Bigg Boss 9 Telugu : సీక్రెట్ టాస్కులో ఇరగదీసిన సుమన్ శెట్టి.. కళ్యాణ్‌కు షాకిచ్చిన బిగ్ బాస్..
బిగ్‌బాస్ సీజన్ 9.. మొన్నటి వరకు నామినేషన్స్ ప్రక్రియ గరం గరంగా సాగిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండర్ షిప్ టాస్క్ మొదలైంది. హౌస్మేట్స్ కు సీక్రెట్ టాస్కులు ఇస్తూ.. అందరినీ మూడు టీంలుగా డివైడ్ చేశాడు బిగ్ బాస్. అందులో రెబల్స్ అంటూ ఇద్దరితో సీక్రెట్ టాస్కులు చేయించాడు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దామా.

బిగ్‌బాస్ సీజన్ 9.. నామినేషన్స్ ప్రక్రియ పూర్తైంది. మొన్నటి వరకు గరం గరంగా సాగిన ఎపిసోడ్.. నిన్న మాత్రం వరుస టాస్కులతో అల్లాడించారు. నిన్నటి టాస్కులో హౌస్మేట్స్ అందరినీ మూడు టీంలుగా విడగొట్టాడు. ఇక అందులో ఇద్దరిని రెబల్స్ గా డిసైడ్ చేసి సీక్రెట్ టాస్కులు ఇచ్చారు. కానీ ఈసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీక్రెట్ టాస్క్ అదరగొట్టాడు సుమన్ శెట్టి. ఎవరికీ అనుమానం రాకుండూ అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పిన సీక్రెట్ టాస్కులన్నీ పూర్తి చేశాడు. నిన్నటి ఎపిసోడ్ లో గార్డెన్ ఏరియాలో ఒక మూల టెలిఫోన్ చూసి అవాక్కయ్యారు. ముందుగా ఫోన్ రింగ్ కాగానే తనూజ లిఫ్ట్ చేసింది. దీంతో బిగ్ బాస్ మాట్లాడుతూ.. అందరూ మన మాటలు వింటున్నారు.. అందరిని దూరం వెళ్లమనండి అని చెప్పడంతో అదే మాట చెప్పింది తనూజ. దీంతో అందరూ అనుమానిస్తూనే వెళ్లిపోయారు. ఇప్పటినుంచి కంటెండర్‌షిప్ టాస్క్ మొదలైంది.. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి..అని బిగ్ బాస్ చెప్పగా అదే మాట చెప్పింది తనూజ. కానీ ఎవరూ నమ్మలేదు.
ఆ తర్వాత రీతూతో ఫోన్ లో మాట్లాడిన బిగ్ బాస్.. ఈవారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం జరిగే పోటీలో హౌస్మేట్స్ గెలవడానికి టీమ్స్ మద్దతు అవసరమని.. హౌస్మేట్స్ మధ్యలోనే రెబల్ ఉంటారని.. వారు మిమ్మల్ని పోటీ నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారని.. వారి నుంచి తప్పించుకుని ఆటలో కొనసాగడానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సమయానుసారం కొన్ని ఛాలెంజెస్ ఇస్తానని.. అందులో గెలిస్తే ఒక సేఫ్టీ కార్డ్ పొందుతారని.. ఏ టీమ్ అయితే సేఫ్టీ కార్డ్ గెలుస్తుందో ఆ టీమ్ తమ సబ్యుల్లో ఒకరిని రెబల్ చేసి ఎలిమినేషన్ నుంచి రక్షించగల్గుతారని .. ఈ ఇమ్యూనిటీ తదుపరి ఛాలెంజ్ వరకు మాత్రమే ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత సుమన్ శెట్టితో మాట్లాడిన బిగ్ బాస్.. మీరే రెబల్ అని.. సీక్రెట్ టాస్కులో చేయాలని సూచించాడు. ముందుగా ఫస్ట్ సీక్రెట్ టాస్క్ చిట్ బాత్రూంలోని వాష్ బేసిన్ కింద కేబినెట్ లో అతికించి ఉందని చెప్పాడు. దీంతో ఎవరూ చూడకుండా వెళ్లి ఈ చిట్టి తీసుకున్నాడు. కానీ అందులో స్పెట్స్ సరిగా లేవని.. ఇంగ్లీష్ లో పంపించాలని కోరాడు సుమన్.
ఆ తర్వాత తనూజ, ఇమ్మూ, గౌరవ్, రాము (ఆరెంజ్), రీతూ, భరణి, నిఖిల్, డీమాన్ ( బ్లూ ), దివ్య, కళ్యాణ్, సాయి, సుమన్ శెట్టి (పింక్) టీంలుగా డివైడ్ చేశారు. తర్వాత మరో రెబల్ గా దివ్యను సెలక్ట్ చేసిన బిగ్ బాస్.. ఆమెకు సైతం సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. సుమన్ శెట్టి దగ్గర ఉన్న చిట్టి ప్రకారం హౌస్ లో ఎవరైనా ముగ్గరినీ వాళ్లు కూర్చున్న ప్లేస్ నుంచి లేచేలా చేసి ఆ స్థానంలో కూర్చొవాలి. దీంతో ఆ టాస్కు సులభంగా కంప్లీట్ చేసింది దివ్య. ఆ తర్వాత సుమన్ శెట్టి, దివ్య కలిసి కెప్టెన్సీ రేసు నుంచి కళ్యాణ్ ను తప్పిస్తున్నట్లు చెప్పారు. దీంతో కళ్యాణ్ పేరు అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. ఆ తర్వాత రెండో సీక్రెట్ టాస్క్ చిట్టిని పేపర్ జైలులో ఉన్న దిండు కింద పెట్టారు. అందులో ఫుల్ టెట్రా ప్యాక్ పాలు తాగాలని.. మిగతావన్నీ తీసి స్టోర్ రూంలో పెట్టాలని చెప్పాడు. దీంతో తెల్లవారుజామున 3 సమయానికే వెళ్లి ఎవరూ చూడకుండా కిచెన్ టేబుల్ కిందకి దూరి గడగడా పాలు తాగేశాడు సుమన్. ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో ఉన్న పాల ప్యాకెట్స్ అన్నీ తెలివిగా స్టోర్ రూంలో పెట్టేశాడు. మొత్తానికి సీక్రెట్ టాస్కులో అదరగొట్టేశాడు సుమన్ శెట్టి.




