AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : పగలంతా అమ్మాయిలా, రాత్రంతా అబ్బాయిలా.. ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

ఓటీటీ వేదికలలోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీ లవర్స్ ముందుకు వస్తున్నాయి. తాజాగా ఒక డిఫరెంట్ స్టోరీ ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చింది. పగలంతా అమ్మాయిలా, రాత్రంతా అబ్బాయిలా ఉండే ఒక అబ్బాయే కథే ఇది. ఇంతకీ ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసుకుందామా.

Cinema : పగలంతా అమ్మాయిలా, రాత్రంతా అబ్బాయిలా.. ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
Double Occupancy
Rajitha Chanti
|

Updated on: Jul 10, 2026 | 4:07 PM

Share

చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కాన్సెప్ట్‌లతో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. ముఖ్యంగా తమిళ చిత్రసీమలో ఇలాంటి వైవిధ్యమైన కథాంశాలతో ప్రయోగాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అలా ఇటీవల థియేటర్లలో విడుదలై, మంచి టాక్ తెచ్చుకున్న క్రేజీ ఫాంటసీ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘డబుల్ ఆక్యుపెన్సీ’ (Double Occupancy). కోలీవుడ్ స్టార్స్ సంతోష్, రేష్మా వెంకటేష్, సంయుక్త విశ్వనాథన్, వినోత్ కిషన్ నటించిన తాజా తమిళ ఫాంటసీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. గత నెల జూన్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి అశ్విన్ కందస్వామి దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి, నిర్మాత ఖుష్బూ సుందర్ (అవ్ని సినిమాస్ బ్యానర్) , బెంజ్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.

ఎక్కువమంది చదివినవి : OTT Cinema : ఓటీటీలో గత్తరలేపుతున్న సినిమా.. ఒక్కో ట్విస్టు చూస్తే మతిపోవడం ఖాయం భయ్యా.. థ్రిల్లర్ ప్రియులకు సూపర్ ఛాయిస్..

కథ విషయానికి వస్తే.. ఈ సినిమా పాయింట్ చాలా వినూత్నంగా, ఆసక్తికరంగా ఉంటుంది. పుట్టుకతోనే ఒక విచిత్రమైన సమస్య (జెండర్ స్వాప్) వల్ల కథానాయకుడు/నాయకి ‘రజిని’ జీవితం రెండుగా చీలిపోతుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక అమ్మాయిలా (రేష్మా వెంకటేష్), మళ్లీ సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అబ్బాయిలా (సంతోష్) జీవించాల్సి వస్తుంది. పగలు ఒక బయోటెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, రాత్రి వేళల్లో ఒక బార్‌లో పనిచేసే ఈ క్యారెక్టర్ జీవితంలోకి ఉదయం ఒక అబ్బాయి, రాత్రి ఒక అమ్మాయి ప్రేమ రూపంలో వస్తారు. మరి ఈ వింత పరిస్థితి వల్ల రజిని ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? తన ప్రేమను ఎలా గెలిపించుకున్నారు? అనేదే ఈ చిత్ర కథాంశం.

ఎక్కువమంది చదివినవి : Anushka Shetty : ఆ సినిమాతో ఆయనకు పేరు వచ్చింది.. కానీ డబ్బులు రాలేదు.. అనుష్క కామెంట్స్..

యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించే ఈ క్రేజీ ఎంటర్‌టైనర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో డిజిటల్ ప్రీమియర్‌గా అందుబాటులోకి వచ్చింది. తమిళంతో పాటు పక్కా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తన దర్శకుడు అశ్విన్ కందసామి తెరకెక్కించిన ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ అందించిన సంగీతం, విటివి గణేష్ కామెడీ సినిమాకు అదనపు బలాన్నిచ్చాయి. రొటీన్ సినిమాలకు భిన్నంగా, వీకెండ్‌లో సరదాగా నవ్వుకుంటూ ఒక డిఫరెంట్ ఫాంటసీ మూవీని చూడాలనుకునే తెలుగు ప్రేక్షకులకు ప్రైమ్ వీడియోలో ఉన్న ‘డబుల్ ఆక్యుపెన్సీ’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

ఎక్కువమంది చదివినవి : Tollywood: చాలా టార్చర్ చేశారు.. ట్రైన్‏లో నుంచి దూకి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

ఎక్కువమంది చదివినవి : నవ్వులు పంచిన నటుడి జీవితంలో విషాదం.. గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..

Follow Us