Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: చివరి కెప్టెన్ టాస్క్ రచ్చ.. మానస్ నిర్ణయంపై సిరి అలక.. ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్‏…

బిగ్‏బాస్‏ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. ఇక చివరి కెప్టెన్సీ టాస్క్ కావడంతో ఇంటి సభ్యుల మధ్య పోరు రసవత్తరంగా సాగింది

Bigg Boss 5 Telugu: చివరి కెప్టెన్ టాస్క్ రచ్చ.. మానస్ నిర్ణయంపై సిరి అలక.. ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్‏...
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 24, 2021 | 7:07 AM

బిగ్‏బాస్‏ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. ఇక చివరి కెప్టెన్సీ టాస్క్ కావడంతో ఇంటి సభ్యుల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. చివరి కెప్టెన్ కావడం కోసం హౌస్ మేట్స్ పోటీపడ్డారు. కెప్టెన్సీ టాస్కులో భాగంగా నియంత మాటే శాసనం అనే టాస్క్ ఇచ్చారు బిగ్‏బాస్‏ . సైరన్ మోగిన ప్రతిసారీ నియంత సింహాసనంపై కూర్చున్న వ్యక్తి ఆ రౌండ్ లో సేఫ్ కావడంతోపాటు నియంతగా వ్యవహరిస్తారు. మిగిలిన ఇంటి సభ్యులు తమని తాము సేవ్ చేసుకోవడానికి ఛాలెంజ్ ఉంటుంది. అందులో చివరి స్థానంలో నిలిచిన ఇద్దరిలో ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ నియంతకు ఉంటుంది.

అయితే ఫస్ట్ రౌండ్ లో సింహాసనాన్ని దక్కించుకుంది. ఇందులో భాగంగ హుక్ టాస్క్ ఇవ్వగా.. రవి, సన్నీ చివరి వరకు నిలిచారు. ఇందులో రవిని సేవ్ చేసి సన్నీని డిస్ క్వాలిఫై చేయడంతో అతను ఫీల్ అయ్యాడు. ఇక ఆ తర్వాత శ్రీరామ్ సింహాసనాన్ని దక్కించుకున్నాడు. ఇందులో కాళ్లకు చెప్పుల్ని ధరించి వాటిని ఎదురుగా ఉన్న గోడపై వీలైనంత ఎత్తులో అతికించాల్సి ఉంటుంది. ఈ గేమ్ లో కాజల్, రవి చివరి వరకు నిలవగా.. కాజల్ ను చిక్కు ప్రశ్నలు వేస్తూ.. ఆనీ మాస్టర్ ఎలిమినేషన్ వరకు తీసుకెళ్లాడు. ఇక కాజల్ ను డిస్ క్వాలిఫై చేస్తూ.. రవిని సేవ్ చేశాడు. దీంతో చివరి సారి కూడా కెప్టెన్ కాలేకపోయానని కాజల్ ఏడ్చేసింది.

ఇక మూడోసారి రవి సింహాసనాన్ని దక్కించుకున్నాడు. ఇందులో భాగంగా.. ఆరెంజ్ టాస్క్ ఇచ్చారు. ఇందులో మానస్, షణ్ముఖ్ చివరి స్థానాల్లో నిలవగా.. షన్నూను సేవ్ చేసి.. మానస్ ను డిస్ క్వాలిఫై చేశాడు. ఇక ఆ తర్వాత ప్రియాంక సింహాసనాన్ని దక్కించుకుంది. ఇందులో వాటర్ డ్రమ్స్ గేమ్ ఇవ్వగా.. షణ్ముఖ్, శ్రీరామ్ చివరి స్థానాల్లో నిలిచారు. ఇక షన్నూను సేవ్ చేసి.. శ్రీరామ్ ను డిస్ క్వాలిఫై చేసింది పింకీ. దీంతో కాజల్ తెగ సంతోషపడిపోయింది.

ఇక ఐదో రౌండ్‏లో సిరి, ప్రియాంకలు ఇద్దర ఒకేసారి సింహాసనంపై కూర్చున్నారు. ప్రియాంక కంటే ముందు సిరి కూర్చున్నట్టుగా విజువల్‏లో చూపించారు. అయితే మానస్.. సిరి అటు తిరిగేసరికి లేట్ అయ్యిందని.. ప్రియాంకకు మద్దతు ఇచ్చాడు. దీంతో సిరి.. ఫేయిర్ గేమ్ కాదు..నేను ముందు కూర్చున్న అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇక రేపటి ఎపిసోడ్‏లో కెప్టెన్‏గా ఎవర్ని ఎంచుకోవాలో ఇంటి సభ్యులను నిర్ణయించాలని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‏బాస్‏. దీంతో సన్నీ, మానస్ మధ్య గొడవ జరిగినట్టుగా చూపించారు.

Also Read: Pooja Kannan: హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తున్న సాయి పల్లవి చెల్లెలు.. అక్కకు ఏమాత్రం తీసిపోని పూజ కన్నన్.. బ్యూటీఫుల్ ఫోటోస్..

Viral Photo: ముద్దులొలికే ఈ చిన్నారికి ఇప్పుడు అబ్బాయిల్లో పిచ్చ ఫాలోయింగ్! ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?