AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఎట్టకేలకు రూమర్స్ పై స్పందించిన సమంత.. ఆ విషయాలపై నన్ను నేను ప్రశ్నించుకుంటా అంటూ..

విడాకుల అనంతరం సామ్ తన దృష్టి మొత్తం కెరీక్ పై పెట్టేసింది. తన సన్నిహితులతో కలిసి ఎప్పటికప్పుడు షికార్లు చేస్తున్న

Samantha: ఎట్టకేలకు రూమర్స్ పై స్పందించిన సమంత.. ఆ విషయాలపై నన్ను నేను ప్రశ్నించుకుంటా అంటూ..
Samantha
Rajitha Chanti
|

Updated on: Nov 22, 2021 | 12:35 PM

Share

విడాకుల అనంతరం సామ్ తన దృష్టి మొత్తం కెరీక్ పై పెట్టేసింది. తన సన్నిహితులతో కలిసి ఎప్పటికప్పుడు షికార్లు చేస్తున్న సామ్.. మరోవైపు వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తుంది. కేవలం ప్రధాన పాత్రలకు మాత్రమే కాకుండా.. స్పెషల్ సాంగ్స్‏లో స్టెప్పులేయడానికి కూడా రెడీ అయిపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటికే సామ్.. ఒకట్రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా.. గత కొద్ది రోజులుగా సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా నెట్టింట్లో టాక్.

స్టార్ హీరో తాప్సీ సొంత ప్రొడక్షన్ బ్యానర్ పై సామ్ హిందీలో ఓ మూవీ చేయబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అందుకు తగినట్టుగానే సామ్… తాప్సీతో కలిసిన ఫోటో షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. సమంత నిజాంగానే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందని త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుందంటూ గుసగుసలు వినిపించాయి. తాజాగా తను బాలీవుడ్ ఎంట్రీపై వస్తున్న వార్తలపై సమంత ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. మంచి స్టోరీ వస్తే తప్పకుండా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తాను. నాకు కూడా హిందీలో సినిమాలు చేయాలని ఆసక్తిగా ఉంది. ప్రాజెక్ట్ ఓకే చేయాలంటే భాష పెద్ద సమస్య కాదు.. కథలో జీవం ఉందా ? లేదా ? అనేది చూడాలి. అలాగే.. ఆ కథను నేను సెట్ అవుతానా ? పాత్రకు నేను న్యాయం చేయగలనా ?.. అని ఏదైనా సినిమా ఓకే చేసేముందు ఇలా నన్ను ప్రశ్నించుకుంటాను అని చెప్పుకొచ్చింది..

ఇక సామ్.. ఇప్పటికే రాజ్ అండ్ డికే తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‏తో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో సామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. మొదట్లో ఈ సిరీస్ లో సామ్ పాత్రకు విమర్శలు వచ్చినా.. సిరీస్ విడుదల అనంతరం సమంత ప్రశంసలు అందుకుంది. యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కిన ఈ సిరీస్‏లో సమంత రాజీ అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇక తెలుగులో డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శాకుంతలం సినిమాలో నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తమిళంలో కాతువాకుల రెండు కాదల్ సినిమా చేస్తుంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయన్ లీడ్ రోల్ పోషిస్తుంది.

Also Read: Kaikala Satyanarayana: అత్యంత విషమంగా కైకాల సత్యనారాయణ ఆరోగ్యం.. తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు..

Marakkar Movie: తెలుగులో విడుదల కానున్న మోహన్ లాల్ సినిమా.. మరక్కార్ రిలీజ్ ఎప్పుడంటే..

Lijomol Jose: జైభీమ్ సినిమా కోసం ఎలుకల కూర తిన్నాను.. షాకింగ్ విషయాలను చెప్పిన సినతల్లి..