Bigg Boss 7 Telugu: శివాజీలా మారిపోయిన ప్రియాంక.. అమర్గా అర్జున్.. కామెడీ మాములుగా లేదు..
గత వారం రోజులుగా ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్కులు ఇస్తూ ప్రేక్షకులకు బోరింగ్ లేకుండా చేస్తున్నాడు బిగ్బాస్. ఇప్పటివరకు ఫైనలిస్టులకు ఇంటి భోజనం పంపించిన బిగ్బాస్.. ఆ తర్వాత అమర్, శివాజీలను జ్యోతిష్యులుగా మార్చి కామెడీ క్రియేట్ చేశాడు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్ లో ఫేమస్ టాస్కులను రీక్రియేట్ చేయించారు. హౌస్ లో మర్చిపోలేని కొన్ని సంఘటనలను రీక్రియేట్ చేయమని.. తమ తోటి కంటెస్టెంట్లను ఇమిటేట్ చేయాలని ఆదేశించారు బిగ్బాస్.
బిగ్బాస్ సీజన్ 7 ముగింపుకు వచ్చేసింది. రేపు (డిసెంబర్ 17న) విన్నర్ ఎవరనేది తెలియనుంది. ప్రస్తుతం హౌస్లో ఆరుగురు ఫైనలిస్ట్స్ ఉన్న సంగతి తెలిసిందే. అర్జున్, అమర్, యావర్, ప్రశాంత్, శివాజీ, ప్రియాంక ఫైనలిస్ట్స్ కాగా.. వీరిలో అమర్, శివాజీ, అమర్ టాప్ 3లో టైటిల్ రేసులో దూసుకుపోతున్నారు. అయితే గత వారం రోజులుగా ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్కులు ఇస్తూ ప్రేక్షకులకు బోరింగ్ లేకుండా చేస్తున్నాడు బిగ్బాస్. ఇప్పటివరకు ఫైనలిస్టులకు ఇంటి భోజనం పంపించిన బిగ్బాస్.. ఆ తర్వాత అమర్, శివాజీలను జ్యోతిష్యులుగా మార్చి కామెడీ క్రియేట్ చేశాడు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్ లో ఫేమస్ టాస్కులను రీక్రియేట్ చేయించారు. హౌస్ లో మర్చిపోలేని కొన్ని సంఘటనలను రీక్రియేట్ చేయమని.. తమ తోటి కంటెస్టెంట్లను ఇమిటేట్ చేయాలని ఆదేశించారు బిగ్బాస్. ఇక ఒక్కొక్కరి పాత్రలో ఒదిగిపోయారు కంటెస్టెంట్స్.
ముఖ్యంగా శివాజీగా మారిపోయిన ప్రియాంక అదరగొట్టేసింది. ముందుగా కెప్టెన్సీ టాస్క్ సమయంలో అమర్, ప్రియాంక.. కెప్టెన్సీ కోసం పోటీపడుతున్న టాస్క్ ఇచ్చారు. అందులో అమర్ పాత్రలో అర్జున్.. గౌతమ్ పాత్రలో అమర్, రతికగా ప్రియాంక కనిపించారు. అమర్ అర్జున్ పై బాల్స్ విసురుతున్నట్లు నటిస్తుండగా.. అమర్ ప్రవర్తనను అచ్చు దించేశాడు అర్జున్. అరుస్తూ.. ఏడుస్తూ గోల గోల చేశాడు. ఇక ఆ తర్వాత శివాజీ కాఫీ పౌడర్ కోసం సీరియస్ అయిన ఎపిసోడ్ ప్రియాంక రీక్రియేట్ చేసింది. శివాజీగా మారిపోయి కాఫీ కావాలంటూ గోల చేసింది.
కాఫీ పంపయ్యా.. నీకు దండం పెడతా .. తలుపులు తియ్యు నేను వెళ్లిపోతా అంటూ అటు ఇటు తిరుగుతుండగా.. ప్రశాంత్, యావర్ సైతం తిరిగారు. కాఫీ పంపించడం లేదనే కోపంతో మైక్ విసిరేసి వెళ్లి మంచంపై పడుకుంది ప్రియాంక. దీంతో శివాజీ మైక్ ధరించండి అని బిగ్బాస్ అనౌన్స్ చేశాడు. వెంటనే సోఫాలో కూర్చున్న శివాజీ ఒక్కసారిగా షాక్ అవుతూ తన మైక్ చూసుకుంటూ కన్ఫ్యూజ్ అయ్యాడు.
ఇక చివరగా.. నామినేషన్స్ సమయంలో ప్రశాంత్, అమర్ మధ్య జరిగిన గొడవను అర్జున్, శివాజీ రీక్రియెట్ చేశారు. ప్రశాంత్ గా అర్జున్.. అమర్ దీప్ గా శివాజీ కనిపించారు. అర్జున్ మాట్లాడుతుండగానే.. శివాజీ మధ్యలో జోక్యం చేసుకున్నాడు. అన్నా.. ముందు నన్ను చెప్పనివ్వు.. నువ్వు మాట్లాడతావు అంటూ అర్జున్ అనడంతో శివాజీ అచ్చుగుద్దినట్లు ఇమిటేట్ చేశాడు. మొత్తానికి చివరి రోజు కంటెస్టెంట్లతో కామెడీ టాస్కులు చేయిస్తున్నాడు బిగ్బాస్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.