AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: ఈ 3 రాశుల అమ్మాయిలు ఇంట్లో ఉంటే అదృష్టమే.. ఐశ్వర్యం వెల్లివిరుస్తుందట! మీది ఇదేనా?

Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ, సింహ, మీన రాశులకు చెందిన మహిళలు కుటుంబానికి అదృష్టం, ఐశ్వర్యం, ప్రశాంతతను తీసుకొస్తారని విశ్వసిస్తారు. ఈ మూడు రాశుల మహిళల ప్రత్యేకతలు, వారి వల్ల కుటుంబానికి కలిగే శుభఫలితాల గురించి తెలుసుకోండి.

Rajashekher G
|

Updated on: Jul 10, 2026 | 1:13 PM

Share
Lucky Women Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొంతమంది వ్యక్తుల రాకతో కుటుంబంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా కొన్ని రాశులకు చెందిన మహిళలు ఏ ఇంట్లో అడుగుపెడితే ఆ ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం, ప్రశాంతత పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. అలాంటి అదృష్టవంతులుగా భావించే మూడు రాశులు ఇవే.

1 / 5
1. వృషభ రాశి: ఈ రాశి మహిళలు ఓర్పు, సహనం, బాధ్యతకు ప్రతీకగా నిలుస్తారు. భూదేవిలా స్థిరమైన స్వభావం కలిగిన వీరు కుటుంబానికి బలమైన ఆధారంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. డబ్బును పొదుపు చేయడమే కాకుండా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సరైన పెట్టుబడులు పెట్టడంలో నైపుణ్యం చూపిస్తారు. వీరు ఉన్న ఇంట్లో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందని, అనవసర ఖర్చులు తగ్గుతాయని నమ్మకం. కష్టకాలంలోనూ కుటుంబానికి అండగా నిలబడి, ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే స్వభావం వీరిది. అందుకే వృషభ రాశి మహిళలను ఇంటి అదృష్టంగా భావిస్తారు.

2 / 5
2. సింహ రాశి: ఈ రాశి మహిళలు ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలకు ప్రతిరూపంగా ఉంటారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం వీరిని మహాలక్ష్మి అనుగ్రహం కలిగినవారిగా భావిస్తారు. ఏ పని ప్రారంభించినా దాన్ని విజయవంతంగా పూర్తి చేయాలనే పట్టుదల వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరి ఉనికి కుటుంబ సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సమాజంలో గౌరవం, గుర్తింపు పొందేలా ప్రోత్సహిస్తారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే వీరు కుటుంబ అభివృద్ధి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరు ఉన్న ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుందని నమ్ముతారు.

3 / 5
3. మీన రాశి: ఈ రాశి మహిళలు దయ, కరుణ, ప్రేమాభిమానాలకు నిలువెత్తు నిదర్శనం. గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండే ఈ రాశి స్త్రీలు ఆధ్యాత్మిక భావనతో జీవిస్తారని జ్యోతిష్యం చెబుతోంది. వీరు అడుగుపెట్టిన ఇంట్లో ప్రశాంతత, సామరస్యం, ఆనందం పెరుగుతాయని విశ్వసిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలను బలోపేతం చేయడంలో వీరి పాత్ర ఎంతో ముఖ్యమని చెబుతారు. పుట్టింటికైనా, మెట్టినింటికైనా అదృష్టాన్ని తీసుకొస్తారని నమ్మకం. వీరి స్వచ్ఛమైన మనసు, సానుకూల ఆలోచనలు కుటుంబంలో శుభశక్తిని పెంచి, ప్రతికూలతలను దూరం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించిన వాస్తవాలుగా కాకుండా, ఆధ్యాత్మిక విశ్వాసాల కోణంలో మాత్రమే పరిగణించాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

5 / 5
Follow Us