AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana News: తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్.. నేడు మళ్లీ అకౌంట్లోకి డబ్బులు.. రెడీగా ఉండండి..

తెలంగాణ రైతులకు భారీ శుభవార్త. రైతు భరోసా తుది విడత నిధులు శుక్రవారం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా నిధులు రిలీజ్ చేయనున్నారు. రైతు ఆశీర్వాద సభలో నిధులు రిలీజ్ చేయనున్నారు.

Telangana News: తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్.. నేడు మళ్లీ అకౌంట్లోకి డబ్బులు.. రెడీగా ఉండండి..
Rythu Bharosa Funds Released
Venkatrao Lella
|

Updated on: Jul 10, 2026 | 3:46 PM

Share

తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్. రైతు భరోసా చివరి విడత సాయం శుక్రవారం లబ్దిదారులైన రైతు ఖాతాల్లో జమ కానుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురంలో జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. మొత్తం రూ.1,009 కోట్లను రైతుల ఖాతాల్లో వేయనున్నారు. నేడు 9 నుంచి 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నగదు అందనుంది. వీటితో కలిపి మొత్తం రూ.8759 కోట్లను రైతులకు అందించినట్లు అవుతుంది. ఈ సారి 74 లక్షల రైతులకు సంబంధించిన 1.45 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించారు. ఇక సాంకేతిక కారణాలు, కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి త్వరలో నిధులు విడుదల చేయనున్నట్లు రేవంత్ సర్కార్ వెల్లడించింది.

మొత్తం రూ.9 వేల కోట్లు పంపిణీ

గత నెల 30వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో రైతు భరోసా తొలి విడత సాయాన్ని సీఎం రేవంత్ తన చేతుల మీదుగా విడుదల చేశారు. తొలి రోజు రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రూ.878 కోట్లు అందిదంచారు. అనంతరం ఆపైన భూమి ఉన్న రైతులకు విడతల వారీగా అందిస్తూ వస్తుండగా.. బుధవారం వరకు మొత్తం రూ.7750 కోట్లు రైతుల ఖాతాల్లో విడుదల చేశారు. మొత్తం రూ.9 వేల కోట్లను రైతు భరోసా కింద జమ చేశారు. దేశంలోనే ఇదే రికార్డు అని, 9 రోజుల్లోనే రైతులందరికీ అందించామని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం వానాకాలం సీజన్ మొదలుకావడంతో రైతులు పంటలు వేస్తున్నారు. దీంతో వారికి పెట్టుబడి సాయంగా ప్రభుత్వం వీటిని విడుదల చేసింది.

రైతు భరోసా స్టేటస్ చెక్ చేస్కోవడం ఎలా..?

-https://rythubharosa.telangana.gov.in పోర్టల్‌లోకి వెళ్లండి

-హోమ్ పేజీలో లాగిన్‌పై క్లిక్ చేయండి

-లబ్దిదారుడి పేరు, పాస్ వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా పూరించండి

-పాస్ వర్డ్ వివరాలు లేకపోతే మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి

-లాగిన్ అయ్యాక బెనిఫిషియరీ స్టేటస్, పేమెంట్ స్టేటస్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి

-ఆధార్ నెంబర్ లేదా పట్టాదారు పాస్ బుక్ నెంటర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి

-ఆ తర్వాత మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అనేది స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Follow Us