Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaikala Satyanarayana: అత్యంత విషమంగా కైకాల సత్యనారాయణ ఆరోగ్యం.. తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు..

టాలీవుడ్‌ దిగ్గజం కైకాల సత్యనారాయణ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కైకాల..

Kaikala Satyanarayana: అత్యంత విషమంగా కైకాల సత్యనారాయణ ఆరోగ్యం.. తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు..
Kaikala Satyanarayana
Follow us
Sanjay Kasula

| Edited By: Ravi Kiran

Updated on: Nov 22, 2021 | 12:17 PM

టాలీవుడ్‌ దిగ్గజం కైకాల సత్యనారాయణ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కైకాల. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు అపోలో ఆస్పత్రి వైద్యులు. ఐసీయూలో వెంటిలేటర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నామని..బీపీ లెవల్స్‌ తక్కువగా ఉన్నట్టు తెలిపారు.

విలన్‌గా వికటాట్టహాసం చేసినా, క్యారెక్టర్ యాక్టర్ గా కన్నీరు పెట్టించినా, కమెడియన్‌గా కడుపుబ్బ నవ్వించినా అది కైకాల స‌త్యనారాయ‌ణ‌కే చెందుతుంది. దాదాపు ఆరు ద‌శాబ్ధాలుగా ప్రేక్షకుల‌ని అల‌రించిన ఆయ‌న.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

కొద్దిరోజుల క్రితం త‌న ఇంట్లో జారిపడ్డారాయన. నొప్పులు కాస్త ఎక్కువ‌గా ఉండ‌డంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించి వైద్యం అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో.. జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్యనారాయణ కోలుకోవాలని నటీనటులు, అభిమానులు కోరుకుంటున్నారు.

ఇటీవలే కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’ అని చిరు త‌న‌ ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల.. ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారు 777 సినిమాల్లో నటించి.. తెలుగు అభిమానులను అలరించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Kinnera player Mogilaiah: ఆర్టీసీ బస్సు తల్లిలాంటిది.. మొగులయ్య పాటను షేర్ చేసిన సజ్జనార్..

PNB: ఆ బ్యాంక్ ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌.. కస్టమర్ల ఐడీ, పాస్‌వర్డ్‌ లీక్..