AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టు 12న ఆకాశంలో అరుదైన అద్భుతం.. పగలు సంపూర్ణ సూర్యగ్రహణం, రాత్రికి ఉల్కాపాతం.. భారత్‌లో కనిపిస్తుందా?

Total Solar Eclipse 2026: ఆగస్టు 12, 2026న ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. పగటిపూట సంపూర్ణ సూర్యగ్రహణం, అదే రాత్రి పర్సీడ్ ఉల్కాపాతం ఆకాశాన్ని అలరించనున్నాయి. ఈ అద్భుత ఘటన భారత్‌లో కనిపిస్తుందా? పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఆగస్టు 12న ఆకాశంలో అరుదైన అద్భుతం.. పగలు సంపూర్ణ సూర్యగ్రహణం, రాత్రికి ఉల్కాపాతం.. భారత్‌లో కనిపిస్తుందా?
August 12 Solar Eclipse
Rajashekher G
|

Updated on: Jul 10, 2026 | 2:46 PM

Share

ఖగోళ ప్రేమికులకు మరో అద్భుతమైన ఆకాశ వీక్షణ అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది ఆగస్టు 12న పగటిపూట అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం (Total Solar Eclipse), అదే రోజు రాత్రి ప్రపంచ ప్రసిద్ధ పర్సీడ్ (Perseid) ఉల్కాపాతం ఆకాశాన్ని అలరించనున్నాయి. ఒకే రోజులో రెండు అరుదైన ఖగోళ ఘటనలు చోటుచేసుకోవడం వల్ల ఈ సంఘటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

సూర్యగ్రహణం అంటే ఏమిటి?

సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖలో వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు భూమి, సూర్యుడి మధ్యకు వచ్చి సూర్యుడి కాంతిని కొంతసేపు పూర్తిగా లేదా పాక్షికంగా అడ్డుకుంటాడు. ఈ సంఘటన అమావాస్య రోజునే సంభవిస్తుంది. అయితే చంద్రుడి కక్ష్య భూమి కక్ష్యతో కొద్దిగా వంగి ఉండటం వల్ల ప్రతి అమావాస్య రోజూ సూర్యగ్రహణం ఏర్పడదు. మూడు ఖగోళ వస్తువులు దాదాపు ఖచ్చితమైన సరళరేఖలో ఉన్నప్పుడే గ్రహణం కనిపిస్తుంది. చాలా సూర్యగ్రహణాలు పాక్షికంగానే కనిపిస్తాయి. కానీ సంపూర్ణ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయడంతో సూర్యుని వెలుపలి కాంతి వలయం (కరోనా) స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చాలా అరుదైన దృశ్యం.

ఆగస్టు 12, 2026 సూర్యగ్రహణం ఎందుకు ప్రత్యేకం?

2026 ఆగస్టు 12న సంభవించే సంపూర్ణ సూర్యగ్రహణం గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, స్పెయిన్ ప్రాంతాలతో పాటు పోర్చుగల్ ఉత్తర-పశ్చిమ ప్రాంతంలోని కొద్దిపాటి ప్రాంతాల్లో కనిపించనుంది. నాసా (NASA) ప్రకారం, 1999 తర్వాత యూరప్ ప్రధాన భూభాగంలో కనిపించే తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే. అంటే దాదాపు 27 సంవత్సరాల తర్వాత యూరప్ ప్రజలు ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం పొందుతున్నారు. స్పెయిన్ విషయానికి వస్తే, అక్కడి ప్రధాన భూభాగంలో చివరిసారిగా 1905లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. దీంతో 120 సంవత్సరాలకు పైగా ఎదురుచూసిన అరుదైన ఖగోళ దృశ్యంగా ఇది నిలవనుంది.

ఇవి కూడా చదవండి

“సన్‌సెట్ ఎక్లిప్స్”గా ఎందుకు పిలుస్తున్నారు?

ఈ గ్రహణానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. స్పెయిన్, పోర్చుగల్ వాయువ్య ప్రాంతాల్లో గ్రహణం సాయంత్రం సూర్యాస్తమయానికి కొద్దిసేపటి ముందు సంభవించనుంది. సూర్యుడు అప్పటికే అస్తమించే దశలో ఉండటంతో, నారింజ రంగులో మెరిసే సూర్యుడి వెనుక నల్లటి చంద్రుడి నీడ, చుట్టూ ప్రకాశించే కరోనా ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. ఈ కారణంగానే దీనిని “సన్‌సెట్ ఎక్లిప్స్” (Sunset Eclipse) అని పిలుస్తున్నారు. ముఖ్యంగా మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల నుంచి వీక్షిస్తే ఈ దృశ్యం మరింత ఆకర్షణీయంగా కనిపించనుందని నాసా తెలిపింది.

సంపూర్ణ గ్రహణం ఎంతసేపు ఉంటుంది?

నాసా సమాచారం ప్రకారం, ఈ గ్రహణ మార్గంలో ఉన్న చాలా ప్రాంతాల్లో సంపూర్ణ గ్రహణం రెండు నిమిషాల కంటే తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. గ్రీన్‌లాండ్, ఉత్తర అట్లాంటిక్, రష్యా ప్రాంతాల్లో కూడా గరిష్ఠంగా రెండున్నర నిమిషాల లోపే సంపూర్ణ గ్రహణం ముగుస్తుంది.

అదే రాత్రి పర్సీడ్ ఉల్కాపాతం

ఈ అరుదైన సూర్యగ్రహణం ముగిసిన కొద్ది గంటల్లోనే ఖగోళ ప్రేమికులకు మరో అద్భుతం ఎదురుచూస్తోంది. ఆగస్టు 12 తేదీ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ ఉల్కాపాతాల్లో ఒకటైన పర్సీడ్ మీటియర్ షవర్ గరిష్ఠ దశకు చేరుకునే సమయంలో వస్తుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజునే జరుగుతుండటంతో ఆ రాత్రి చంద్రకాంతి ఉండదు. దీంతో ఆకాశం మరింత చీకటిగా ఉండి, ఉల్కాపాతాన్ని స్పష్టంగా వీక్షించే అవకాశం లభిస్తుంది. ఒకే రోజులో పగలు సంపూర్ణ సూర్యగ్రహణం, రాత్రి ఉల్కాపాతం కనిపించడం ఖగోళ శాస్త్రంలో అరుదైన సంఘటనగా చెప్పవచ్చు.

భారత్‌లో ఈ గ్రహణం కనిపిస్తుందా?

దురదృష్టవశాత్తు, భారత్‌లోని చాలా ప్రాంతాల నుంచి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించదు. నాసా విడుదల చేసిన అధికారిక గ్రహణ మ్యాప్ ప్రకారం, గ్రహణ మార్గం ఆర్కిటిక్ ప్రాంతం, ఉత్తర అట్లాంటిక్, యూరప్ వరకే పరిమితం అవుతుంది. అయితే కొన్ని ఖగోళ గణనల ప్రకారం, లడఖ్, జమ్మూ-కాశ్మీర్ ఉత్తర అంచుల్లో సుమారు 14 శాతం వరకు పాక్షిక సూర్యగ్రహణం కనిపించే అవకాశం ఉండొచ్చని సూచిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ కోసం నాసా లేదా సంబంధిత ఖగోళ సంస్థల తాజా సమాచారాన్ని పరిశీలించడం మంచిది. ఇక భారతదేశంలోని ఖగోళ ప్రేమికులు ఆగస్టు 12, 13 తేదీల తెల్లవారుజామున పర్సీడ్ ఉల్కాపాతంను వీక్షించే అవకాశం పొందవచ్చు.

Follow Us
Zudio బట్టలను అంత తక్కువ ధరలకు ఎలా ఇస్తుంది? బిజినెస్‌ సీక్రెట్!
Zudio బట్టలను అంత తక్కువ ధరలకు ఎలా ఇస్తుంది? బిజినెస్‌ సీక్రెట్!
స్కూల్ ప్రిన్సిపల్‌ హత్య కేసులో ట్విస్ట్.. చంపింది విద్యార్థులే
స్కూల్ ప్రిన్సిపల్‌ హత్య కేసులో ట్విస్ట్.. చంపింది విద్యార్థులే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని ఉప్పు నీరు తాగుతున్నారా? లాభాలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని ఉప్పు నీరు తాగుతున్నారా? లాభాలు
చాట్ తెరవకుండానే ఫోటోలు, వీడియోలు చూడవచ్చు.. కొత్త ఫీచర్..!
చాట్ తెరవకుండానే ఫోటోలు, వీడియోలు చూడవచ్చు.. కొత్త ఫీచర్..!
పాత బంగారం అమ్మేటప్పుడు కొన్న ధర కంటే తక్కువ ఎందుకు వస్తుంది?
పాత బంగారం అమ్మేటప్పుడు కొన్న ధర కంటే తక్కువ ఎందుకు వస్తుంది?
ఆగస్టు 19 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు..
ఆగస్టు 19 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు..
రతన్ టాటా లేదా నోయెల్ టాటా కాదు..టాటా గ్రూప్‌కు అసలు యజమాని ఎవరు?
రతన్ టాటా లేదా నోయెల్ టాటా కాదు..టాటా గ్రూప్‌కు అసలు యజమాని ఎవరు?
భర్తతో కలిసి హైదరాబాద్ జూను సందర్శించిన జబర్దస్త్ ఫైమా.. ఫొటోస్
భర్తతో కలిసి హైదరాబాద్ జూను సందర్శించిన జబర్దస్త్ ఫైమా.. ఫొటోస్
NTA పక్షాళన.. 600 మంది నిపుణుల తొలగింపు..CISF భద్రతలో కొత్త ఆఫీస్
NTA పక్షాళన.. 600 మంది నిపుణుల తొలగింపు..CISF భద్రతలో కొత్త ఆఫీస్
యశ్ 'టాక్సిక్' మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
యశ్ 'టాక్సిక్' మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?