Anushka Sharma: అల్‌రౌండ్‌ ప్రతిభతో అదరగొట్టిన అనుష్కా శర్మ.. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మెరుపులు.. అసలు విషయమేంటంటే..

'88 బంతుల్లో 52 పరుగులు చేసిన అనుష్కా శర్మ.. తన ఇన్నింగ్స్‌లో ఐదు బౌండరీలు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. ఇండియా- బి స్కోర్‌140/0

Anushka Sharma: అల్‌రౌండ్‌ ప్రతిభతో అదరగొట్టిన అనుష్కా శర్మ.. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మెరుపులు.. అసలు విషయమేంటంటే..
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Nov 03, 2021 | 12:03 PM

’88 బంతుల్లో 52 పరుగులు చేసిన అనుష్కా శర్మ.. తన ఇన్నింగ్స్‌లో ఐదు బౌండరీలు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. ఇండియా- బి స్కోర్‌140/0 ‘ ఇది బీసీసీఐ మహిళల ట్విట్టర్‌ హ్యాండిల్‌లో షేర్‌ అయిన పోస్ట్‌. దీనిని చూడగానే చాలామంది అరే.. ‘విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క హీరోయిన్‌ కదా… ఆమె ఎప్పటి నుంచి క్రికెట్‌ ఆడడం ప్రారంభించింది’ అని అయోమయానికి లోనయ్యారు. అయితే ఆగండి.. ఈ పోస్ట్‌ విరాట్‌ భార్య గురించి కాదు. భారత అండర్‌- 19 మహిళల క్రికెట్ జట్టు బ్యాటర్‌ గురించి. ఆమె పేరు కూడా అనుష్కా శర్మనే కావడం గమనార్హం. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ వేదికగా జరుగుతోన్న ఇండియా ఉమెన్స్‌ అండర్- 19 ఛాలెంజర్స్‌ ట్రోఫీలో అనుష్క 72 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే మ్యాచ్‌ మధ్యలోనే ఆమె బ్యాటింగ్‌ను కొనియాడుతూ బీసీసీఐ మహిళల ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

వామికను ఎవరు చూసుకుంటున్నారు? మధ్యప్రదేశ్‌కు చెందిన అనుష్క ప్రస్తుతం ఇండియా ఉమెన్స్‌ అండర్- 19 ఛాలెంజర్స్‌ ట్రోఫీలో ఇండియా- బి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది . మంగళవారం ఇండియా- ఎ తో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఆల్‌రౌండ్‌ ప్రతిభను చూపింది. మొదట బ్యాటింగ్‌లో 72 పరుగులు చేసిన అనుష్క ఆ తర్వాత బౌలింగ్‌లోనూ ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి వెన్ను విరిచింది. ఫీల్డింగ్‌లోనూ రాణించి ఇద్దరు బ్యాటర్లను రనౌట్‌ చేసింది. ఇదిలా ఉండగా..బీసీసీఐ మహిళల ట్విట్టర్‌లో అనుష్కా శర్మ గురించి పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కోహ్లీ భార్య ఎప్పటి నుంచి క్రికెట్‌ ఆడుతోంది’, ‘భార్యాభర్తలిద్దరూ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఉంటే వామికను ఎవరు చూసుకుంటున్నారు ‘ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు, మీమ్స్‌లు పెడుతున్నారు.

Also Read:

Akhanda Movie: బాలయ్య అభిమానులకు దీపావళి కానుక.. ‘అఖండ’ మూవీ అప్డేట్..

Puneeth Raj kumar: అప్పు చివరి క్షణాలు.. భార్య ఒడిలో..! సీసీ ఫుటేజ్‌లో హాస్పిటల్‌కి వెళ్తూ.. (వీడియో)

ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక మేరకు భీమవరంలో ఆ కుర్ర హీరో సినిమా స్పెషల్ ప్రీమియర్స్..