Allu Arjun: రికార్డులు తిరగరాస్తున్న ఐకాన్ స్టార్.. టాప్ 6లో నాలుగు బన్నీ ఖాతాలోనే ఉన్నాయిగా..!!

ఐకాన్ సార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప: ది రైజ్ సినిమాలోని మూడో పాట సామీ సామీ ఈ మధ్య విడుదలైంది.

Allu Arjun: రికార్డులు తిరగరాస్తున్న ఐకాన్ స్టార్..  టాప్ 6లో నాలుగు బన్నీ ఖాతాలోనే ఉన్నాయిగా..!!
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 03, 2021 | 1:28 PM

Allu Arjun: ఐకాన్ సార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప: ది రైజ్ సినిమాలోని మూడో పాట సామీ సామీ ఈ మధ్య విడుదలైంది. విడుదలైన మరుక్షణం నుంచి ఈ పాట రికార్డులు తిరగరాస్తోంది. అత్యధిక వ్యూస్ అత్యంత వేగంగా సాధించిన పాటగా సౌత్ ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించింది సామి సామి సాంగ్.

విడుదలైన 24 గంటల్లోనే 9 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలో కొత్త రికార్డు సృష్టించింది. మరే లిరికల్ వీడియోకు అయినా 24 గంటల్లో వచ్చిన అత్యధిక వ్యూస్ ఇవే. పుష్ప సినిమాలోని మొదటి పాట దాక్కో దాక్కో మేక 24గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు ఆ రికార్డును సామీ సామీ తిరగరాసింది. అత్యధిక వ్యూస్ సాధించిన మొదటి 6 టాలీవుడ్ లిరికల్ వీడియో సాంగ్స్ లో 4 అల్లు అర్జున్ ఖాతాలో ఉన్నాయి.

ఇందులో మొదటి రెండు స్థానాల్లో సామి సామి, దాక్కో దాక్కో మేక ఉన్నాయి. ఆ తర్వాత రాములో రాముల (7.37 million views), శ్రీవల్లి (7 million views) లిరికల్ వీడియోలు ఉన్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న విడుదల కానుంది.ఈ సినిమాలో ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. అలాగే రష్మిక డీ గ్లామర్ లుక్‌లో కనిపించనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anushka Sharma: అల్‌రౌండ్‌ ప్రతిభతో అదరగొట్టిన అనుష్కా శర్మ.. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మెరుపులు.. అసలు విషయమేంటంటే..

Akhanda Movie: బాలయ్య అభిమానులకు దీపావళి కానుక.. ‘అఖండ’ మూవీ అప్డేట్..

ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక మేరకు భీమవరంలో ఆ కుర్ర హీరో సినిమా స్పెషల్ ప్రీమియర్స్..