Jai Bhim: వివాదంలో మోనార్క్.. జై భీమ్ సినిమాలో ఆ సీన్ పై రచ్చ.. ఇంతకు అందులో ఏముందంటే..
తమిళ్‌తోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు సూర్య
Jai Bhim: తమిళ్‌తోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు సూర్య. ఇటీవలే ఆకాశం నీ హద్దు రా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. ఈ క్రమంలోనే ఇప్పుడు జై భీమ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే సూర్య నటించిన జై భీమ్ సినిమా లోని ఓ సీన్‌పై రచ్చ రచ్చ నడుస్తోంది. హిందీలో మాట్లాడే వ్యక్తిని ప్రకాశ్‌రాజ్ చెంపచెళ్లుమన్పించే సీన్‌పై వివాదం నెలకొంది. హిందీలో కాదు తమిళంలో మాట్లాడూ.. అంటూ ఈ క్యారక్టర్ చెంపచెళ్లుమన్పిస్తాడు ప్రకాశ్‌రాజ్.. దీంతో హిందీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ భాష అయిన హిందీని ద్వేషించే వ్యక్తి ప్రకాశ్‌రాజ్ అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. హిందీ మాట్లాడే వ్యక్తిని జై భీమ్ సినిమాలో తమిళంలో మాట్లాడాలని ప్రకాశ్‌రాజ్ కొట్టే సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జై భీమ్ సినిమా తమిళం. హిందీతో పాటు చాలా భాషల్లో రిలీజ్ అయ్యింది. హిందీపై ద్వేషాన్ని రగిల్చే విధంగా ఈ సినిమాలో దృశ్యాలు చిత్రీకరించారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. నన్ను ఎందుకు కొడుతున్నారు సార్ అని వడ్డీ వ్యాపారి పోలీసు ఆఫీసర్‌గా నటించిన ప్రకాశ్‌రాజ్‌ను అడిగితే తమిళంలో మాట్లాడూ అంటూ ఆర్డర్ ఇస్తారు.
మరిన్ని ఇక్కడ చదవండి :