Ravi teja: టైగర్‌ నాగేశ్వరరావుగా మాస్‌ మహారాజా.. పాన్‌ ఇండియాలో రవితేజ కొత్త సినిమా..

ఈ ఏడాది ప్రారంభంలో 'క్రాక్‌' సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న రవితేజ వరసగా సినిమాలు చేస్తు్న్నాడు. ఇప్పటికే 'ఖిలాడీ', 'రామారావ్‌ ఆన్‌ డ్యూటీ'..

Ravi teja: టైగర్‌ నాగేశ్వరరావుగా మాస్‌ మహారాజా.. పాన్‌ ఇండియాలో  రవితేజ కొత్త సినిమా..
Follow us

|

Updated on: Nov 03, 2021 | 2:30 PM

ఈ ఏడాది ప్రారంభంలో ‘క్రాక్‌’ సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న రవితేజ వరసగా సినిమాలు చేస్తు్న్నాడు. ఇప్పటికే ‘ఖిలాడీ’, ‘రామారావ్‌ ఆన్‌ డ్యూటీ’, ‘ధమాకా’ సినిమాల్లో నటిస్తోన్న ఆయన బుధవారం మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. స్టువర్ట్‌ పురం దొంగల ముఠాలో కీలక సభ్యుడైన నాగేశ్వరరావు జీవిత కథతో తెరకెక్కుతోన్న ‘టైగర్‌ నాగేశ్వర రావు’ అనే చిత్రంలో ఆయన నటించనున్నారు. అభిషేక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాతో వంశీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

గజదొంగ జీవితకథతో.. ఈ సందర్భంగా ‘అక్కడ దొంగలు, దోపిడీ దారులు ఉండేవారు. అదేవిధంగా నాగేశ్వరరావు కూడా ఉన్నారు’ అంటూ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ట్విట్టర్‌లో పంచుకుంది చిత్ర బృందం. ‘ఫీల్‌ ది సైలెన్స్‌ బిఫోర్‌ హంట్‌’ అంటూ రిలీజ్‌ చేసిన ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక టైగర్‌ నాగేశ్వరరావు విషయానికొస్తే..1970వ దశకంలో ఈ గజదొంగ పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. చిక్కినట్లే చిక్కి పోలీసుల కళ్లు గప్పి చాకచక్యంగా తప్పించుకునేవాడు. 1987లో పోలీసులు నాగేశ్వరరావును మట్టుబెట్టారు. ఇది రవితేజకు 71 వ సినిమా. హీరోయిన్, ఇతర తారగణం వివరాలను త్వరలోనే తెలియజేస్తామంటూ చిత్రబృందం తెలిపింది.

Also read:

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ నుంచి మరో అప్డేట్‌.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న పవన్‌ కొత్త పోస్టర్‌..

Mirnalini Ravi : ఎర్రని మందారంలా మెరిసిన ముద్దుగుమ్మ మృణాళిని.. ఫోటోలు వైరల్

Jai Bhim: వివాదంలో మోనార్క్.. జై భీమ్ సినిమాలో ఆ సీన్ పై రచ్చ.. ఇంతకు అందులో ఏముందంటే..

ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్