Bigg Boss 5 Telugu: హౌస్‏లో నామినేషన్స్ హీట్.. ఆ ఇద్దరిపై విరుచుకుపడిన శ్రీరామచంద్ర..

బిగ్‏బాస్ సీజన్ 5 పదకొండు వారంలో ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇక 11వ వారంలో ఇంటి నుంచి బయటకు వచ్చింది

Bigg Boss 5 Telugu: హౌస్‏లో నామినేషన్స్ హీట్.. ఆ ఇద్దరిపై విరుచుకుపడిన శ్రీరామచంద్ర..
Bigg Boss Promo
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 22, 2021 | 1:17 PM

బిగ్‏బాస్ సీజన్ 5 పదకొండు వారంలో ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇక 11వ వారంలో ఇంటి నుంచి బయటకు వచ్చింది ఆనీ మాస్టర్. ఇక ఈరోజు ఇంట్లో నామినేషన్స్ ప్రక్రియ హీట్ పుట్టించినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన బిగ్‏బాస్ ప్రోమోలో నామినేషన్స్ ప్రకియలో ఇంటి సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచినట్లుగా తెలుస్తోంది. ఎవిక్షన్ పాస్ గెలుచుకునే టాస్కులో కాజల్ ఆడిన తీరుతో ఆమెను ఎక్కువ మంది సభ్యులు నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఎవిక్షన్ పాస్ టాస్కు సమయంలో సన్నీని సేవ్ చేసేందుకు తన స్టాటజీని ఉపయోగించింది. బజర్ మోగేవరకు ఎవరిని సేవ్ చేయడంలేదని తెల్చీ చెప్పింది. దీంతో ఆనీ మాస్టర్, సిరిల ఫోటోలు కాలిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయమై శ్రీరామచంద్ర ఆమెను నామినేట్ చేశాడు. కాజల్ ఆట తీరు నచ్చలేదని చెబుతూ ఆగ్రహంతో ఊగిపోయాడు. సన్నీని సేవ్ చేసేందుకు కాజల్ ఆ విధంగా తనకు నచ్చలేదని.. ఆమె చేసిన పనుల వలన ఆనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారంటూ ఆమెపై అరిచాడు శ్రీరామ్. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఒక్కరిని సేవ్ చేయాలని ఆడారు. నువ్వు ఇద్దర్ని అణచివేయాలని చూడడం నాకు నచ్చలేదంటూ ఊగిపోయాడు. దీంతో కాజల్ మాట్లాడుతూ.. నా గేమ్ పై నాకు క్లారిటీ ఉంది.. నా ఫ్రెండ్ ని సేవ్ చేయాలనుకున్నాను.. అందుకే అతనికి ఎవిక్షన్ పాస్ సొంతమయ్యేలా చేశానని ఆన్సర్ ఇచ్చింది.

దీంతో శ్రీరామ్ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. అంటే నీ ఫ్రెండ్ వెళ్లిపోతాడని భయమా? అంటూ ప్రశ్నించాడు. ఈ క్రమంలో మధ్యలో సన్నీ కల్పించుకోవడంతో శ్రీరామ్ మరింత ఆవేశపడిపోయాడు. నేను కాజల్ తో మాట్లాడుతున్నా.. నీ దగ్గరికి వచ్చినప్పుడు నీతో మాట్లాడతా అంటూ ఆన్సర్ ఇచ్చాడు శ్రీరామ్. ఇక గ్రూప్ గేమ్ అని శ్రీరామ్ అనగా.. షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ ఓ గ్రూప్ అంటూ సన్నీ బదులిచ్చాడు. ఇక శ్రీరామచంద్ర కాజల్, సన్నీలను నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read: Samantha: ఎట్టకేలకు రూమర్స్ పై స్పందించిన సమంత.. ఆ విషయాలపై నన్ను నేను ప్రశ్నించుకుంటా అంటూ..

Kaikala Satyanarayana: అత్యంత విషమంగా కైకాల సత్యనారాయణ ఆరోగ్యం.. తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు..