Puneeth Raj Kumar: రాబంధులను మించిపోయారు.. పునీత్ హఠాన్మరణాన్ని బిజినెస్‌కు వాడుకుంటున్న ఆసుపత్రులు..
Puneeth Raj Kumar death: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి
Puneeth Raj Kumar death: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి మొదలవ్వడంతో పునీత్.. వెంటనే బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరారు. వెంటనే వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. చికిత్స తీసుకుంటూనే పునీత్ తుదిశ్వాస విడిచారు. పునీత్ కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచారు. పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం అందరినీ కలచివేసింది. ఇప్పటికీ పునీత్ మరణ విషాదం నుంచి ఎవరూ కోలుకోలేకపోతున్నారు. సినిమా హీరోగానే కాకుండా.. ఆయన రియల్ హీరోగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. అందరి మనసుల్లో చెరిగిపోని ముద్రవేసుకున్నారు. బతికున్నంతకాలం.. ఆయన ఎందరికో అండగా నిలిచి.. సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. మరణం తర్వాత కూడా ఆయన నలుగురి జీవితాల్లో వెలుగును నింపారు. పునీత్ కళ్లతో నలుగురికి కంటిచూపును ప్రసాదించారు.
కాగా.. పునీత్ మరణాన్ని కూడా కొందరు రాబంధులు వ్యాపారం నిర్వహించేందుకు వాడుకుంటున్నారు. పునీత్ కార్డియాక్ అరెస్ట్‌తో మరిణించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి.. ఎలాంటి సందర్భాల్లో వస్తుంది అనే వార్తలు, విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కొన్ని ఆసుపత్రులు పునీత్ ఫొటో ముద్రించి.. కార్డియాక్ అరెస్ట్ నివారణకు చికిత్స చేస్తామంటూ.. ఆసుపత్రుల ఎదుట బోర్డులు ఉంచుతున్నారు. పునీత్‌కు శ్రద్ధాంజలి అంటూ పేర్కొంటునే.. ఆయన గుండె సంబంధిత వ్యాధితో చనిపోయారని.. అలాంటి గుండె జబ్బులు రాకుండా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హోర్డింగ్‌లో రాశారు.
కార్డియక్ ప్రొఫైల్ కేవలం రూ.300లకే తెలుసుకోండి.. అంటూ పునీత్ మరణాన్ని కొన్ని ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, పునీత్ అభిమానులు మండిపడుతున్నారు. పునీత్ మరణాన్ని కొన్ని రాబంధులు.. క్యాష్ చేసుకుంటున్నాయని.. ఇదేనా మీరిచ్చే గౌరవమంటూ నెట్టింట.. పలు ఆసుపత్రులపై దుమ్మెత్తి పోస్తున్నారు.
Also Read: