Bigg Boss 5 Telugu Promo: యాంకర్ రవికి చుక్కలు చూపించిన హౌస్‏మేట్స్.. ఒంటినిండా పేడ పూసి.. పేడ నీళ్లు పోసి..

బిగ్‏బాస్.. ఇప్పుడు రసవత్తరంగా సాగుతుంది. కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంటి సభ్యులకు విచిత్రమైన ఆటలు ఆడిస్తున్నాడు

Bigg Boss 5 Telugu Promo: యాంకర్ రవికి చుక్కలు చూపించిన హౌస్‏మేట్స్.. ఒంటినిండా పేడ పూసి.. పేడ నీళ్లు పోసి..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 03, 2021 | 3:57 PM

బిగ్‏బాస్.. ఇప్పుడు రసవత్తరంగా సాగుతుంది. కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంటి సభ్యులకు విచిత్రమైన ఆటలు ఆడిస్తున్నాడు బిగ్‏బాస్. ఇక తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్కులో భాగంగా… సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ అనే టాస్స్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలకు యాంకర్ రవికి చుక్కలు చూపించినట్లుగా తెలుస్తోంది.

యాంకర్ రవి.. జెస్సీ, విశ్వ, యానీ మాస్టర్, సన్నీ సూపర్ విలన్స్ కగా.. సూపర్ విలన్స్ టీంలో షణ్ముఖ్, కాజల్, సిరి, మానస్, ప్రియాంక ఉన్నారు. ఇక సూపర్ విలన్స్ టీంను రవి ముందుండి నడిపిస్తున్నాడని.. ముందు రవిని తగ్గించాలని.. షన్నూ.. కాజల్ మాట్లాడుకుంటూ కనిపించారు. మరోవైపు.. తాను బట్టలిప్పి నిలబడమన్నా నిలబడతా అంటూ చెప్పుకొచ్చాడు రవి.. ఇక ఆ తర్వాత రవికి ఒండి నిండా పేడ పూసి.. ఒంటిపై నుంచి పేడ నీళ్లు పోసుకునేట్టు చేస్తున్నారు సూపర్ హీరోస్ టీం. ఇక రవి కూడా ఏ మాత్రం బెదరకుండా.. పేడ పూసుకుని.. పైనుంచి పేడ నీళ్లు పోసుకున్నాడు.. అంతేకాకుండా.. కడుపు తిప్పే జ్యూస్‎లు ఇచ్చి.. రవితో తాగించారు.. ఈ క్రమంలోనే మానస్ డంబెల్స్ తెచ్చి అతనితో వర్కవుట్స్ చేయించాడు. ఇక ఆ రెండ డంబెల్స్ పట్టుకుని. కూర్చోని లేస్తున్నాడు రవి.. మరోవైపు.. నీకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ ఉంది.. అంటూ కాజల్ రవిని హెచ్చరించిన.. రవి ఏమాత్రం తగ్గకుండా టాస్కులో పోటీ ఇస్తున్నాడు. దీంతో ఈ రోజు ఎపిసోడ్ మరింత రసవత్తరంగా ఉండనున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. ఈ సమస్యలకు చెక్..

Puneeth Raj Kumar: రాబంధులను మించిపోయారు.. పునీత్ హఠాన్మరణాన్ని బిజినెస్‌కు వాడుకుంటున్న ఆసుపత్రులు..

Chinmayi Sripada: ఆ హక్కు నీకుంది.. ఎవరి పెత్తనం అవసరం లేదు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్..

Ravi teja: టైగర్‌ నాగేశ్వరరావుగా మాస్‌ మహారాజా.. పాన్‌ ఇండియాలో రవితేజ కొత్త సినిమా..