెప్పాలి.
View this post on Instagram
ముఖ్యంగా భోలే షావలితో ప్రియాంక ప్రవర్తన మరింత దారుణం. చీ.. థూ అంటూ అతడిని దారుణంగా అవమానించింది ప్రియాంక. దీంతో ఆమెపై పూర్తిగా నెగిటివిటీ పెరిగిపోయింది. కానీ ఫిజికల్ టాస్కులలో మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా పోరాడింది. హౌస్ లో లేడీ ఫైటర్ గా నిలిచింది. కానీ అప్పటికే యావర్, అమర్, శివాజీ, ప్రశాంత్ అత్యధిక ఓటింగ్ తో టాప్ లో ఉండగా.. ప్రియాంక ఐదో స్థానంలో ఉండిపోయింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.