AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor : అతడి నమ్మకాన్ని దోచేస్తున్నారు.. స్టార్ హీరో భార్య సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట ఆ నటుడు వ్యవహారం

ఈమధ్య ఓ స్టార్ హీరో పర్సనల్ విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. కొన్ని రోజులుగా అతడు తన భార్యతో విడాకులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని.. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే ఈ వార్తలపై ఇద్దరూ స్పందించకపోవడంతో అంతగా క్లారిటీ రాలేదు. ఇప్పుడు మరోసారి ఈ హీరో భార్య కారణంగా అతడి పేరు వార్తలలో నిలిచింది. అసలేం జరిగిందంటే..

Actor : అతడి నమ్మకాన్ని దోచేస్తున్నారు.. స్టార్ హీరో భార్య సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట ఆ నటుడు వ్యవహారం
Actor
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Nov 05, 2025 | 9:54 AM

Share

బాలీవుడ్ నటుడు గోవిందా, అతని భార్య సునీతా ఆహుజా మరోసారి వార్తల్లోకెక్కారు. కొన్ని నెలల కిందట ఈ ఇద్దరు దంపతులు విడిపోయారని వార్తల్లో చూశాం.. కానీ, అవి ఊహాగానాలని కొందరు కొట్టిపారేస్తున్నా ఈ విషయంపై పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. అయితే ఈ జంట ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలవడం వెనుక కారణం.. సునీతా ఆహుజా ఇటీవల ఇచ్చిన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో సునీతా మాట్లాడుతూ.. ‘గోవిందాతో పండితులు ఏవేవో కారణాలు చూపించి, పూజలు చేయించి డబ్బులు తీసుకుంటారు. అతని నమ్మకాన్ని దోపిడీ చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో సునీతా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఆమె ఎందుకు మాట్లాడారు.. అసలేం జరిగిందంటూ బాలీవుడ్ లోకంలో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి :  Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

సునీతా ఆహుజా ఆ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటల్లో.. గోవిందా కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సన్నిహితంగా ఉన్న పండిట్ ముకేశ్ శుక్లా పేరును కూడా ప్రస్తావించడంతో ఈ విషయం మరింత వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వేగంగా వైరల్ కావడంతో పండిత వర్గాలు, అభిమానులు సునీత వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది కాస్తా తీవ్ర వివాదాస్పదంగా మారడంతో ఆఖరికి గోవిందా స్వయంగా ఓ వీడియో విడుదల చేస్తూ దీనిపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. గోవిందా విడుదల చేసిన ఆ వీడియోలో.. ‘నా భార్య ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మా కుటుంబానికి సన్నిహితుడైన పండితుడు ముకేశ్ శుక్లా గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది. నా భార్య చేసిన వ్యాఖ్యలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. దాంతో పాటు ఈ విషయంపై అందరికీ క్షమాపణ చెబుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పండిట్ ముకేశ్‌తో పాటు ఆయన కుటుంబం తన కష్టసుఖాల్లో తోడుగా నిలిచారని.. తనని ఎంతో ఆదరిస్తారని అన్నారు. అలాంటి శుక్లా కుటుంబం తన జీవితానికి ఎంతో కావాల్సిన వారు అని.. వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తానని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..

గోవిందా వీడియో ద్వారా ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఈ వివాదంపై క్లారిటీ వచ్చింది. గోవిందా భార్య సునీతా చేసిన వ్యాఖ్యలపై అతను ఏకీభవించలేదని.. అంతేకాకుండా పండిట్ ముకేశ్ కుటుంబంతో కూడా తనకు ఎలాంటి విబేధాలు లేవని తెలిసొచ్చింది. గోవిందా వీడియో ద్వారా చెప్పిన మాటలను పండిట్ ముకేశ్ శుక్లా కుటుంబం కూడా స్వాగతించింది. వృత్తిపరంగా, కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా.. బయట ప్రపంచంలో గోవిందా వ్యవహరించే తీరుపై, అతని నడవడికపై అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సంఘటనతో గోవిందా మరోసారి తన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశారని.. అతనిలో సహజంగా ఉండే వినయాన్ని, ఇతరుల పట్ల గౌరవాన్ని మరోసారి నిరూపించుకున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Govinda

Govinda

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..