Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్‌లోకి క్రేజీ హీరోయిన్.. నాగార్జునతో నటించి.. ఇప్పుడు హౌస్‌లోకి.. ఇక రచ్చ రచ్చే..
బిగ్‌బాస్ రియాల్టీ షో గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఈసారి తెలుగులో తొమ్మిదో సీజన్ పై మంచి క్యూరియాసిటీ నెలకొంది. ఇక ఈ సీజన్ లో హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ ఎవరనేది తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ గేమ్ షో అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు బిగ్‌బాస్. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమళం భాషలలో విజయవంతంగా సాగింది. ఇప్పటివరకు తెలుగులో 8 సీజన్స్ పూర్తికాగా.. త్వరలోనే 9వ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈసారి హౌస్ లో కొత్త కండీషన్స్, సరికొత్త గేమ్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని రోజులుగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ పేర్లు నెట్టింట మారుమోగుతున్నాయి. సినిమా, టీవీ సెలబ్రేటీలతోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయేన్సర్స్ పేర్లు మారుమోగుతున్నాయి. తాజాగా హౌస్ లోకి ఓ క్రేజీ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందని టాక్.
ఇటీవల బిగ్‌బాస్ రియాల్టీ షోలో టీవీ సీరియల్స్ హీరోహీరోయిన్స్ తాకిడి ఎక్కువైన సంగతి తెలిసిందే. అందులోనూ కన్నడ బ్యూటీలు ఎక్కువగా సందడి చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో కన్నడ భామ హౌస్ లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఈసారి హౌస్ లోకి కన్నడ హీరోయిన్ కావ్య శెట్టి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కన్నడలో కావ్య శెట్టి పలు చిత్రాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. తెలుగులో గుర్తుందా శీతాకాలం సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. చేసిన సినిమాలన్నీంటిలో తన గ్లామరస్ లుక్స్, యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది. ఇక ఇప్పుడు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
అంతేకాదు.. కావ్య శెట్టి ఇదివరకు నాగార్జునతో కలిసి నటించింది. అయితే వీరిద్దరు కలిసి నటించింది సినిమాలో కాదు.. కళ్యాణ్ జ్యువెల్లర్స్ యాడ్ కోసం ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కావ్య శెట్టికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. గ్లామర్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ గ్లామరస్ బ్యూటీ బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలియడంతో.. ఈసారి హౌస్ లో హైలెట్ కానుందని తెలుస్తోంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి:
Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!
Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..







